బ్యాగులో గన్ పెట్టుకువెళ్లి.. స్కూల్లో కాల్పులు జరిపిన నర్సరీ చిన్నారి

బాధిత విద్యార్థి మూడో తరగతి చదువుతున్నాడని, ప్రస్తుతం అతడికి..

బ్యాగులో గన్ పెట్టుకువెళ్లి.. స్కూల్లో కాల్పులు జరిపిన నర్సరీ చిన్నారి

బడికెళ్లే చిన్నారులు బ్యాగులో పుస్తకాలతో పాటు లాలిపాప్‌లు, చాక్లెట్లు పెట్టుకు వస్తుండడం చూస్తూనే ఉంటాం. బిహార్‌లో ఓ ఐదేళ్ల బాలుడు మాత్రం బ్యాగులో తుపాకీ పెట్టుకొచ్చాడు. స్కూల్లోనే మరో విద్యార్థిని కాల్చాడు. సుపాల్ జిల్లాలోని సెయింట్ జోన్ బోర్డింగ్ స్కూల్‌లో ఈ ఘటన జరిగింది. దీనిపై కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

వారు తెలిపిన వివరాల ప్రకారం.. నర్సరీ విద్యార్థి తన స్కూల్ బ్యాగ్‌లో తుపాకీని దాచుకుని స్కూల్‌కి వెళ్లి పదేళ్ల బాలుడిపై కాల్పులు జరపడంతో అతని చేతికి గాయమైంది. బాధిత విద్యార్థి మూడో తరగతి చదువుతున్నాడని, ప్రస్తుతం అతడికి ఆసుపత్రిలో చికిత్స అందుతోందని పోలీసులు చెప్పారు.

తాను తరగతి గదికి వెళుతున్నప్పుడు నర్సరీ విద్యార్థి బ్యాగ్ నుంచి తుపాకీని తీసి తనపై కాల్పులు జరిపాడని బాధిత విద్యార్థి ఆసుపత్రి బెడ్ పై నుంచి మీడియాకు తెలిపాడు. తాను ఆ నర్సరీ విద్యార్థిని ఆపడానికి ప్రయత్నించానని, తన చేతిపై కాల్పులు జరిపాడని వివరించాడు. స్కూల్లో కాల్పుల ఘటనలు అమెరికా వంటి దేశాల్లో తరుచూ జరుగుతుంటాయి. మన దేశంలోనూ ఇటువంటి ఘటనలు మొదలవుతున్నాయి.

Also Read: కుక్కకు పూలమాల వేసి గ్రామంలోకి ఘన స్వాగతం పలికిన ప్రజలు.. ఊరంతా సంబరాలు.. ఎందుకంటే?