Anand Mahindra : ఒలింపిక్స్‌లో నీర‌జ్ చోప్రాకు ర‌జ‌తం.. నేనెంతో బాధ‌ప‌డ్డానంటూ ఆనంద్ మ‌హీంద్రా ట్వీట్‌

పారిస్ ఒలింపిక్స్‌లో జావెలిన్ త్రో ఈవెంట్‌లో భార‌త స్టార్ అథ్లెట్ నీర‌జ్ చోప్రా ర‌జ‌త ప‌త‌కం సాధించాడు.

Anand Mahindra : ఒలింపిక్స్‌లో నీర‌జ్ చోప్రాకు ర‌జ‌తం.. నేనెంతో బాధ‌ప‌డ్డానంటూ ఆనంద్ మ‌హీంద్రా ట్వీట్‌

Anand Mahindra Big Confession As Neeraj Chopra Misses Out On Paris Olympics Gold

Anand Mahindra – Neeraj Chopra : పారిస్ ఒలింపిక్స్‌లో జావెలిన్ త్రో ఈవెంట్‌లో భార‌త స్టార్ అథ్లెట్ నీర‌జ్ చోప్రా ర‌జ‌త ప‌త‌కం సాధించాడు. పాకిస్తాన్ కు చెందిన అర్షద్ న‌దీమ్ స్వ‌ర్ణ ప‌త‌కాన్ని అందుకున్నాడు. నీర‌జ్ చోప్రా ప్ర‌ద‌ర్శ‌న పై దేశ వ్యాప్తంగా ప్ర‌శంస‌ల జ‌ల్లు కురుస్తోంది. ఇదిలా ఉంటే.. నీర‌జ్ చోప్రా గోల్డ్ మెడ‌ల్ గెల‌వ‌క‌పోవ‌డం త‌న‌ను బాధించింద‌ని ప్ర‌ముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మ‌హీంద్ర అన్నారు. సోష‌ల్ మీడియా వేదిక‌గా ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు.

ఒలింపిక్స్‌లో నీర‌జ్ చోప్రా రెండో బంగారు ప‌త‌కాన్ని గెలుచుకోలేకపోవ‌డాన్ని చూసి నేను గ‌త రాత్రి ఎంతో బాధ‌ప‌డ్డాను. అయితే.. రికార్డు స్థాయిలో జావెలిన్‌ను విసిరి గోల్డ్ మెడ‌ల్ గెలుచుకున్నందుకు అర్ష‌ద్ న‌దీమ్ ఈ ఉద‌యం ముందుగా అభినంద‌న‌లు చెప్పాల‌ని అనుకుంటున్నాను. ఇక వారిద్ద‌రి మ‌ధ్య స్నేహం, క్రీడాస్ఫూర్తి మెచ్చుకోవాల్సిందే. ఆట మొత్తంలో నీర‌జ్ ఎక్క‌డా త‌డ‌బ‌డ‌లేదు. గంద‌ర‌గోళానికి గురి కాలేదు. అత‌డు నిశ్శ‌బ్దంగా త‌న అత్యుత్త‌మ ప్ర‌ద‌ర్శ‌న ఇచ్చి ర‌జ‌తాన్ని సొంతం చేసుకున్నాడు.

Pakistan : 40 ఏళ్ల త‌రువాత ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడ‌ల్‌.. పాకిస్తాన్ సంబ‌రాలు చూశారా..?

అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్టుగా.. నిల‌క‌డ‌గా రాణించ‌డం గొప్ప క్రీడాకారుల ల‌క్ష‌ణం. నీర‌జ్ నిజంగా గొప్ప అథ్లెట్‌. మంచి మ‌నిషి. మా అంద‌రినీ గ‌ర్వ‌ప‌డేలా చేశారు. అని ఆనంద్ మ‌హీంద్రా రాసుకొచ్చాడు.