మొబైల్ నెట్వర్క్ మార్చాలని చూస్తున్నారా? ముందు సిగ్నల్స్ చెక్ చేసుకోండి..

ఇతర నెట్వర్క్ ల నుంచి బీఎస్ఎన్ఎల్ లోకి మారే ముందు మీ ప్రాంతంలో సిగ్నల్స్ ఏ విధంగా ఉన్నాయో పరీక్షించుకోండి.

మొబైల్ నెట్వర్క్ మార్చాలని చూస్తున్నారా? ముందు సిగ్నల్స్ చెక్ చేసుకోండి..

ప్రముఖ ప్రైవేట్ టెలికాం సంస్థలు పోటీపడి ఇటీవల తమ టారిఫ్‌లను పెంచడంతో అసహనం చెందిన కొంత మంది వినియోగదారులు ప్రభుత్వ రంగ టెలికాం కంపెనీ BSNL (బిఎస్ఎన్ఎల్) లోకి మారుతున్నారు. మార్కెట్లో ప్రైవేట్ కంపెనీలు ఒక వైపు ఒక్కో ప్లాన్ మీద ధరను గరిష్టంగా 25 శాతం వరకు పెంచగా, బిఎస్ఎన్ఎల్ మాత్రం తన టారిఫ్ ను తగ్గిస్తూ ప్రకటన చేసింది.

దీంతో కొంత మంది టెలికాం వినియోగదారులు తమ మొబైల్ నెట్వర్క్ ను బిఎస్ఎన్ఎల్ కి మార్చుకోవాలనుకున్నారు. గత నెల రోజుల కాలంలో దేశ వ్యాప్తంగా కొత్తగా 25 లక్షల మంది బిఎస్ఎన్ఎల్ కనెక్షన్లు తీసుకున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. ఆంధ్ర ప్రదేశ్ టెలికాం సర్కిల్ లో సుమారు 2 లక్షల మంది తమ నెట్వర్క్ లోకి మారినట్లు తెలిపింది.

సిగ్నల్స్ అందుతున్నాయా?
దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ సిగ్నల్స్ సరిగా లేకపోవడంతో ఇప్పటికే ఆ సంస్థ వినియోగదారులు చాలా కాలంగా అవస్థలు పడుతున్నారు. దీంతో సంస్థ కూడా ఇతర నెట్వర్క్ సంస్థలతో పోటీ పడలేక నష్టాల్లోకి పడిపోయింది. ప్రధానంగా 2G సేవల మీద ఆధారపడిన బిఎస్ఎన్ఎల్ ఇప్పుడిప్పుడే 4G నెట్వర్క్ ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తోంది. మరో వైపు జియో లాంటి పోటీ నెట్వర్క్ ఇప్పటికే నలు మూలలా అత్యాధునిక 4G, 5G సేవలను అందిస్తూ మార్కెట్లో తన నెట్వర్క్ ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది.

ఇతర నెట్వర్క్ ల నుంచి బీఎస్ఎన్ఎల్ లోకి మారే ముందు మీ ప్రాంతంలో సిగ్నల్స్ ఏ విధంగా ఉన్నాయో పరీక్షించుకోండి. దీనికోసం మీరు మీ మొబైల్ లో గూగుల్ లోకి వెళ్లి www.nperf.com ను ఓపెన్ చేయండి. అందులో coverage map లోకి వెళ్లండి. Carrier option లో మీరు తెలుసుకోవాలనుకుంటున్న ఆపరేటర్ ను (బిఎస్ఎన్ఎల్ లేదా జియో) సెలెక్ట్ చేసి సెర్చ్ లో మీ ఊరు పేరు ఇచ్చి ఎంటర్ నొక్కండి.

దీంతో మీ ఊరు చుట్టూ ఉన్న బిఎస్ఎన్ఎల్ లేదా జియో నెట్వర్క్ సిగ్నల్స్ కనిపిస్తాయి. గ్రీన్ కలర్ కనిపిస్తే 3G సిగ్నల్స్, ఆరెంజ్ కలర్ కనిపిస్తే 4G సిగ్నల్స్, పర్పుల్ కలర్ కనిపిస్తే 5G సిగ్నల్స్ ఉన్నాయని అర్థం. అసలు ఏ కలర్ కనిపించకపోతే అక్కడ ఆ నెట్వర్క్ కి సిగ్నల్ లేదని అర్థం. ఈ విధంగా ఒకసారి చెక్ చేసుకుని మీ నంబరు మార్చుకోవడం, లేదా కొత్త కనెక్షన్ తీసుకోవడం మంచిది.

ISRO Free Courses : విద్యార్థులకు ఇస్రో ఆఫర్.. ఫ్రీగా 5 రోజుల ఏఐ, మిషన్ లెర్నింగ్ కోర్సు.. సర్టిఫికేట్ కూడా..!