Paris Olympics : ఇవేం ప‌త‌కాలురా సామీ.. వారం రోజుల‌కే రంగు పోయింది.. సంచ‌ల‌నం రేపుతున్న అథ్లెట్ పోస్ట్‌..

తాజాగా ప‌త‌కం గెల‌చుకున్న ఓ అథ్లెట్ చేసిన పోస్ట్ ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

Paris Olympics : ఇవేం ప‌త‌కాలురా సామీ.. వారం రోజుల‌కే రంగు పోయింది.. సంచ‌ల‌నం రేపుతున్న అథ్లెట్ పోస్ట్‌..

Olympic Skateboarder Questions Quality Of His Medal

Paris Olympics – Nyjah Huston : పారిస్‌లో ఒలింపిక్స్ క్రీడ‌లు అట్ట‌హాసంగా జ‌రుగుతున్నాయి. ప‌త‌కాలు గెలిచిన అథ్లెట్లు సంతోషంలో మునిగి పోతుండ‌గా ఓడిన వారు నిరాశ చెందుతున్నారు. తాము బ‌స చేస్తున్న ఒలింపిక్ విలేజ్‌లో వ‌స‌తులు స‌రిగా లేవ‌ని కొంద‌రు అథ్లెట్లు ఆరోప‌ణ‌లు చేస్తుండ‌గా.. తాజాగా ప‌త‌కం గెల‌చుకున్న ఓ అథ్లెట్ చేసిన పోస్ట్ ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. తాను ఎంతో క‌ష్ట‌ప‌డి గెలుచుకున్న ప‌త‌కం రంగు పోయింద‌ని అత‌డు చేసిన పోస్టు వివాదానికి తెర‌లేపింది.

అమెరికా స్కేటర్‌ నిజా హ్యూస్టన్ పారిస్ ఒలింపిక్స్‌లో కాంస్య ప‌త‌కాన్ని సాధించాడు. అయితే.. వారం రోజుల‌కే స‌ద‌రు ప‌త‌కం రంగు పోయింద‌ని సోష‌ల్ మీడియాలో పోస్టు చేశాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు పోస్ట్ చేశాడు.

Paris Olympics : పారిస్ ఒలింపిక్స్‌లో మ‌రో మ‌హిళా అథ్లెట్ పై అన‌ర్హ‌త వేటు..

“ఈ ఒలింపిక్ పతకాలు కొత్తగా ఉన్నప్పుడు అద్భుతంగా కనిపించాయి. దాన్ని వేసుకున్న త‌రువాత చెమ‌ట త‌గిలి కొంత వ‌ర‌కు రంగు మారిపోయింది. ఇవి అనుకున్నంత నాణ్య‌త‌గా లేవు. అని హస్టన్ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో రాసుకొచ్చాడు.

ప‌త‌కం ముందు వైపు రూపు మారిపోయింది. ఈ ప‌త‌కాల నాణ్య‌త‌ను మ‌రింత పెంచితే బాగుంటుంది. ఈ రంగు మారిన ప‌త‌కాల‌ను చూస్తుంటే ఏదో యుద్ధానికి వెళ్లి వ‌చ్చిన‌ట్లుగా అనిపిస్తుంద‌ని హ్యూస్ట‌న్ తెలిపాడు.

Imane Khelif : ‘నేను అమ్మాయినే..’ స్వ‌ర్ణం గెలిచిన త‌రువాత అల్జీరియా బాక్స‌ర్ ఇమానె ఆవేద‌న‌..

దీనిపై పారిస్ ఒలింపిక్స్ 2024 అధికారిక ప్ర‌తినిధి స్పందించారు. సోష‌ల్ మీడియా ద్వారానే త‌మ‌కు ఈ విష‌యం తెలిసింద‌న్నారు. దీనిపై చ‌ర్య‌లు చేప‌ట్టామ‌న్నారు. డ్యామేజ్ అయిన వాటి స్థానంలో కొత్త ప‌త‌కాలు ఇచ్చే అంశాన్ని ప‌రిశీలిస్తున్నామ‌న్నారు.