Pawan Kalyan – Committee Kurrollu : నిహారిక ‘కమిటీ కుర్రాళ్ళు’ సినిమాలో.. పవన్ కళ్యాణ్ పొలిటికల్ రిఫరెన్స్ సీన్స్..?
కమిటీ కుర్రాళ్ళు సినిమాలో పవన్ కళ్యాణ్ ని ప్రేరణగా తీసుకొని పాలిటిక్స్ సీన్స్ ఉన్నాయని తెలుస్తుంది.

Niharika Committee Kurrollu Movie Having Pawan Kalyan Political Reference Scenes
Pawan Kalyan – Committee Kurrollu : మెగా డాటర్ నిహారిక నిర్మాతగా ఆల్మోస్ట్ అందరూ కొత్తవాళ్లతో తెరకెక్కిస్తున్న సినిమా కమిటీ కుర్రాళ్ళు. ఒక ఊళ్ళో కొంతమంది ఫ్రెండ్స్, వాళ్ళ జ్ఞాపకాలు, ఆ ఊళ్ళో జరిగే జాతర, ఆ ఊరి రాజకీయాలు, వాళ్ళ లవ్ స్టోరీలు నేపథ్యంలో తెరకెక్కింది కమిటీ కుర్రాళ్ళు సినిమా. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన సాంగ్స్, టీజర్, ట్రైలర్ ప్రేక్షకులని మెప్పించాయి.
అయితే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ని ప్రేరణగా తీసుకొని పాలిటిక్స్ సీన్స్ ఉన్నాయని తెలుస్తుంది. తాజాగా కమిటీ కుర్రాళ్ళు సినిమా డైరెక్టర్ యదు వంశీ మీడియాతో మాట్లాడుతూ ఈ విషయం తెలిపాడు.
Also Read : Chiranjeevi : చిరంజీవి కోసం ఆ సినిమా టైటిల్.. ఇచ్చేసిన చిన్న సినిమా నిర్మాత..
యదు వంశీ మాట్లాడుతూ.. నాకు జయప్రకాశ్ నారాయణ గారు, పవన్ కళ్యాణ్ గారు అంటే ఇష్టం. సినిమాలో కొన్ని చోట్ల వాళ్ళని ప్రేరణగా తీసుకొని రాసుకున్న సీన్స్ ఉన్నాయి. సినిమాలో పాలిటిక్స్ గురించి ఉంటుంది. ఊళ్ళో జరిగే పంచాయితీ ఎన్నికల సీన్స్ ఉంటాయి. సినిమా చివర్లో వచ్చే 20 నిమిషాల సీన్స్ పవన్ కళ్యాణ్ గారిని, ఆయన పాలిటిక్స్ నుంచే ఉదాహరణగా తీసుకొని రాసుకున్నాను. అలా అని ఇది పొలిటికల్ సినిమా కాదు. ఒక ఊళ్ళో కొంతమంది ఫ్రెండ్స్, వాళ్ళ కథలు, ఊళ్ళో జాతర, రాజకీయాల గురించి ఉంటుంది అని తెలిపారు.
పవన్ కళ్యాణ్ ని ప్రేరణగా తీసుకొని రాసాను అని నిహారిక గారు నాకు ఛాన్స్ ఇవ్వలేదు. ఈ సినిమా కథ మొత్తం నిహారిక గారికి నచ్చింది. ఆల్రెడీ చిరంజీవి గారు, మెగా ఫ్యామిలీలో కొంతమంది ఈ సినిమాని చూసి మెచ్చుకున్నారని తెలిపాడు డైరెక్టర్ యదు వంశీ. అయితే కమిటీ కుర్రాళ్ళు సినిమా నుంచి గతంలో ఎన్నికల ముందు ఎలక్షన్స్ కి ఇచ్చే తాయిలాలపై, రాజకీయ నాయకులపై సెటైరికల్ గా ఓ సాంగ్ వచ్చింది. అప్పుడే ఈ సాంగ్ పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ గా తీశారని పలు కామెంట్స్ రాగా ఇప్పుడు డైరెక్టర్ క్లారిటీ ఇచ్చాడు.