ఇండియాలో వరుస రైల్వే ప్రమాదాలకు కారణమేంటి.. ట్రైన్ యాక్సిడెంట్లకు ముగింపు లేదా?

ఏ టెక్నాలజీ లేని సమయంలోనే, మ్యానువల్‌గా నడిచినప్పుడే ట్రైన్ యాక్సిడెంట్లు పెద్దగా జరిగేవి కాదు. టెక్నాలజీ, అడ్వాన్స్డ్ సిగ్నల్ సిస్టమ్ అన్నీ వచ్చాక పెను విషాదాలు చోటు చేసుకుంటున్నాయి.

ఇండియాలో వరుస రైల్వే ప్రమాదాలకు కారణమేంటి.. ట్రైన్ యాక్సిడెంట్లకు ముగింపు లేదా?

Why Train Accidents Occur in India explained

India rail accidents: గతమంతా ఘనమే. కానీ ఇప్పుడే అంతా విషాదం. ఇది రైల్వేశాఖ పరిస్థితి. ఏ టెక్నాలజీ లేని సమయంలోనే, మ్యానువల్‌గా నడిచినప్పుడే ట్రైన్ యాక్సిడెంట్లు పెద్దగా జరిగేవి కాదు. టెక్నాలజీ, అడ్వాన్స్డ్ సిగ్నల్ సిస్టమ్ అన్నీ వచ్చాక పెను విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఒక్కో ట్రైన్ యాక్సిడెంట్‌లో వందల మంది చనిపోయిన ఘటనలు ఉన్నాయి. ఈ మధ్య జరిగిన రైల్వే ప్రమాదాల్లో ప్రాణనష్టమేమి జరగకపోయిన పట్టాలు తప్పడం, బోగీల లింకులు తెగిపోవడం, గాయపడటంతోనే నష్టం ఎండ్ అవుతూ వస్తోంది. ఏడాది కింద ఒడిశాలో జరిగిన రైల్ యాక్సిడెంట్ అయితే మరిచిపోలేని విషాదాన్ని నింపింది.

పోయినేడాది ఒడిశాలోని బాలాసోర్ ప్రమాదంలో మూడు రైళ్లు ఢీకొన్నాయి. 233 మంది చనిపోగా.. 9వందల మందికిపైగా గాయ‌ప‌డ్డారు. ఇదే ఈ మధ్య జరిగిన అతిపెద్ద ట్రైన్ యాక్సిడెంట్. ఆ తర్వాత పలుచోట్ల ట్రైన్లు ట్రాక్ తప్పినా, బోగీలు అదుపుతప్పి కిందపడినా పెద్దగా ప్రాణనష్టమేమి జరగలేదు. ఇప్పుడు జార్ఖండ్‌లోని ఓ గూడ్స్ రైలు ప‌ట్టాలు త‌ప్పి మ‌రో ట్రాప్‌పైకి బోగీలు ఒర‌గ‌డంతో అదే లైన్‌లో వ‌చ్చిన హౌరా-ముంబై ఎక్స్ ప్రెస్ ఢీకొట్టడంతో 18 బోగీలు ప‌ట్టాలు త‌ప్పాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు చనిపోగా 60 మందికి పైగా గాయపడ్డారు. నెల రోజుల క్రితం జరిగిన కంచ‌న్ జంగా ఎక్స్‌ప్రెస్ ప్రమాద ఘ‌ట‌నలో కూడా పలువురు గాయపడ్డారు.

భయంకరమైన రైలు ప్రమాద ఘటనలు
అంతకముందు కూడా దేశంలో అతి భయంకరమైన రైలు ప్రమాద ఘటనలు జరిగాయి. 1981లో బిహార్‌లో జ‌రిగిన రైలు ప్రమాదంలో దాదాపు 8 వందల మంది చనిపోయారు. భాగ‌మ‌తి న‌దిలో రైలు ప‌డిపోవ‌డంతో భారీగా ప్రాణన‌ష్టం జ‌రిగింది. 1995లో జ‌రిగిన ఫిరోజాబాద్ రైలు ప్రమాదంలో 358మంది చనిపోయారు. పురుషోత్తమ్ ఎక్స్‌ప్రెస్‌, కాలిండి ఎక్స్‌ప్రెస్‌లు ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఇక అవ‌ద్‌-అస్సాం ఎక్స్‌ప్రెస్ దుర్ఘట‌న‌లో 268 మంది ప్రాణాలు కోల్పోయారు. మ‌రో 359 మంది గాయ‌ప‌డ్డారు. 1999 ఆగ‌స్ట్ 2న బ్రహ్మపుత్ర మెయిల్ రైలు, అవ‌ద్‌-అస్సాం రైళ్లు ఢీకొన్నాయి.

Also Read: ఘాట్స్ ఓన్ స్టేట్‌ కేరళలో జలప్రళయం.. ప్రకృతి ప్రకోపమా.. మానవ తప్పిదమా?

1998లో జరిగిన ఖ‌న్నా రైలు ప్రమాద ఘటనలో 212 మంది చ‌నిపోయారు. జ‌మ్మూ తావి- సేల్దా ఎక్స్‌ప్రెస్ రైలు.. గోల్డెన్ టెంపుల్ మెయిల్‌కు చెందిన డీరైల్ బోగీల‌ను ఢీకొట్టింది. పంజాబ్‌లోని ఖ‌న్నాలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. జ్ఞానేశ్వరి ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదంలో 170 మంది మ‌ర‌ణించారు. ఆ తర్వాత కూడా ప్రభుత్వాలు ఎంత జాగ్రత్త తీసుకుంటున్నా ప్రమాదాలు తగ్గడం లేదు. ఇంజిన్, కోచ్‌లను కలిపే కప్లింగ్ విరిగిపోవడం, రైలు రెండు భాగాలుగా విడిపోవడం.. ఎదురెదురుగా వచ్చి ట్రైన్లు ఢీకొట్టడం, వెనక నుంచి వచ్చి మరో ట్రైన్‌ను ఢీకొట్టడం వంటివి జరుగుతూనే ఉన్నాయి.

Also Read: రోడ్డుపై డ్యాన్స్ చేస్తూ ట్రాఫిక్ పోలీస్ విధులు.. వీడియో షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా..

ప్రపంచంలోని అతిపెద్ద రైల్వే వ్యవస్థల్లో ఒకటిగా భారతీయ రైల్వేకు పేరు ఉంది. భారత రైల్వే ఏటా 2.5 కోట్లకుపైగా ప్రయాణికులకు సేవలు అందిస్తుంది. దేశవ్యాప్తంగా లక్ష కిలోమీటర్ల రైల్వే ట్రాకులను అప్‌గ్రేడ్ చేశారు. ఐనా రైళ్లు పట్టాలు తప్పడమనేది ప్రాణాంతకంగా మారుతోంది. ట్రాకుల నిర్వహణ సరిగ్గా లేక, కాలం చెల్లిన కోచ్లు, డ్రైవింగ్‌లో తప్పిదం.. ఇలా ఎన్నో రీజన్స్‌తో రైలు పట్టాలు తప్పుతెన్నాయి. ఇలా ఒక్కో రైలు ప్రమాదానికి ఒక్కో కారణం ఉంటోంది. అన్నింటిని సరిదిద్ది సేఫ్‌గా రైళ్లు ప్రయాణించేలా చేసేందుకు ఏళ్లుగా ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి.