పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు మరో పతకం

ఈ మెడల్‌తో భారత్ పతకాల సంఖ్య ఆరుకి చేరింది. కాగా, రెజ్లింగ్‌లో భారత్‌కు ఇదే తొలి మెడల్. 2021లో తన మొదటి జాతీయ ఛాంపియన్‌షిప్ టైటిల్‌ను అమన్ గెలుచుకున్నాడు. 2022లో ఆసియా క్రీడల్లో 57 కేజీల విభాగంలో కాంస్య పతకాన్ని సాధించాడు.

పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు మరో పతకం

Updated On : August 10, 2024 / 12:39 AM IST

Paris Olympics 2024 : పారిస్ ఒలింపిక్స్ లో భారత్ ఖాతాలో మరో కాంస్యం చేరింది. రెజ్లింగ్ పురుషుల 57 కేజీల విభాగంలో అమన్ సెహ్రావత్ పతకం సాధించారు. ప్యూర్టోరికోకు చెందిన డేరియన్ టో క్రజ్ తో జరిగిన మ్యాచ్ లో 13-5 పాయింట్ల తేడాతో 21ఏళ్ల యువ రెజ్లర్ అమన్ గెలుపొందారు. ఈ మెడల్ తో భారత్ పతకాల సంఖ్య ఆరుకి చేరింది. కాగా, రెజ్లింగ్ లో భారత్ కు ఇదే తొలి మెడల్.

గతంలో 1952లో రెజ్లింగ్ లో భారత్ కు కేడీ జాదవ్ కాంస్య పతకం అందించారు. ఆ తర్వాత సుశీల్ కుమార్ 2008 ఒలింపిక్స్ లో కాంస్యం, 2012 గేమ్స్ లో రజతం సాధించారు. 2012 గేమ్స్ లోనే యోగేశ్వర్ దత్ కాంస్య పతకం కైవసం చేసుకున్నారు. 2016 గేమ్స్ లో సాక్షి మాలిక్(కాంస్యం), బజరంగ్ పునియా(2020లో కాంస్యం), రవి దహియా(2020) పతకాలు సాధించారు. 2008 నుంచి ప్రతి ఒలింపిక్స్ గేమ్స్ లో రెజ్లింగ్ లో భారత్ కు పతకాలు వస్తూనే ఉన్నాయి.

అమన్ సెహ్రావత్ యువ భారతీయ రెజ్లర్. రెజ్లింగ్ ప్రపంచంలో ముఖ్యంగా పారిస్ 2024 ఒలింపిక్స్‌లో గణనీయమైన ప్రభావాన్ని చూపాడు. జూలై 16, 2003న హర్యానాలోని జాజ్జర్‌లో జన్మించిన అమన్ జీవితంలో ప్రారంభంలోనే విషాదం నెలకొంది. అతను 11 సంవత్సరాల వయస్సులో తన తల్లిదండ్రులను కోల్పోయాడు. అతని తల్లి డిప్రెషన్ కారణంగా మరణించింది. సరిగ్గా ఏడాది తర్వాత తండ్రి కూడా మరణించాడు. కష్టాలు వెంటాడినా.. రెజ్లింగ్‌లో అమన్ రాణించాడు. కోచ్ లలిత్ కుమార్ ఆధ్వర్యంలో అమన్ శిక్షణ పొందాడు.

2021లో తన మొదటి జాతీయ ఛాంపియన్‌షిప్ టైటిల్‌ను అమన్ గెలుచుకున్నాడు. 2022లో ఆసియా క్రీడల్లో 57 కేజీల విభాగంలో కాంస్య పతకాన్ని సాధించాడు. కజకిస్తాన్‌లోని అస్తానాలో జరిగిన 2023 ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో బంగారు పతకాన్ని గెలుచుకున్నాడు. అమన్ విజయాల పరంపర 2024 వరకు కొనసాగింది. జాగ్రెబ్ ఓపెన్ రెజ్లింగ్ టోర్నమెంట్‌లో బంగారు పతకాన్ని సాధించాడు.

కృషి, పట్టుదలతో అమన్ తన కెరీర్ లో ఎదుగుతూ వెళ్లాడు. రెజ్లింగ్ తనకు కేవలం క్రీడ మాత్రమే కాదని, తన కుటుంబ వారసత్వాన్ని గౌరవించే మార్గమని అమన్ పేర్కొన్నాడు. ఒలింపిక్స్‌లో అతని ప్రయాణం అతని శారీరక బలాన్ని మాత్రమే కాకుండా అతని మానసిక ధైర్యాన్ని కూడా ప్రతిబింబిస్తుంది.

Also Read : మీరే గెలిపించారా?.. ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత నదీమ్‌పై పాక్ ప్రధాని వీడియో.. తీవ్ర విమర్శలు