అందుకోసమే ఫోర్త్ సిటీ..! రేవంత్ ప్రభుత్వంపై బండి సంజయ్ సంచలన ఆరోపణలు

ధరణి పేరుతో దాదాపు 2లక్షల కోట్ల స్కామ్ జరిగిందని గతంలో మీరు ఆరోపించారు. దానిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు.

అందుకోసమే ఫోర్త్ సిటీ..! రేవంత్ ప్రభుత్వంపై బండి సంజయ్ సంచలన ఆరోపణలు

Bandi Sanjay : కేంద్ర మంత్రి బండి సంజయ్ హాట్ కామెంట్స్ చేశారు. ఫోర్త్ సిటీ పేరిట కాంగ్రెస్ భూ దందా చేస్తోందని ఆరోపించారు. వేల ఎకరాలను సేకరించి దోచుకునే కుట్ర చేస్తోందన్నారు. ధరణి, భూముల అన్యాకాంత్రంపై శ్వేతపత్రం విడుదల చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. ధరణిపై వేసిన కమిటీ ఏం తేల్చిందో చెప్పాలన్నారు. కేసీఆర్ కుటుంబం భూ దోపిడీపై చర్యలు ఏవి అని నిలదీశారు బండి సంజయ్.

మహేశ్వరం నియోజకవర్గంలోని గుర్రంగూడలో పర్యటించిన కేంద్రమంత్రి బండి సంజయ్.. ప్రభుత్వం ఏర్పాటు చేస్తామన్న ఫోర్త్ సిటీ అంశంపై సంచలన ఆరోపణలు చేశారు. ఫోర్త్ సిటీ వెనుక కాంగ్రెస్ భూదందా ఉందన్నారు. వేల ఎకరాలు సేకరించి దోచుకునే కుట్రను కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తోందన్నారు. ఎన్నికల సమయంలో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంపై కాంగ్రెస్ చేసిన ఆరోపణలను నిగ్గు తేల్చాలని రేవంత్ సర్కార్ ను డిమాండ్ చేశారు బండి సంజయ్. దాన్ని పక్కన పెట్టి.. ఫోర్త్ సిటీ పేరుతో భూదందాకు తెరలేపారని మండిపడ్డారు.

”ధరణి పేరుతో దాదాపు 2లక్షల కోట్ల స్కామ్ జరిగిందని గతంలో మీరు ఆరోపించారు. దానిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు. దేశంలోనే అతిపెద్ద స్కామ్ గా ధరణిని పేర్కొంటున్న నేపథ్యంలో.. ఎలాంటి అంశాలు తేల్చారో కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పాలి. చూస్తుంటే బీఆర్ఎస్ బాటలోనే కాంగ్రెస్ కూడా నడుస్తోంది. మరో భూదందాకు కాంగ్రెస్ తెరలేపింది” అని బండి సంజయ్ ఆరోపించారు.

మహేశ్వరం నియోకజవర్గం కందుకూరు మండలంలో ముచ్చర్ల ప్రాంతాన్ని ఫోర్త్ సిటీగా తీర్చిదిద్దుతామన సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే. బోనాల పండుగ సందర్భంగా ఇవాళ అదే నియోజకవర్గంలో పర్యటించిన బండి సంజయ్.. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ఆరోపణలు రాజకీయవర్గాల్లో హీట్ పెంచాయి. చర్చకు దారితీశాయి.

ఈ ప్రాంతాన్ని ఫోర్త్ సిటీగా చేస్తాము, మరో నగరాన్ని నిర్మిస్తాము, ఎకో ఫ్రెండ్లీగా ఉంటుందని సీఎం రేవంత్, కాంగ్రెస్ నేతలు చెబుతున్న నేపథ్యంలో బండి సంజయ్ చేసిన తీవ్ర ఆరోపణలు రాజకీయవర్గాల్లో డిస్కషన్ కు దారితీశాయి. ఫార్మా సిటీ కోసం వేల ఎకరాల భూమిని సేకరించారు. ఆ భూమిని కబ్జా చేసేందుకే ఫోర్ట్ సిటీ అంశాన్ని తెరపైకి తెచ్చారని బండి సంజయ్ చెబుతున్నారు.

36లక్షల మంది రైతులు ఉంటే.. ఇప్పటివరకు రుణమాఫీ 18లక్షల మందికే అయ్యిందని, మిగతా వారికి ఎప్పుడు అవుతుందని రేవంత్ సర్కాన్ ను బండి సంజయ్ ప్రశ్నించారు. మహేశ్వరం నియోజకవర్గంలో ముచ్చర్ల ప్రాంతాన్ని ఫోర్ట్ సిటీగా మారుస్తామన్న రేవంత్ ప్రభుత్వం ప్రకటన వెనుక ఒక కుట్ర అయితే ఉంది అంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ లేవనెత్తిన అంశంపై కాంగ్రెస్ వర్గాలు కానీ, ప్రభుత్వ వర్గాలు కానీ ఏ విధంగా స్పందిస్తాయో చూడాలి.

Also Read : వరంగల్‌ కాంగ్రెస్‌లో అంతా పెద్దలే… పెత్తనం మాత్రం మంత్రి పొంగులేటికి..