Nagababu : మీడియా రంగంలోకి నాగబాబు.. జనసేనకు కలిసొస్తుందా..?

తాజాగా నాగబాబు మీడియా రంగంలోకి రాబోతున్నారు.

Nagababu : మీడియా రంగంలోకి నాగబాబు.. జనసేనకు కలిసొస్తుందా..?

Mega Brother Naga Babu Entering into Media Field

Updated On : August 10, 2024 / 7:44 AM IST

Nagababu : మెగా బ్రదర్ నాగబాబు సినిమాల్లో, టీవీలో నిర్మాతగా, నటుడిగా ఎన్నో సినిమాలు, టీవీ షోలు చేసారు. కానీ గత కొన్నాళ్లుగా పూర్తిగా తన తమ్ముడు పవన్ కళ్యాణ్ పక్కనే ఉంటూ జనసేన పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు. జనసేన పార్టీలో ప్రధాన కార్యదర్శిగా నాగబాబు సేవలందిస్తున్నారు. ఇటీవల ఎన్నికల్లో జనసేన పార్టీ గెలుపులో నాగబాబు కూడా కీలక పాత్ర పోషించారు. అయితే తాజాగా నాగబాబు మీడియా రంగంలోకి రాబోతున్నారు.

ఆల్రెడీ నాగబాబు గతంలోనే పలు యూట్యూబ్ ఛానల్స్ పెట్టి కొత్త వాళ్లకు అవకాశాలు ఇచ్చి షార్ట్ ఫిలిమ్స్, సిరీస్ లు, కామెడీ షోలు చేసారు. అయితే తాజాగా N మీడియా అంటూ నాగబాబు మీడియా రంగంలోకి వస్తున్నాను అని ప్రకటించారు. N మీడియా లోగో రివీల్ చేస్తూ ఓ వీడియోని రిలీజ్ చేసారు. తన పాత యూట్యూబ్ ఛానల్ కి N మీడియా ఎంటర్టైన్మెంట్స్ అని పేరు మార్చి సరికొత్తగా ప్రారంభించారు.

Also Read : Masthu Shades Unnai Ra : హీరోగా కమెడియన్ ఫస్ట్ సినిమా.. ఓటీటీలో దూసుకుపోతుందిగా..

ప్రస్తుతానికి N మీడియా కేవలం ఎంటర్టైన్మెంట్ న్యూస్ తో పాటు భక్తి న్యూస్, హెల్త్ న్యూస్, పలు ఇంటర్వ్యూలు ప్రేక్షకులకు అందించనున్నారు. ప్రస్తుతం యూట్యూబ్ ఛానల్స్ ద్వారా మాత్రమే కంటెంట్ ఇవ్వనున్నారు. అయితే భవిష్యత్తులో పొలిటికల్ న్యూస్ తో పాటు ఒక వెబ్ సైట్ కూడా స్థాపించే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇప్పటినుంచి N మీడియాని స్థాపించి మళ్ళీ వచ్చే ఎన్నికల వరకు జనసేనకు సపోర్ట్ గా ఉండేలా చూసుకుంటారేమో అని కూడా వార్తలు వస్తున్నాయి. అయితే కేవలం యూట్యూబ్ ఛానల్, వెబ్ సైట్ తో ఆగుతారా శాటిలైట్ ఛానల్ కూడా పెడతారా, జనసేనకు N మీడియా కలిసొస్తుందా అని టాలీవుడ్ లో చర్చగా మారింది. మొత్తానికి జనసేన గెలుపు తర్వాత నాగబాబు సరికొత్తగా ఏదో ప్లాన్ చేయబోతున్నారని మాత్రం తెలుస్తుంది.