Harbhajan Singh : గతంలో ఏం జరిగిందో గుర్తు చేసుకో.. పాక్ జ‌ర్న‌లిస్ట్‌కి హ‌ర్భ‌జ‌న్ సింగ్ స్ట్రాంగ్ కౌంట‌ర్‌..

వ‌చ్చే ఏడాది పాకిస్తాన్ వేదిక‌గా ఛాంపియ‌న్స్ ట్రోఫీ 2025 జ‌ర‌గ‌నుంది.

Harbhajan Singh : గతంలో ఏం జరిగిందో గుర్తు చేసుకో.. పాక్ జ‌ర్న‌లిస్ట్‌కి హ‌ర్భ‌జ‌న్ సింగ్ స్ట్రాంగ్ కౌంట‌ర్‌..

Harbhajan Singh sarcastic jibe at Pak journo over security issues in country

Harbhajan Singh : వ‌చ్చే ఏడాది పాకిస్తాన్ వేదిక‌గా ఛాంపియ‌న్స్ ట్రోఫీ 2025 జ‌ర‌గ‌నుంది. అయితే.. పాకిస్తాన్‌లో ఆడేందుకు భార‌త జ‌ట్టు సుముఖంగా లేదు. ఈ టోర్నీని హైబ్రిడ్ మోడ్‌లో నిర్వ‌హించాల‌ని ఇప్ప‌టికే ఐసీసీని బీసీసీఐ కోరిన‌ట్లుగా వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ క్ర‌మంలో పాక్‌కు చెందిన ఓ జ‌ర్న‌లిస్ట్.. హ‌ర్భ‌జ‌న్ సింగ్‌ను ల‌క్ష్యం చేసుకుని భార‌త జ‌ట్టును ఎగ‌తాళి చేసే ప్ర‌య‌త్నం చేశాడు. ఇందుకు హ‌ర్భ‌జ‌న్ సింగ్ దిమ్మ‌తిరిగే స‌మాధానం ఇచ్చాడు. పాక్‌కు టీమ్ఇండియాను పంప‌కూడ‌దు అన్న బీసీసీఐ నిర్ణ‌యానికి భ‌జ్జీ మ‌ద్ద‌తు ప‌లికాడు.

2006లో పాకిస్తాన్‌లో భార‌త జ‌ట్టు ప‌ర్య‌టించింది. ఈ ప‌ర్య‌ట‌న‌లో ఓ టెస్టు మ్యాచులో హ‌ర్భ‌జ‌న్ సింగ్ బౌలింగ్‌లో షాహిద్ అఫ్రిది ఓ ఓవ‌ర్‌లో వ‌రుస‌గా నాలుగు సిక్స‌ర్లు బాదాడు. ఇందుకు సంబంధించిన స్కోరు కార్డును పోస్ట్ చేశాడు పాకిస్తాన్ కు చెందిన జ‌ర్న‌లిస్ట్ ఫరీద్ ఖాన్. భార‌త జ‌ట్టు పాకిస్తాన్‌లో ప‌ర్య‌టించ‌క‌పోవ‌డానికి ఇదేనా కార‌ణం. భ‌ద్ర‌తా కార‌ణాలు చూపిస్తున్నారు అంటూ క్యాప్ష‌న్ ఇచ్చాడు.

Nikhat Zareen : పారిస్ ఒలింపిక్స్‌లో ఓట‌మి.. తెలంగాణ బాక్స‌ర్ నిఖ‌త్ జ‌రీన్ కీల‌క వ్యాఖ్య‌లు..

దీన్ని చూసిన హ‌ర్భ‌జ‌న్ సింగ్ మండిప‌డ్డాడు. స‌ద‌రు జ‌ర్న‌లిస్ట్‌కు గట్టి కౌంట‌ర్ ఇచ్చాడు. టీమ్ఇండియా పాక్‌లో ప‌ర్య‌టించ‌క‌పోవ‌డానికి మీరు అన్న‌ది కార‌ణం కాదు. ఆట‌లో గెలుపోట‌ములు స‌హ‌జం. స‌రైన కార‌ణం ఏంటో నేను చెబుతాను. ఇక్క‌డ ఓ ఫోటోను షేర్ చేశాను. దీన్ని మీరు గుర్తు ప‌ట్టారా ఎఫ్‌.. అయ్యో ఇక్కడ ఎఫ్ అంటే మ‌రేదో కాదు అది మీ పేరు (ఫ‌రీద్ ఖాన్‌). నేను చెప్పాల‌నుకున్న‌ది మీకు అర్థ‌మై ఉంటుంది అని భ‌జ్జీ రిప్లై ఇచ్చాడు.

ఇంత‌కీ భ‌జ్జీ పోస్ట్ చేసిన ఫోటో ఏంట‌ని అంటారా..? 2009లో పాకిస్తాన్ లో ప‌ర్య‌టించిన శ్రీలంక జ‌ట్టు పై ఉగ్ర‌దాడికి సంబంధించిన ఫోటో అది. అప్ప‌టి నుంచి ఆదేశంలో ప‌ర్య‌టించేందుకు ప‌లు దేశాలు నిరాక‌రిస్తూ వ‌స్తున్నాయి.

IND vs PAK : అభిమానుల‌కు పండ‌గే.. ఛాంపియ‌న్స్ ట్రోఫీలో మూడు సార్లు త‌ల‌ప‌డ‌నున్న భార‌త్‌, పాకిస్తాన్‌..!