బంగ్లా ప్రధాని పీఠాన్ని కూల్చిన రిజర్వేషన్ల లొల్లికి కారణాలు ఏంటి? పాకిస్థాన్ హస్తమూ ఉందా?

అధికారంలో ఉన్న షేక్ హసీనా ఆధ్వర్యంలోని బంగ్లాదేశ్‌ అవామీ లీగ్ పార్టీ.. భారత్‌కు అనుకూలంగా ఉందన్న ఆవేదనతో పాక్ టెర్రరిస్ట్..

బంగ్లా ప్రధాని పీఠాన్ని కూల్చిన రిజర్వేషన్ల లొల్లికి కారణాలు ఏంటి? పాకిస్థాన్ హస్తమూ ఉందా?

Sheikh Hasina

నెలల తరబడి నిరసనలు.. ఆందోళనలతో రగిలిపోయిన రచ్చలో వందలాది మంది మృతి. కొన్నాళ్లుగా రిజర్వేషన్ల గొడవతో అట్టుడికిన బంగ్లాదేశ్‌ చివరకు సైనిక పాలనలోకి వెళ్లిపోయింది. బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హాసీనా గద్దె దిగాల్సి వచ్చింది.

ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా కొన్ని నెలల క్రితం శాంతియుతంగా మొదలైన నిరసనలు.. ఊహించని పరిణామాలకు దారితీశాయి. దేశవ్యాప్తంగా చెలరేగిన హింసాత్మక ఘటనలతో షేక్‌ హసీనా ప్రభుత్వం వణికిపోయింది. వందలాది మంది ప్రాణాలు కోల్పోవడంతో చివరకు దేశ ప్రధాని గద్దెదిగాల్సి వచ్చింది.

కొన్ని నెలలుగా జరుగుతోన్న ఆందోళన.. రెండు, మూడ్రోజుల నుంచి మరింత హింసాత్మకంగా మారాయి. ఏకంగా ప్రధాని ఇంటిని ముట్టడించారు ఆందోళనకారులు. పరిస్థితి చేయిదాటిపోవడంతో చివరకు షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేశారు. తన సోదరి షేక్ రెహానాతో కలసి ఆర్మీ హెలికాప్టర్‌లో దేశం విడిచి సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోయారు.

45 నిమిషాల గడువు
పరిస్థితులు ఆందోళనకరంగా మారడంతో షేక్ హసీనాను ప్రధాని పదవికి రాజీనామా చేయాలని ఆర్మీ 45 నిమిషాల గడువు పెట్టినట్లు తెలుస్తోంది. అంతే కాదు భద్రతా కారణాల దృష్ట్యా దేశం వెడిచి వెళ్లాలని చెప్పినట్లు సమాచారం. అందుకే ప్రధాని పదవికి రాజీనామా చేయగానే ఆమె భారత్‌కు చేరుకున్నారు. యూపీలోని ఘజియాబాద్ ఎయిర్‌బేస్‌కు చేరుకున్న షేక్ హసీనా లండన్‌కు వెళ్లారు.

షేక్ హసీనా బంగ్లాదేశ్‌ను వదిలివెళ్లిన తర్వాత ఆమె ఇంట్లోకి చొరబడ్డారు ఆందోళనకారులు. హసీనా ఇంట్లో ఉన్న ఫర్నీచర్‌ ఇతర వస్తువులను పగలగొట్టి.. కొన్ని వస్తువులను ఎత్తుకెళ్లారు. మరోవైపు బంగ్లాదేశ్ రాజకీయ సంక్షోభంతో భారత్ అలర్ట్ అయింది. బంగ్లాదేశ్‌ బార్డర్‌లో హైఅలర్ట్ ప్రకటించి సరిహద్దు గ్రామాల ప్రజలకు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.

