IND vs SL 3rd ODI : శ్రీలంక ఘన విజయం.. మూడో వన్డేలో భారత్ ఓటమి
కొలంబో వేదికగా భారత్, శ్రీలంక జట్ల మధ్య మూడో వన్డే మ్యాచ్ జరిగింది.

IND vs SL 3rd ODI
శ్రీలంక విజయం
249 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 26.1 ఓవర్లలో 138 పరుగులకు ఆలౌటైంది. దీంతో శ్రీలంక 110 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ఫలితంగా మూడు వన్డేల సిరీస్‌ను 2-0 తేడాతో కైవసం చేసుకుంది. తొలి వన్డే మ్యాచ్ టైగా ముగిసిన సంగతి తెలిసిందే. భారత బ్యాటర్లలో రోహిత్ శర్మ (35), వాషింగ్టన్ సుందర్ (30) ఫర్వాలేదనిపించగా మిగిలిన వారు విఫలం అయ్యారు. లంక బౌలర్లలో దునిత్ వెల్లలాగే ఐదు వికెట్లు తీయగా జెఫ్రీ వాండర్సే, మహేశ్ తీక్షణలు చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అవిష్క ఫెర్నాండో ఓ వికెట్ సాధించాడు.
ఓటమి అంచుల్లో టీమిండియా
శ్రీలంక బౌలర్ల ధాటికి టీమిండియా బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. భారత్ టపాటపా వికెట్లు కోల్పోయింది. 100 పరుగుల వద్ద ఏడో వికెట్ నష్టపోయి ఓటమి అంచుల్లో నిలిచింది. రియాన్ పరాగ్(9) ఏడో వికెట్ గా అవుటయ్యాడు.
కష్టాల్లో టీమిండియా
టీమిండియా 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. శుభ్‌మన్ గిల్ 6, రోహిత్ శర్మ 35, విరాట్ కోహ్లి 20, రిషబ్ పంత్ 6, శ్రేయస్ అయ్యర్ 8, అక్షర్ పటేల్ 2 పరుగులు చేసి అవుటయ్యారు.
టీమిండియాకు ఆరంభంలో షాక్
శ్రీలంక నిర్దేశించిన 249 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన టీమిండియా ఆరంభంలోనే షాక్ తగిలింది. శుభ్‌మన్ గిల్(6) స్వల్ప స్కోరుకే అవుటయ్యాడు. టీమిండియా 5 ఓవర్లలో 41/1 స్కోరుతో ఆడుతోంది. రోహిత్ శర్మ(31), విరాట్ కోహ్లి(4) క్రీజ్ లో ఉన్నారు.
టీమిండియా టార్గెట్ 249
టీమిండియాతో జరుగుతున్న మూడో వన్డేలో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 248 పరుగులు చేసింది. రోహిత్ సేనకు 249 పరుగుల టార్గెట్ పెట్టింది. శ్రీలంక బ్యాటర్లలో అవిష్క ఫెర్నాండో 96, కుశాల్ మెండిస్ 59, పాతుమ్ నిస్సాంక 45 పరుగులతో రాణించారు. చరిత్ అసలంక 10, కమిందు మెండిస్ 23 పరుగులు చేశారు. భారత బౌలర్లలో రియాగ్ పరాగ్ 3 వికెట్లు పడగొట్టాడు. అక్షర్ పటేల్, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్ తలో వికెట్ దక్కించుకున్నారు.
కుశాల్ మెండిస్ హాఫ్ సెంచరీ
శ్రీలంక బ్యాటర్ కుశాల్ మెండిస్ హాఫ్ సెంచరీ చేశాడు. 82 బంతుల్లో 4 ఫోర్లతో 59 పరుగులు చేసి కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో అవుటయ్యాడు.
శ్రీలంక 45 ఓవర్లలో 207/6
శ్రీలంక 45 ఓవర్లలో 6 వికెట్లు నష్టపోయి 207 పరుగులు చేసింది.
