దోమల నివారణే దోపిడీ మార్గం.. జీహెచ్ఎంసీలో సీనియర్ ఎంటమాలజిస్ట్ బలవంతపు వసూళ్లు..!

మీరు ఏం చేస్తారో తెలీదు, నాకు మాత్రం డబ్బు ఇవ్వాల్సిందేనని ఆర్డర్ వేస్తున్నారు. ఆఫ్ట్రాల్ మీరు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు. నా మాట వినకుంటే మిమ్మల్ని ఉద్యోగంలోంచి తీసేస్తానని బెదిరించారు.

దోమల నివారణే దోపిడీ మార్గం.. జీహెచ్ఎంసీలో సీనియర్ ఎంటమాలజిస్ట్ బలవంతపు వసూళ్లు..!

GHMC Entomology Officer Corruption : దోమల నివారణే దోపిడీ మార్గంగా ఎంచుకున్న ఓ ఆఫీసర్ స్టోరీ ఇది. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను జలగలా పీడిస్తూ అక్రమార్జనే ధ్యేయంగా పని చేస్తున్న ఓ అవినీతి దోమ ”మచ్చర్ కహానీ” ఇది. చేయని ఫాగింగ్ కు ఫ్యూయల్ (పెట్రోల్, డీజిల్) బిల్లింగ్స్ తో ప్రభుత్వ ఖజానాకు సీనియర్ ఎంటమాలజిస్ట్ సంధ్య గండి కొడుతున్నారు. ఫాగింగ్ యూనిట్ల నుంచి బలవంతపు వసూళ్లు చేస్తున్న దృశ్యం 10టీవీ చేతికి చిక్కింది. డబ్బులు ఇవ్వాల్సిందే అంటూ హూంకరిస్తున్న సీనియర్ ఎంటామలజిస్ట్ సంధ్య ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల నుంచి బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నారు.

మీరు ఏం చేస్తారో తెలీదు, నాకు మాత్రం డబ్బు ఇవ్వాల్సిందేనని ఆర్డర్ వేస్తున్నారు. ఆఫ్ట్రాల్ మీరు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు. నా మాట వినకుంటే మిమ్మల్ని ఉద్యోగంలోంచి తీసేస్తానని బెదిరించారు. దీంతో గత్యంతరం లేక ఆమె అడిగిన మొత్తాన్ని సమర్పించుకుంటున్నారు. గతంలో సంధ్యపై ఇలాంటి ఆరోపణలు ఎన్నో ఉన్నాయి. వరంగల్ కార్పొరేషన్ లోనూ డీజిల్ అక్రమాలు, బెదిరింపుల కారణంగానే గతంలో సంధ్య సస్పెండ్ అయ్యారు. అయినా ఆమె తీరులో మార్పు లేదు. తాజాగా జీహెచ్ఎంసీలో ఆమె బలవంతపు వసూళ్లు తెరపైకి వచ్చాయి. సీనియర్ ఎంటమాలజిస్ట్ సంధ్య ఉద్యోగి నుంచి డబ్బులు తీసుకుంటున్న దృశ్యాలు కెమెరాకు చిక్కాయి.

సీజనల్ వ్యాధుల నివారణే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ఒకవైపు పని చేస్తుంటే, మరోవైపు అధికారిణి దోమల నివారణే దోపిడీ మార్గంగా మార్చుకుంది. చేయని ఫాగింగ్ కు డీజిల్, పెట్రోల్ బిల్లులు పెడుతూ ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతోంది. తన పరిధిలోని ఫాగింగ్ యూనిట్ల నుంచి బలవంతపు వసూళ్లు చేస్తోంది. ఇదేమిటి అని అడిగితే తనను ఎవరూ ఏమీ చేయలేరని, దిక్కున్న చోట చెప్పుకోవాలని గద్దిస్తున్నారు సీనియర్ ఎంటమాలజిస్ట్ సంధ్య. ఆమె పరిధిలో 9 సర్కిళ్లు ఉండగా ఒక్కో సర్కిల్ నుంచి నెలకు రూ.30వేలు వసూలు చేస్తున్నారు. ఫాగింగ్ చేయకున్నా పర్లేదు నా కమీషన్ మాత్రం నాకు రావాల్సిందేనని హూంకరిస్తున్నారు.

