IND vs AUS : ఆసీస్ టూర్‌లో రెండు రోజుల డే/నైట్ ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనున్న భారత్.. అప్పట్లో అలా జరిగినందుకేనా..?
ఈ ఏడాది చివర్లో భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది.

India To Play Two Days Day Night Tour Match In Australia
India vs Australia : ఈ ఏడాది చివర్లో భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో భారత్ ఐదు మ్యాచుల టెస్టు సిరీస్‌ను ఆడనుంది. ఇందులో ఓ డే/నైట్ టెస్టు మ్యాచ్ సైతం ఉంది. నవంబర్ 22 నుంచి భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య టెస్టు సిరీస్ ఆరంభం కానుంది. రెండో టెస్టు మ్యాచ్‌ను డే/నైట్ మ్యాచ్‌గా నిర్వహించనున్నారు. అడిలైడ్ వేదికగా ఈ మ్యాచ్ డిసెంబర్ 6 నుంచి 10 వరకు జరగనుంది.
నాలుగేళ్ల క్రితం ఆస్ట్రేలియాతో జరిగిన డే/నైట్ టెస్టు మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 36 పరుగులకే కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ సారి అలా జరగకూడదని భావించిన బీసీసీఐ ఈ టెస్టుకు ముందు రెండు రోజుల డే/నైట్ ప్రాక్టీస్ మ్యాచ్ భారత్ ఆడేలా షెడ్యూల్‌ను రూపొందించింది. నవంబర్ 30, డిసెంబర్ 1 తేదీల్లో కాన్‌బెర్రాలోని మనుకా ఓవల్‌లో ప్రైమ్‌మినిస్టర్ ఎలెవన్‌తో భారత్ ప్రాక్టీస్ మ్యాచ్‌లో తలపడనుంది. ఈ విషయాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా తమ షెడ్యూల్‌లో వెల్లడించింది.
Neeraj Chopra : స్వర్ణం గెలిచిన పాక్ అథ్లెట్ గురించి నీరజ్ చోప్రా తల్లి ఏమందో తెలుసా..?
భారత్ ఆస్ట్రేలియా 5 మ్యాచుల టెస్టు సిరీస్ షెడ్యూల్ ఇదే..
మొదటి టెస్టు – పెర్త్ వేదికగా నవంబర్ 22 నుంచి 26 వరకు
రెండో టెస్టు – అడిలైడ్ వేదికగా డిసెంబర్ 6 నుంచి 10 వరకు
మూడో టెస్టు – బ్రిస్బేన్ వేదికగా డిసెంబర్ 14 నుంచి 18 వరకు
నాలుగో టెస్టు – మెల్‌బోర్న్ వేదికగా డిసెంబర్ 26 నుంచి 30 వరకు
ఐదో టెస్టు – సిడ్నీ వేదికగా జనవరి 3 నుంచి 7 వరకు
ఇదిలా ఉంటే.. ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ పైనల్ మ్యాచ్ ఆడాలంటే ఆస్ట్రేలియా సిరీస్‌లో గెలవడం భారత్‌కు ఎంతో ముఖ్యం. కాబట్టి ప్రతి టెస్టు విజయం ఎంతో ముఖ్యం. మార్చి 2025 నాటికి పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో ఉన్న జట్లు ఫైనల్ మ్యాచ్‌లో తలపడనున్నాయి. ప్రస్తుతం డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో భారత్ అగ్రస్థానంలో కొనసాగుతోంది.