Kalyan Ram – NTR : పెదనాన్న కళ్యాణ్ రామ్‌తో ఎన్టీఆర్ పిల్లల సందడి.. భార్గవ్‌ని ఎత్తుకొని.. ఫొటోలు వైరల్..

చాలా రోజుల తర్వాత ఎన్టీఆర్ ఫ్యామిలీతో కలిసి బయట కనపడటంతో, పిల్లలు కూడా రావడంతో ఈ ఈవెంట్ నుంచి వీరి ఫొటోలు, వీడియోలు వైరల్ గా మారాయి.

Kalyan Ram – NTR : పెదనాన్న కళ్యాణ్ రామ్‌తో ఎన్టీఆర్ పిల్లల సందడి.. భార్గవ్‌ని ఎత్తుకొని.. ఫొటోలు వైరల్..

NTR Childrens Abhay and Bhargav Close Move with Kalyan Ram Photos goes Viral

Updated On : August 10, 2024 / 9:03 AM IST

Kalyan Ram – NTR : సెలబ్రిటీల పిల్లల ఫొటోలు బయటకి వచ్చాయంటే అవి వైరల్ అవ్వాల్సిందే. ముఖ్యంగా మన టాలీవుడ్ స్టార్ హీరోల పిల్లల ఫొటోలు వస్తే ఫ్యాన్స్ వాటిని మరింత షేర్ చేస్తారు. తాజాగా నిన్న ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా ఓపెనింగ్ పూజా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ ఫ్యామిలీతో వచ్చాడు. ఎన్టీఆర్ తన భార్య ప్రణతి, కుమారులు అభయ్ రామ్, భార్గవ్ రామ్ లతో కలిసి వచ్చారు.

చాలా రోజుల తర్వాత ఎన్టీఆర్ ఫ్యామిలీతో కలిసి బయట కనపడటంతో, పిల్లలు కూడా రావడంతో ఈ ఈవెంట్ నుంచి వీరి ఫొటోలు, వీడియోలు వైరల్ గా మారాయి. ఇక ఈ సినిమాకి ఎన్టీఆర్ అన్నయ్య, హీరో కళ్యాణ్ రామ్ కూడా ఒక నిర్మాత కావడంతో కళ్యాణ్ రామ్ కూడా ఈ సినిమా పూజా కార్యక్రమానికి హాజరయ్యాడు.

Also Read : NTR : బ్యాక్ టు బ్యాక్ ఎన్టీఆర్ లైనప్ అదిరిపోయిందిగా.. ఎన్టీఆర్ నెక్స్ట్ మూడు సినిమాల రిలీజ్‌లు ఎప్పుడంటే..

అయితే కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ పిల్లలు అభయ్, భార్గవ్ లతో సందడిగా గడిపారు. ఎన్టీఆర్ చిన్న కొడుకు భార్గవ్ రామ్ ని ఎత్తుకొని గారాబం చేసాడు. అభయ్ రామ్ కూడా పెదనాన్న పక్కనే ఉన్నాడు. ఎన్టీఆర్ ఇద్దరి పిల్లలతో కళ్యాణ్ రామ్ చాలా క్లోజ్ గా ఉన్నాడు. కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ పిల్లలతో దగ్గరుండి పూజ చేయించాడు. దీంతో ఈ ఫొటోలు వైరల్ గా మారాయి. పెదనాన్నతో ఎన్టీఆర్ పిల్లలు చాలా క్లోజ్ గా ఉన్నారు, ఎన్టీఆర్ పిల్లలు ఇద్దరూ క్యూట్ గా ఉన్నారు అంటూ ఫ్యాన్స్, నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి ఎన్టీఆర్ – నీల్ సినిమా వల్ల ఎన్టీఆర్ పిల్లలు కూడా మరోసారి వైరల్ అవుతున్నారు.

Image

 

Image

Image