1980’s Radhekrishna : ‘1980లో రాధే కృష్ణ’ టీజర్ రిలీజ్.. తనికెళ్ళ భరణి వాయిస్‌తో..

తాజాగా '1980లో రాధే కృష్ణ' సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్ జరిగింది.

1980’s Radhekrishna : ‘1980లో రాధే కృష్ణ’ టీజర్ రిలీజ్.. తనికెళ్ళ భరణి వాయిస్‌తో..

1980's Radhekrishna Movie Teaser Released

1980’s Radhekrishna : SV క్రియేషన్స్ బ్యానర్ పై ఊడుగు సుధాకర్ నిర్మాతగా ఇస్మాయిల్ షేక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘1980లో రాధే కృష్ణ’. SS సైదులు, భ్రమరాంబిక, అర్పిత లోహి హీరోహీరోయిన్లుగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. రాధే కృష్ణ సినిమా తెలుగుతో పాటు బంజారా భాషలో కూడా విడుదల చేయబోతున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్ కు నిర్మాత బెక్కం వేణుగోపాల్, పవన్ కళ్యాణ్ ఫ్రెండ్, నిర్మాత రామ్ తల్లూరి, సోహెల్.. పలువురు అతిథులుగా వచ్చారు.

ప్రేమ కథలు, క్యాస్ట్ గురించి, నక్సలైట్స్.. ఇలాంటి కథాంశాలతో రాధే కృష్ణ తెరకెక్కింది. మీరు కూడా రాధే కృష్ణ టీజర్ చూసేయండి..

 

నిర్మాత రామ్ తల్లూరి మాట్లాడుతూ.. ఇది మా జిల్లాలో తీసిన సినిమా. టీజర్, పాటలు బాగున్నాయి. కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. ఈ సినిమా హిట్ అయి నిర్మాతకి డబ్బులు నటీనటులకి మంచి పేరు రావాలి అని అన్నారు. నిర్మాత బెక్కం వేణుగోపాల్ గారు మాట్లాడుతూ.. చిన్న సినిమాలను నేను ఎప్పుడూ సపోర్ట్ చేస్తాను. ఈ సినిమా చూసిన తర్వాత క్లైమాక్స్ వేరేలా చేసి ఉంటే బాగుండేది అని చెప్పిన వెంటనే రైటర్స్, మూవీ టీమ్ వచ్చి సజెషన్ తీసుకొని మళ్లీ మూడు రోజులు షూట్, ఎడిట్ చేసి సినిమాని తీసుకొచ్చారు. తక్కువ బడ్జెట్లో మంచి సినిమా అని అన్నారు.

హీరో సోహెల్ మాట్లాడుతూ.. ఈ సినిమా టీం నా ఫ్యామిలీ లాంటిది. సినిమా అంటే రంగుల ప్రపంచం అంటారు అందరూ కానీ మీకు రంగులు చూపిస్తూ మేము బ్లాక్ అండ్ వైట్ లోనే ఉండిపోతాము. జనాలకి ఏ సినిమా నచ్చుతుందో ఎవ్వరికి తెలియదు. హిట్ అయినా ఫ్లాప్ అయినా సినిమా చేయడం ఒకటే మాకు తెలుసు. ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వాలి అని అన్నారు.

1980's Radhekrishna Movie Teaser Released

నిర్మాత ఊడుగు సుధాకర్ మాట్లాడుతూ.. ఎంతో బిజీగా ఉండి కూడా సపోర్ట్ చేయడానికి అతిధులందరికి ధన్యవాదాలు. బెక్కం వేణుగోపాల్ గారు చెప్పిన మార్పుల్ని బడ్జెట్ చూసుకోకుండా చేశాము. టీజర్ కి తనికెళ్ల భరణి గారి వాయిస్ ప్రత్యేకంగా నిలిచింది అని తెలిపారు. హీరో SS సైదులు మాట్లాడుతూ.. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో మంచి సర్ప్రైజ్ ఉంది అని తెలిపారు.

డైరెక్టర్ ఇస్మాయిల్ షేక్ మాట్లాడుతూ.. టీజర్ కి వాయిస్ ఓవర్ తనికెళ్ల భరణి గారు వాయిస్ ఉంటే బాగుంటుంది అని ఆయన్ని అప్రోచ్ అవ్వగానే ఓకే చేసినందుకు ధన్యవాదాలు. బెక్కం వేణుగోపాల్ గారు క్లైమాక్స్ కి ఇచ్చిన సజెషన్స్ బాగా హెల్ప్ అయ్యాయి. అని అన్నారు.