అవిష్క ఫెర్నాండో సెంచరీ మిస్
శ్రీలంక బ్యాటర్ అవిష్క ఫెర్నాండో కొద్దిలో సెంచరీ కోల్పోయాడు. 102 బంతుల్లో 9 ఫోర్లు, సిక్సర్లతో 96 పరుగులు చేసి రియాన్ పరాగ్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. శ్రీలంక 37 ఓవర్లలో 175/2 స్కోరుతో ఆట కొనసాగిస్తోంది.
శ్రీలంక 30 ఓవర్లలో 143/1
శ్రీలంక 30 ఓవర్లలో వికెట్ నష్టపోయి 143 పరుగులు చేసింది. అవిష్క ఫెర్నాండో 81, కుశాల్ మెండిస్ 16 పరుగులతో ఆడుతున్నారు.
అవిష్క ఫెర్నాండో హాఫ్ సెంచరీ
శ్రీలంక బ్యాటర్ అవిష్క ఫెర్నాండో హాఫ్ సెంచరీ చేశాడు. 65 బంతుల్లో 6 ఫోర్లతో అర్ధసెంచరీ సాధించాడు. శ్రీలంక తొలి 25 ఓవర్లలో 107/1 స్కోరుతో ఆట కొనసాగిస్తోంది.
తొలి వికెట్ కోల్పోయిన శ్రీలంక
శ్రీలంక 89 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. పాతుమ్ నిస్సాంక 45 పరుగులు చేసి అక్షర్ పటేల్ బౌలింగ్‌లో అవుటయ్యాడు.
శ్రీలంక 10 ఓవర్లలో 41/0
శ్రీలంక మొదటి 10 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 241 పరుగులు చేసింది. పాతుమ్ నిస్సాంక 19, అవిష్క ఫెర్నాండో 21 పరుగులతో ఆడుతున్నారు
శ్రీలంక 5 ఓవర్లలో 26/0
టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ చేస్తున్న శ్రీలంక తొలి 5 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 26 పరుగులు చేసింది. పాతుమ్ నిస్సాంక 19, అవిష్క ఫెర్నాండో 6 పరుగులతో ఆడుతున్నారు.
భారత తుది జట్టు : రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్(వికెట్ కీపర్), శ్రేయాస్ అయ్యర్, రియాన్ పరాగ్, శివమ్ దూబే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్
A look at #TeamIndia‘s Playing XI ??
Riyan Parag makes his ODI Debut ??
Follow the Match ▶️ https://t.co/Lu9YkAlPoM#SLvIND pic.twitter.com/hoBvmw1LZd
— BCCI (@BCCI) August 7, 2024
శ్రీలంక తుది జట్టు : పాతుమ్ నిస్సాంక, అవిష్క ఫెర్నాండో, కుసల్ మెండిస్(వికెట్ కీపర్), సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక(కెప్టెన్), జనిత్ లియానాగే, కమిందు మెండిస్, దునిత్ వెల్లలాగే, మహేశ్ తీక్షణ, జెఫ్రీ వాండర్సే, అసిత ఫెర్నాండో
టాస్..
కీలకమైన మూడో వన్డేలో శ్రీలంక జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో భారత్ మొదట బౌలింగ్ చేయనుంది. సిరీస్ సమం చేయాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో భారత్ రెండు మార్పులతో బరిలోకి దిగింది. కేఎల్ రాహుల్, అర్ష్‌దీప్ సింగ్‌ల స్థానంలో రిషబ్ పంత్, రియాన్ పరాగ్‌లకు చోటు ఇచ్చింది.
Charith Asalanka makes it a hat-trick! ?
He wins the toss for the third time in a row and elects to bat first in the 3rd ODI. ? Let’s go, Lions! #SLvIND ?? ?? pic.twitter.com/NFO0LQBttT— Sri Lanka Cricket ?? (@OfficialSLC) August 7, 2024