Average Student Nani : ‘యావరేజ్ స్టూడెంట్ నాని’ మూవీ రివ్యూ..

యావరేజ్ స్టూడెంట్ నాని సినిమా నేడు ఆగస్టు 2న థియేటర్స్ లో రిలీజయింది.

Average Student Nani : ‘యావరేజ్ స్టూడెంట్ నాని’ మూవీ రివ్యూ..

Pawan Kumar Average Student Nani Movie Review and Rating

Average Student Nani Movie Review : డైరెక్టర్ పవన్ కుమార్ ఇప్పుడు హీరోగా మారి ‘యావరేజ్ స్టూడెంట్ నాని’ అనే సినిమాతో వచ్చాడు. ఈ సినిమాలో పవన్ కుమార్ హీరోగా నటించడమే కాక తనే ఈ సినిమాని నిర్మిస్తూ డైరెక్షన్ చేసాడు. సాహిబా భాసిన్‌, స్నేహ మాల్వియ హీరోయిన్స్ గా ఝాన్సీ, రాజీవ్ కనకాల ముఖ్య పాత్రల్లో నటించగా శ్రీ నీలకంఠ మహదేవ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఎల్‌ఎల్‌పి బ్యానర్‌పై ఈ సినిమాని నిర్మించారు. యావరేజ్ స్టూడెంట్ నాని సినిమా నేడు ఆగస్టు 2న థియేటర్స్ లో రిలీజయింది.

కథ విషయానికొస్తే.. నాని(యావరేజ్ స్టూడెంట్ నాని) సరిగ్గా చదవడని ఇంట్లో నాన్న(రాజీవ్ కనకాల) తిడుతూ ఉన్నా అమ్మ(ఝాన్సీ), అక్క(వివియా సంపత్) సపోర్ట్ చేస్తూ ఉంటారు. నానిపై అక్కకి ప్రేమ ఉన్నా నానికి అక్క ఇష్టం ఉండదు. బి.టెక్ ఎంట్రన్స్ లో నానికి ర్యాంక్ రాకపోవడంతో నాని అమ్మ ఏదో ఒకటి చేసి మెకానికల్ లో సీట్ సంపాదిస్తుంది. ఇక కాలేజీలో జాయిన్ అయ్యాక కాలేజీ డేస్, సీనియర్స్ ర్యాగింగ్ తో సాగుతున్న సమయంలో నాని తన సీనియర్ సారా(స్నేహ మాల్వియా)తో ప్రేమలో పడతాడు. ఈ విషయంలో సీనియర్స్ తో నానికి గొడవలు అవుతాయి.

ఓ జూనియర్ అను(సాహిబా భాసిన్) నానిని ఇష్టపడుతుంది. ఓ సమయంలో సారా వేరే వాళ్ళని ఎంగేజ్మెంట్ చేసుకుంటుంది. అదే సమయంలో నాని అక్కపై దాడి జరిగి కోమాలోకి వెళ్తుంది. అక్క తన కోసం చేసిన త్యాగం నానికి తెలుస్తుంది. దీంతో నాని చనిపోవాలనుకుంటాడు. మరి నాని ఏం చేసాడు? చివరికి నాని ఎవరితో ప్రేమలో ఉన్నాడు? నాని అక్క చేసిన త్యాగం ఏంటి? నాని అక్కపై ఎవరు దాడి చేసారు? నాని లైఫ్ లో సక్సెస్ అవుతాడా తెలియాలంటే తెరపై చూడాలి.

Also Read : VD 12 : విజ‌య్‌దేవ‌ర‌కొండ‌-గౌత‌మ్ తిన్ననూరి మూవీ నుంచి సాలీడ్ అప్‌డేట్‌..

