ధరణి పేరుతో పేదల భూములు గుంజుకున్నారు, వందల ఎకరాల్లో ఫార్మ్ హౌస్‌లు కట్టుకున్నారు- మంత్రి సీతక్క

రైతుల ఆవేదన తొలగించేలా, భూములపై హక్కులు కల్పిస్తూ సమగ్ర చట్టం తీసుకొస్తాం. త్వరగా కొత్త రెవెన్యూ చట్టం తీసుకు రావాలని ప్రజలు అడుగుతున్నారు.

ధరణి పేరుతో పేదల భూములు గుంజుకున్నారు, వందల ఎకరాల్లో ఫార్మ్ హౌస్‌లు కట్టుకున్నారు- మంత్రి సీతక్క

Danasari Seethakka : గత ప్రభుత్వం ధరణి తెచ్చి రైతుల్లో భయం కల్పించిందని మంత్రి సీతక్క అన్నారు. ధరణి పేరుతో అనుభవదారు కాలం తొలగించి పేద రైతులకు అన్యాయం చేశారని ఆరోపించారు. భూములు అమ్ముకున్న వారికి తిరిగి పట్టాలు ఇచ్చారని చెప్పారు. బీఆర్ఎస్ నాయకులు తమ పేరు మీద భూములు రాసుకుని రైతుబంధు ఎంజాయ్ చేశారని మంత్రి సీతక ఆరోపణలు గుప్పించారు. ములుగుకి వస్తే తప్పులను నిరూపిస్తానని ఆమె సవాల్ విసిరారు. పేద రైతుల హత్యలు, అత్మహత్యలకు ధరణి కారణం అన్నారు.

”గత ప్రభుత్వం ధరణితో రెవెన్యూ తప్పులను సరిదిద్ద లేదు. ఇందిరా గాంధీ అంటేనే భూ పంపిణీకి ఆద్యురాలు. ఏడు విడతలుగా భూ పంపిణీ చేశారు. ఇప్పుడు ల్యాండ్ సీలింగ్ చట్టానికి తూట్లు పొడుస్తున్నారు. పేదల అసైన్డ్ ల్యాండ్ గుంజుకున్నారు. వందల ఎకరాల్లో ఫార్మ్ హౌస్ లు కట్టుకున్నారు. రైతుల ఆవేదన తొలగించేలా, భూములపై హక్కులు కల్పిస్తూ సమగ్ర చట్టం తీసుకొస్తాం. త్వరగా కొత్త రెవెన్యూ చట్టం తీసుకు రావాలని ప్రజలు అడుగుతున్నారు. రైతులకు భరోసా కల్పించేందుకు కొత్త చట్టం తెస్తున్నాం” అని అసెంబ్లీలో మంత్రి సీతక్క ప్రకటించారు.

ధరణిపై అసెంబ్లీలో అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం జరిగింది. ధరణి కారణంగా చాలా మంది ఇబ్బంది పడ్డారని, అందుకే మార్పులు చేస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. అందులో ఉన్న మంచిని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. అయితే, ధరణి కారణంగా ఎంతో ధైర్యంగా ఉంటున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. పేరు మార్చొద్దని సూచించారు. దీనికి మంత్రి సీతక్క ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. బీఆర్ఎస్ ఇంకా ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని ధ్వజమెత్తారు.

Also Read : కవిత వల్లే ఆ ఎమ్మెల్యే బీఆర్ఎస్‌ని వీడారా? అసలేం జరిగింది..