Earth Day : భూమికి దూరంగా జరుగుతున్న చంద్రుడు.. భవిష్యత్తులో రోజుకు 25 గంటలు.. ఎందుకంటే?

Earth Day : చంద్రుడు, భూమి నుంచి సంవత్సరానికి 3.8 సెంటీమీటర్లు దూరంగా కదులుతున్నాడు. భవిష్యత్‌లో ఈ కాలమానం రోజుకు 25 గంటలుగా మారతాయని సైంటిస్టులు అంచనా వేస్తున్నారు.

Earth Day : భూమికి దూరంగా జరుగుతున్న చంద్రుడు.. భవిష్యత్తులో రోజుకు 25 గంటలు.. ఎందుకంటే?

Earth could have 25 hours in a day ( Image Source : Google )

Earth Day : మన గ్రహానికి దగ్గరగా కనిపించే గ్రహాల్లో చంద్రుడు ఒకటి.. చంద్రుడికి భూమికి మధ్య అభినావ సంబంధం ఉంది. చందమామ రావే.. జాబిల్లి రావే అంటూ చిన్నప్పుడే ఎన్ని పాటలు పాడుకున్నాం.. అయితే, ఇప్పుడు ఆ చంద్రుడు భూమికి దూరంగా జరుగుతున్నాడు. దీని ప్రకారం.. ప్రస్తుత 24 గంటలు కాస్తా రాబోయే రోజుల్లో 25 గంటలుగా లెక్కించాల్సి వస్తుంది. చంద్రుడు మన గ్రహం నుంచి దూరంగా వెళ్లిపోతున్నందున భూమిపై ఒక రోజు నిడివి 25 గంటల వరకు పెరుగుతుందని శాస్త్రవేత్తలు అంటున్నారు.

Read Also : Pixel 9 Pro Fold Launch : గూగుల్ నుంచి మడతబెట్టే ఫోన్.. పిక్సెల్ 9ప్రో ఫోల్డ్ వచ్చేస్తోంది.. ఫుల్ ఫీచర్లు లీక్..!

ఇక 24 గంటలు కాదు.. 25 గంటలు :
పరిశోధన ప్రకారం.. చంద్రుడు భూమి నుంచి సంవత్సరానికి సుమారు 3.8 సెంటీమీటర్ల చొప్పున వెనక్కి తగ్గుతున్నాడు. ఇది కాలక్రమేణా 200 మిలియన్ సంవత్సరాలలో రోజుకు 25 గంటలు ఏర్పడతాయని సూచిస్తుంది. 1.4 బిలియన్ సంవత్సరాల క్రితం చంద్రుడు దగ్గరగా ఉన్నప్పుడు భూమిపై ఒక రోజు నిడివి కేవలం 18 గంటల కన్నా ఎక్కువగా ఉందని అధ్యయనం వెల్లడించింది.

భూమి, చంద్రుని మధ్య దూరం పెరగడంతో మన గ్రహం మీద రోజు సమయం కూడా పెరగనుంది. ఈ అధ్యయన బృందం 90 మిలియన్ ఏళ్ల పురాతనమైన రాతి నిర్మాణంపై దృష్టిసారించింది. భూమి, చంద్రుని మధ్య జరిగే మార్పులను ఇది అంచనా వేస్తుంది. దీని ప్రకారం.. చంద్రుడు, భూమి నుంచి సంవత్సరానికి 3.8 సెంటీమీటర్లు దూరంగా కదులుతున్నాడు. భవిష్యత్‌లో ఈ కాలమానం రోజుకు 25 గంటలుగా మారతాయని సైంటిస్టులు అంచనా వేస్తున్నారు.

విస్కాన్సిన్-మాడిసన్ యూనివర్శిటీలోని జియోసైన్స్ ప్రొఫెసర్ స్టీఫెన్ మేయర్స్ ప్రకారం.. “చంద్రుడు దూరంగా కదులుతున్నప్పుడు.. భూమి ఒక స్పిన్నింగ్ ఫిగర్ స్కేటర్ లాగా ఉంటుంది” అని పేర్కొన్నారు. చంద్రుడు, భూమి మధ్య సంబంధాన్ని అధ్యయనం చేసే మరో ప్రొఫెసర్ మాట్లాడుతూ.. “భూమిపై ఉన్న టైడల్ డ్రాగ్ దాని భ్రమణాన్ని తగ్గిస్తుంది.

చంద్రుడు కోణీయ మొమెంటం మాదిరిగా శక్తిని పొందుతాడు” అని లండన్ యూనివర్శిటీలోని రాయల్ హోల్లోవేలో జియోఫిజిక్స్ ప్రొఫెసర్ డేవిడ్ వాల్తామ్ బ్లూమ్‌బెర్గ్‌తో అన్నారు. ప్రస్తుతం, చంద్రుడు భూమి నుంచి సగటున 384,400 కి.మీ (238,855 మైళ్ళు) దూరంలో ఉన్నాడు. చంద్రుడు భూమి చుట్టూ తిరగడానికి దాదాపు ఒక నెల పడుతుంది.. అంటే.. మన గ్రహం చుట్టూ ఒకే కక్ష్యను పూర్తి చేయడానికి దాదాపు 27.3 రోజులు పడుతుంది.

Read Also : iPhone 17 Series : బిగ్ కెమెరా అప్‌గ్రేడ్‌తో ఐఫోన్ 17 సిరీస్ వచ్చేస్తోంది.. లేటెస్ట్ లీక్ ఇదిగో..!