iPhone 16 Pro Series : భారీ బ్యాటరీతో ఐఫోన్ 16 ప్రో సిరీస్ వచ్చేస్తోంది.. ఫీచర్లు లీక్.. లాంచ్ ఎప్పుడు ఉండొచ్చుంటే?

iPhone 16 Pro Series : ఐఫోన్ ప్రో మోడల్‌లు మెరుగైన శక్తి సాంద్రత, ఎక్కువ బ్యాటరీ లైఫ్ కోసం బ్యాటరీని అందిస్తాయి. ఈ ఆపిల్ ఐఫోన్ 16 సిరీస్‌తో ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ను అందించనుంది.

iPhone 16 Pro Series : భారీ బ్యాటరీతో ఐఫోన్ 16 ప్రో సిరీస్ వచ్చేస్తోంది.. ఫీచర్లు లీక్.. లాంచ్ ఎప్పుడు ఉండొచ్చుంటే?

iPhone 16 Pro and iPhone 16 Pro Max ( Image Source : Google )

Updated On : August 4, 2024 / 3:41 PM IST

iPhone 16 Pro Series : ఐఫోన్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. అతి త్వరలో ఐఫోన్ 16 సిరీస్ రాబోతోంది. భారత్ సహా ఇతర ప్రపంచ మార్కెట్లలో సెప్టెంబర్‌లో ఐఫోన్ 16 సిరీస్ లాంచ్ కానుంది. ఈ ఐఫోన్ రాకపై ఆన్‌లైన్‌లో ఇప్పటికే చాలా వివరాలు లీక్ కాగా, రాబోయే ఐఫోన్‌ల గురించి మరింత సమాచారం ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతోంది. ఐఫోన్ 16 సిరీస్ బ్యాటరీ వివరాలు ఇప్పటికే లీక్ అయ్యాయి. చైనీస్ వీబో ఆధారిత లీకర్ ఇన్‌స్టంట్ డిజిటల్ ఐఫోన్ 16 ప్రో 3,577 ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంటుందని, ఐఫోన్ 16 ప్రో మాక్స్ 4,676 ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంటుందని పేర్కొంది.

Read Also : Apple iPhone Prices : ఆపిల్ లవర్స్‌కు పండగే.. దిగొచ్చిన ఐఫోన్ల ధరలు.. ప్రో మోడల్స్‌పై ఫస్ట్ టైం తగ్గింపు..!

ఇప్పటికీ ఆండ్రాయిడ్ ఫోన్‌లు అందిస్తున్న దానికంటే తక్కువగా ఉన్నప్పటికీ, 2024 ఐఫోన్‌లు ఐఓఎస్ డివైజ్‌ల్లో ఇప్పటివరకు అతిపెద్ద బ్యాటరీని ప్యాక్ చేయనున్నాయి. అలాగే, ఆపిల్ డివైజ్ బ్యాటరీ ఆప్టిమైజేషన్ ఆండ్రాయిడ్ ఫోన్‌ల కన్నా మెరుగ్గా ఉంటుంది. ఐఫోన్ 15ప్రో 3,274mAh బ్యాటరీని అందిస్తుంది. ఐఫోన్ ప్రో మాక్స్ మోడల్ హుడ్ కింద 4,422mAh యూనిట్‌ను కలిగి ఉంది. మ్యాక్ రుమర్స్ ప్రకారం.. ఆపిల్ కొత్త ఫోన్‌లలో 6 నుంచి 9 శాతం బ్యాటరీ సామర్థ్యాన్ని పెంచిందని సూచిస్తుంది.

గత లీక్‌లను పరిశీలిస్తే.. :
ఐఫోన్ 16 హుడ్ కింద పెద్ద 3,561mAh బ్యాటరీని కలిగి ఉంది. అయితే, ఐఫోన్ 16 ప్లస్ 4,006mAh యూనిట్‌ను కలిగి ఉంటుంది. గత లీక్‌లో ప్రో మోడల్‌కు సంబంధించిన వివరాలు వెల్లడించనప్పటికీ, ఐఫోన్ 16 ప్రో మాక్స్ పెద్ద 4,676mAh బ్యాటరీతో వస్తుందని నివేదించిందని లేటెస్ట్ లీక్ కూడా సూచిస్తుంది. నివేదిక ప్రకారం.. ఐఫోన్ 16ప్రో మ్యాక్స్ 30-గంటల బ్యాటరీ లైఫ్ అందించగలదు.

ఐఫోన్ ప్రో మోడల్‌లు మెరుగైన శక్తి సాంద్రత, ఎక్కువ బ్యాటరీ లైఫ్ కోసం బ్యాటరీని అందిస్తాయి. ఈ ఆపిల్ ఐఫోన్ 16 సిరీస్‌తో ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ను అందించనుంది. కొత్త ఐఫోన్‌లు వేగవంతమైన 40డబ్ల్యూ వైర్డ్ ఛార్జింగ్, 20డబ్ల్యూ వైర్‌లెస్ ఛార్జింగ్‌తో రావచ్చని లీక్‌లు సూచిస్తున్నాయి. అయితే, వేగవంతమైన ఛార్జింగ్ సపోర్టుతో రానుందని గత ఏడాదిలో కూడా ఇదే పుకారు వచ్చింది. ఐఫోన్ 15 సిరీస్‌తో రాలేదు. అందువల్ల, ఐఫోన్ 16 సిరీస్‌కు కూడా వస్తుందనే గ్యారెంటీ లేదు.

Read Also : iPhone Call Recording : ఐఓఎస్ 18.1 అప్‌డేట్.. ఐఫోన్‌లో కాల్ రికార్డింగ్ ఫీచర్.. ఆ యూజర్లకు మాత్రమే..!