Akkineni Akhil : అన్నయ్య నిశ్చితార్థంలో అఖిల్ కొత్త లుక్ చూశారా? ఫుల్ గా జుట్టు, గడ్డం పెంచేసి..

తాజాగా నాగచైతన్య - శోభిత ధూళిపాళ నిశ్చితార్థం జరగ్గా ఈ నిశ్చితార్థంలో కూడా అఖిల్ సరికొత్త లుక్ లో కనిపించాడు.

Akkineni Akhil : అన్నయ్య నిశ్చితార్థంలో అఖిల్ కొత్త లుక్ చూశారా? ఫుల్ గా జుట్టు, గడ్డం పెంచేసి..

Akkineni Akhil New Look in Naga Chaitanya Sobhita Dhulipala Engagement Photos goes Viral

Updated On : August 10, 2024 / 9:20 AM IST

Akkineni Akhil : అక్కినేని కుటుంబం నుంచి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చినా అక్కినేని అఖిల్ కి ఇప్పటిదాకా భారీ హిట్ పడలేదు. కానీ అఖిల్ మాత్రం ప్రతి సినిమాకి బాగానే కష్టపడుతున్నాడు. అఖిల్ గత సినిమా ఏజెంట్ కోసం చాలా కష్టపడ్డా డిజాస్టర్ గా మిగిలింది ఆ సినిమా. ఏజెంట్ వచ్చి సంవత్సరం దాటేసినా అఖిల్ నెక్స్ట్ సినిమా అధికారికంగా ఇప్పటివరకు ప్రకటించలేదు.

అయితే అఖిల్ నెక్స్ట్ సినిమా అనిల్ కుమార్ అనే కొత్త దర్శకుడితో యూవీ క్రియేషన్స్ నిర్మాణంలో భారీ బడ్జెట్ తో పీరియాడిక్ సబ్జెక్టు తీస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఆల్రెడీ ఆ సినిమా షూటింగ్ కూడా జరుగుతుందని సమాచారం. ఈ సినిమాకి ధీర, తారక సింహా రెడ్డి.. అనే టైటిల్స్ వినిపిస్తున్నాయి. అయితే ఈ సినిమా రూమర్స్ మొదలైనప్పటి నుంచి అఖిల్ కొత్త లుక్ లో కనిపిస్తున్నాడు. బాగా జుట్టు పెంచేసి, ఫుల్ గా గడ్డం పెంచేసి కనిపిస్తున్నాడు.

Also Read : NTR : బ్యాక్ టు బ్యాక్ ఎన్టీఆర్ లైనప్ అదిరిపోయిందిగా.. ఎన్టీఆర్ నెక్స్ట్ మూడు సినిమాల రిలీజ్‌లు ఎప్పుడంటే..

తాజాగా నాగచైతన్య – శోభిత ధూళిపాళ నిశ్చితార్థం జరగ్గా ఈ నిశ్చితార్థంలో కూడా అఖిల్ సరికొత్త లుక్ లో కనిపించాడు. ఆల్మోస్ట్ భుజాలని దాటేలా జుట్టు పెంచాడు అఖిల్. గడ్డం కూడా బాగానే పెంచాడు. ఈ లుక్ చూసి అభిమానులు, నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. సినిమా కోసమే ఈ లుక్ అయితే అసలే ఫ్లాప్స్ లో ఉన్న అఖిల్ తో ఏం ప్రయోగాలు చేస్తున్నారో అని చర్చించుకుంటున్నారు. మరి ఈ కొత్త లుక్ అఖిల్ నెక్స్ట్ సినిమాకి ఎంత బాగా సెట్ అయిందో సినిమా వచ్చేదాకా చెప్పలేం.

Akkineni Akhil New Look in Naga Chaitanya Sobhita Dhulipala Engagement Photos goes Viral