ఎన్నికల సమయంలో 10 రోజుల్లో జీహెచ్ఎంసీకి 4 లక్షల రూపాయలకుపైగా లాస్ జరిగింది అంటూ అంచనాలు ఉన్నాయి. ప్రతి నెల టార్గెట్లు ఫిక్స్ చేసి ఏఈల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని సీనియర్ ఎంటమాలజీ ఆఫీసర్ సంధ్యపై తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. పెట్రోల్, డీజిల్ వాడకంలో కోత విధించి ఆ మొత్తాన్ని తన ఖాతాలో వేసుకుంటున్నారనే ఆరోపణలూ ఉన్నాయి. ప్రతి నెల ఒక్కో ఏఈ నుంచి 30వేల రూపాయలు వసూలు చేస్తున్నారు సంధ్య. తాజాగా ఓ ఏఈ నుంచి కొంత డబ్బు తీసుకుంటూ సీక్రెట్ కెమెరాకు అడ్డంగా దొరికిపోయారు సీనియర్ ఎంటమాలజీ ఆఫీసర్ సంధ్య.

గ్రేటర్ హైదరాబాద్ లో ఓవైపు డెంగ్యూ, మలేరియా కేసులు విజృంభిస్తుంటే.. దోమలను నివారించే పేరుతో అధికారులు మోసాలకు పాల్పడుతున్నారు. ఫాగింగ్ చేయకుండానే చేసినట్లు రికార్డుల్లో రాసి పెట్రోల్, డీజిల్ బిల్లులు పెడుతున్నారు. ఒకవైపు ఫాగింగ్ చేసినట్లు సీనియర్ ఎంటమాలజిస్ట్ సంధ్య రికార్డుల్లో చెబుతుంటే.. మరోవైపు అబ్బే మేము ఫాగింగ్ చేయలేదని కార్మికులు ఒప్పుకుంటున్నారు. ఎన్నికల సమయంలోని 10 రోజుల్లో సీనియర్ ఎంటమాలజిస్ట్ సంధ్య దొంగ బిల్లులతో రూ.2లక్షలకుపైగా డబ్బులు తీసుకుంటున్నట్లు జీహెచ్ఎంసీ విజిలెన్స్ ఎంక్వైరీలోనూ నిజాలు బయటపడ్డాయి. తాము ఎన్నికలు, కౌంటింగ్ సమయంలో అసలు ఫాగింగ్ చేయలేదని విజిలెన్స్ అధికారులు ముందు ఫాగింగ్ సిబ్బంది ఒప్పుకున్నారు.

* దోమల నివారణే దోపిడీ మార్గం
* జీహెచ్ఎంసీలో సీనియర్ ఎంటమాలజిస్ట్ సంధ్య లీలలు
* చేయని ఫాగింగ్ కు పెట్రోల్, డీజిల్ బిల్లులు
* ఫాగింగ్ యూనిట్ల నుంచి బలవంతపు వసూళ్లు
* ఒక్కో సర్కిల్ నుంచి రూ.30వేలు వసూలు
* ఆమె పరిధిలో మొత్తం 9 సర్కిళ్లు
* ఎన్నికల సమయంలో 10 రోజుల్లో జీహెచ్ఎంసీ ఖజానాకు దాదాపు రూ.2లక్షలు నష్టం
* ప్రతి నెల టార్గెట్ ఫిక్స్ చేసి ఏఈల నుంచి డబ్బులు వసూలు
* డీజిల్, పెట్రోల్ వాడకంలో కోత
* ఆ మొత్తాన్ని తన ఖాతాలో వేసుకుంటున్న ఆఫీసర్

Also Read : బెంగళూరులో షాకింగ్ ఘటన.. మార్నింగ్ వాక్ చేస్తున్న మహిళపై లైంగిక దాడి, వెనుక నుంచి వచ్చి గట్టిగా పట్టుకుని..