సినిమా విశ్లేషణ.. ఓ మాములు అల్లరి చిల్లరగా తిరిగే స్టూడెంట్ లైఫ్ లో ఎలా సక్సెస్ అవుతాడు అనే కథాంశంతో గతంలో చాలా సినిమాలు వచ్చాయి. ఈ యావరేజ్ స్టూడెంట్ నాని కూడా అదే కోవలోకి చెందింది. అల్లరి చిల్లరిగా తిరిగే నాని ఇంజనీరింగ్ లో ఎలా జాయిన్ అయ్యాడు? ఇద్దరి అమ్మాయిలతో ప్రేమాయణం ఎలా సాగింది అని చూపిస్తూనే అక్క, అమ్మ ఎమోషన్ ని బాగానే పండించారు. అలాగే చదువు వేరు, ట్యాలెంట్ వేరు. చదువు లేకపోయినా క్యారెక్టర్, ట్యాలెంట్ ఉంటే చాలు లైఫ్ లో సక్సెస్ అవ్వొచ్చు అనే పాయింట్ ని ఎంటర్టైనింగ్ గా చూపించారు.

ఫస్ట్ హాఫ్ అంతా నాని అల్లరి, సారాతో ప్రేమాయణం, కాలేజీ ర్యాగింగ్ గొడవలు చూపించి ఇంటర్వెల్ ముందు సారా ఇంకొకరిని ఎంగేజ్మెంట్ చేసుకోవడం, అక్క కోమాలోకి వెళ్లడం చూపించి నెక్స్ట్ హీరో ఏం చేస్తాడు అని ఆసక్తి కలిగించారు. ఇక సెకండ్ హాఫ్ లో అనుతో ప్రేమాయణం, సారా మళ్ళీ రావడం, నాని లైఫ్ లో సక్సెస్ అవ్వడం చూపిస్తారు. ఇద్దరు హీరోయిన్స్ తో రొమాంటిక్ సీన్స్ కూడా బాగానే ఉన్నాయి. ఇద్దరు హీరోయిన్స్ తో వచ్చే ఒక మాస్ సాంగ్ మాత్రం థియేటర్స్ లో అదరగొడుతుంది.

నటీనటుల పర్ఫార్మెన్స్.. డైరెక్టర్ పవన్ కుమార్ హీరోగా మారి ఓకే అనిపించాడు. ఎమోషనల్ సీన్స్ లో మాత్రం మెప్పిస్తాడు. ఇద్దరు హీరోయిన్స్ సాహిబా భాసిన్‌, స్నేహ మాల్వియ అందానికే పరిమితమయ్యారు. స్నేహ కొన్ని సీన్స్ లో ఎమోషనల్ గా కూడా మెప్పిస్తుంది. ఒక మిడిల్ క్లాస్ తల్లి పాత్రలో ఝాన్సీ, తండ్రి పాత్రలో రాజీవ్ కనకాల బాగా నటించారు. హీరో అక్క పాత్రలో వివియా సంపత్ పర్వాలేదనిపించింది. మిగిలిన నటీనటులు కూడా ఓకే అనిపిస్తారు.

సాంకేతిక అంశాలు.. పవన్ కుమార్ హీరోనే దర్శకుడు కావడంతో డైలాగ్స్ బానే ఉన్నా స్క్రీన్ ప్లే ఇంకా కొంచెం బెటర్ గా రాసుకొని ఉంటే బాగుండు అనిపిస్తుంది. రొమాంటిక్ సాంగ్స్ విజువల్ గా బాగుంటాయి. మాస్ సాంగ్ బాగుంది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పర్వాలేదనిపిస్తుంది. సినిమాటోగ్రఫీ విజువల్స్ కూడా బాగానే ఉన్నాయి. ఇక హీరోనే నిర్మాత కూడా కావడంతో తన సబ్జెక్టు మీద కావాల్సినంత ఖర్చుపెట్టుకున్నారు.

మొత్తంగా యావరేజ్ స్టూడెంట్ నాని.. అల్లరి చిల్లరగా తిరిగే ఓ స్టూడెంట్ ప్రేమ కథలేంటి, లైఫ్ లో సక్సెస్ అయ్యాడా అని ఎంటర్టైనింగ్ గా చూపించారు. ఈ సినిమాకు 2.5 రేటింగ్ ఇవ్వొచ్చు.

గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.