కుక్కకు పూలమాల వేసి గ్రామంలోకి ఘన స్వాగతం పలికిన ప్రజలు.. ఊరంతా సంబరాలు.. ఎందుకంటే?

కుక్కను మహారాజ్ అని పిలుస్తారు. కుక్క యాజమాని కమలేశ్ కుంభర్. ప్రతీ సంవత్సం ఆషాడ ఏకాదశి, కార్తీక ఏకాదశి సమయంలో అతను పంఢర్ పూర్ కు వెళ్తాడు.

కుక్కకు పూలమాల వేసి గ్రామంలోకి ఘన స్వాగతం పలికిన ప్రజలు.. ఊరంతా సంబరాలు.. ఎందుకంటే?

Dog Returns Home

Dog Returns Home : కర్ణాటకలోని బెలగావి జిల్లాలో ఓ షాకింగ్ ఘటన వెలుగు చూసింది. జిల్లాలోని నిపాని తాలూకా యమగర్ని గ్రామంలో కొంతమంది నల్లటి కుక్కుకు పూలమాలవేసి గ్రామంలోకి ఘన స్వాగతం పలికారు. అంతేకాదు గ్రామస్తులకు విందుకూడా ఏర్పాటు చేశారు. ఇలా చేయడం ఆ గ్రామంలో ఆచారం అనుకుంటే తప్పులో కాలేసినట్లే. ఆచారం కాదు.. ఆ కుక్క తప్పిపోయి 250 కిలో మీటర్లు ప్రయాణించి తన సొంత గ్రామానికి చేరుకుంది. ఈ విషయాన్ని అద్భుతంగా భావించిన యాజమాని, గ్రామస్తులు సంబరాలు చేసుకున్నారు.

Also Read : నేను ఏం మోసం చేశా..? నన్నెందుకు టార్గెట్ చేస్తున్నావ్.. అసెంబ్లీలో రేవంత్ రెడ్డిపై సబిత ఫైర్

ఈ కుక్కను మహారాజ్ అని పిలుస్తారు. కుక్క యాజమాని కమలేశ్ కుంభర్. ప్రతీ సంవత్సం ఆషాడ ఏకాదశి, కార్తీక ఏకాదశి సమయంలో అతను దక్షిణ మహారాష్ట్రలోని పంధర్‌పూర్‌ కు వెళ్తాడు. గత నెల జూన్ లో మహారాజ్ (కుక్క)ను కూడా తీసుకొని వెళ్లాడు. మహారాజ్ కు భజనలు వినడం ఇష్టం. మహారాజ్ దాదాపు 250 కిలో మీటర్ల దూరం యాజమానితో కలిసి వెళ్లింది. ఈ క్రమంలో అది తప్పిపోయింది. విఠోబా ఆలయాన్ని సందర్శించిన తరువాత కుక్క తప్పిపోయింది. కమలేశ్ కుక్కకోసం వెతికినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. దీంతో కమలేశ్ తిరిగి ఇంటికి వచ్చాడు. ఎంతో ఇష్టంగా పెంచుకున్న కుక్క తప్పిపోయినందుకు బాధపడ్డాడు. గ్రామస్తులుసైతం కుక్క తప్పిపోయినందుకు బాదపడ్డారు.

Also Read : ఇండియాలో వరుస రైల్వే ప్రమాదాలకు కారణమేంటి.. ట్రైన్ యాక్సిడెంట్లకు ముగింపు లేదా?

జూలై 13వ తేదీన తప్పిపోయిన మహారాజ్ (కుక్క) తిరిగి గత నాలుగు రోజుల క్రితం తిరిగిన తన స్వగ్రామానికి వచ్చింది. ఇది గమనించి గ్రామస్తులు, కుక్క యాజమాని కమలేశ్ సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. 250 కిలో మీటర్ల దూరం ప్రయాణించి సొంత గ్రామానికి చేరుకోవటం పట్ల గ్రామస్తులు ఆశ్చర్యపోయారు. దీంతో కమలేశ్, గ్రామస్తులు కలిసి మహారాజ్ కు పూలమాలలు వేసి ఘనంగా గ్రామంలోకి స్వాగతం పలికారు. అంతేకాదు.. కమలేశ్ గ్రామస్తులకు విందుసైతం ఇచ్చాడు. ఈ విషయం తెలుసుకున్న చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.