Prabhas – Hanu Raghavapudi : ప్రభాస్ హను రాఘవపూడి సినిమా అప్డేట్.. టైటిల్ ఇదే.. షూటింగ్ అప్పట్నుంచే..!
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇటీవల కల్కి సినిమాతో భారీ హిట్‌ను అందుకున్నాడు.

Prabhas – Hanu Raghavapudi movie latest update title fix
Prabhas – Hanu Raghavapudi : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇటీవల కల్కి సినిమాతో భారీ హిట్‌ను అందుకున్నాడు. ఈ విజయం ఇచ్చిన జోష్‌తో ప్రభాస్ వరుసగా సినిమాల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం ఆయన చేతిలో సలార్ 2, రాజా సాబ్, కల్కి 2, స్పిరిట్ వంటి సినిమాలు ఉన్నాయి. ఇక హనురాఘవ పూడి దర్శకత్వంలో ఆయన ఓ సినిమాలో నటించనున్నట్లు గత కొన్నాళ్లుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.
తాజాగా ఇందుకు లైన్ క్లియర్ అయింది. హనురాఘవ పూడి డైరెక్షన్‌లో నటించేందుకు ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఇక ఈ సినిమా పూజా కార్యక్రమాలతో మొదలు కానుంది. ఈ చిత్రానికి ఫౌజీ అనే పేరును పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఆగస్టు 17న హైదరాబాద్‌లో ఈ మూవీకి సంబంధించిన పూజా కార్యక్రమాలు చేయనున్నారు.
Mahesh Babu : ‘లవ్ యూ..’ అంటూ మహేశ్ బాబు పోస్ట్.. ఎవరిని ఉద్దేశించో తెలుసా..?
ఇక ఈ సినిమా షూటింగ్ ఆగస్టు 18 నుంచి ప్రారంభం కానుంది. మూడు వారాల పాటు మధురైలో జరగనుంది. మూడు వారాల పాటు జరగనున్న ఈ మూవీ షూటింగ్‌లో ప్రభాస్ 10 రోజులు పాల్గొనునన్నాడని తెలుస్తోంది. ఆగస్టు 22 నుంచి ఆయన షూటింగ్ జాయిన్ కానున్నాడట.
ఇదిలా ఉంటే.. ఈ మూవీ పీరియాడిక్ యాక్షన్ రొమాంటిక్ గా తెరకెక్కుతున్నట్లు టాక్. యుద్ధం నేపథ్యంలో ఉండే ప్రేమకథగా ఈ సినిమా రానున్నట్టు తెలుస్తోంది. ప్రభాస్ సరసన పాకిస్థాన్ నటి నటించనుందట. పాకిస్థాన్ కి చెందిన సజల్ అలీ అనే హీరోయిన్ ని ఈ సినిమాలో తీసుకుంటారని వార్తలు వస్తున్నాయి. సజల్ అలీ పాకిస్థాన్ లో సినిమాలు చేస్తున్నా గతంలో బాలీవుడ్ లో శ్రీదేవి ‘మామ్’ సినిమాలో నటించింది. దీనిపై మూవీ యూనిట్ గానీ, సజల్ అలీ కానీ స్పందించలేదు.
Masthu Shades Unnai Ra : హీరోగా కమెడియన్ ఫస్ట్ సినిమా.. ఓటీటీలో దూసుకుపోతుందిగా..