ఇప్పటికే బీఎస్‌ఎఫ్‌ డీజీ కోల్‌కతాకు చేరుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు భారత్‌ నుంచి బంగ్లాదేశ్‌కు రెగ్యులర్‌గా నడిచే అన్ని రైళ్లను రద్దు చేస్తున్నట్లు ఇండియన్ రైల్వే ప్రకటించింది. కరోనా తర్వాత బంగ్లాదేశ్‌లో పరిస్థితులు దిగజారుతూ వచ్చాయి. యుక్రెయిన్ వివాదంతో బంగ్లాదేశ్ దిగుమతి చేసుకునే ఇంధనం నుంచి నిత్యావసరాల వరకు అన్నీ ధరలు 20శాతం వరకు పెరిగాయి.

యువతకు ఉద్యోగాలు లేవు. కనీసం రోజు గడవడమే కష్టంగా మారింది. ఇవే విద్యార్థులను విధుల్లోకి వచ్చి ఆందోళన చేయడానికి కారణమయ్యాయి. స్టూడెంట్స్‌లో ఉన్న ఆగ్రహావేశాలను బంగ్లాదేశ్‌లోని అపోజిషన్‌ పార్టీ .. బంగ్లాదేశ్‌ నేషనలిస్ట్ పార్టీ క్యాష్ చేసుకుంది.

అరాచకశక్తులు ఇన్వాల్వ్‌
రిజర్వేషన్ల వివాదంపై నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థుల ఆందోళనల్లోకి ప్రతిపక్ష పార్టీనే కాకుండా పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు చేరినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రాడికల్స్, పాకిస్థాన్ అనుకూల ఇస్లామిక్ గ్రూప్స్‌.. విద్యార్థుల రూపంలో ఆందోళనలను డైవర్ట్‌ చేశాయి. స్టూడెంట్స్‌ ఆందోళనలు చేసినంతా కాలం.. నిరసనలు శాంతియుతంగానే జరిగాయి.

ఎప్పుడైతే ISI ఉగ్రవాదులు, అరాచకశక్తులు ఇన్వాల్వ్‌ అయ్యారన్న ప్రచారం జరిగిందో అప్పటినుంచి శాంతియుత నిరసనలు కాస్త హింసాత్మకంగా మారాయి. ఆందోళనలు మొదలైనప్పటి నుంచి వందలమంది ప్రాణాలు కోల్పోయారు. చివరకు ఇంటర్నెట్ సేవలు బంద్ చేసి కర్ఫ్యూ పెట్టినా రచ్చ ఆగలేదు. ఈ ఆందోళనల వెనక పాకిస్థాన్‌ హ్యాండ్‌ ఉందని బంగ్లాదేశ్‌ మాజీ ప్రధాని షేక్ హసీనా కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆందోళనలు చేస్తుంది విద్యార్థులు కాదు.. ఉగ్రవాదులని ఆమె కామెంట్ చేశారు.

అధికారంలో ఉన్న షేక్ హసీనా ఆధ్వర్యంలోని బంగ్లాదేశ్‌ అవామీ లీగ్ పార్టీ.. భారత్‌కు అనుకూలంగా ఉందన్న ఆవేదనతో పాక్ టెర్రరిస్ట్ సంస్థ ISI రెచ్చిపోయింది. పాకిస్థాన్‌కు అనుకూలంగా ఉండే బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ, జమాత్‌ ప్రభుత్వ ఏర్పాటు కావాలని కుట్రలు చేసింది. అందుకే 15ఏళ్లుగా తిరుగులేని అధికారాన్ని కొనసాగిస్తున్న షేక్ హసీనాపై పగబట్టి.. ఆమెను గద్దె దించేందుకు రిజర్వేషన్ల ఇష్యూను అవకాశంగా మల్చుకుంది. ఇప్పుడు సైనిక పాలన రావడంతో BNP, జమాత్‌ పార్టీ బంగ్లాదేశ్‌లో అధికారంలోకి రావడానికి అవకాశాలు ఉన్నాయి.

Also Read: బెంగళూరులో షాకింగ్ ఘటన.. మార్నింగ్ వాక్ చేస్తున్న మహిళపై లైంగిక దాడి, వెనుక నుంచి వచ్చి గట్టిగా పట్టుకుని..