Realme C63 5G Launch : భారీ బ్యాటరీతో రియల్‌మి C63 5జీ ఫోన్ ఇదిగో.. ఫీచర్లు అదుర్స్.. ధర ఎంతో తెలిస్తే కొనకుండా ఉండలేరు!

Realme C63 5G Launch : రియల్‌మి సి63 5జీ 4జీబీ ర్యామ్+ 128జీబీ స్టోరేజీ ఆప్షన్ ధర రూ. 10,999కు అందిస్తోంది. 12జీబీ స్టోరేజ్‌తో 6జీబీ ర్యామ్, 8జీబీ ర్యామ్ వెర్షన్‌ల ధర వరుసగా రూ. 12,999, రూ. 11,999కు అందుబాటులో ఉన్నాయి.

Realme C63 5G Launch : భారీ బ్యాటరీతో రియల్‌మి C63 5జీ ఫోన్ ఇదిగో.. ఫీచర్లు అదుర్స్.. ధర ఎంతో తెలిస్తే కొనకుండా ఉండలేరు!

Realme C63 5G With MediaTek Dimensity 6300 5G, 5,000mAh Battery Launched in India_ Price, Specifications

Realme C63 5G Launch : కొత్త ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? భారత మార్కెట్లో చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం రియల్‌మి సి63 5జీ భారత మార్కెట్లో సోమవారం (ఆగస్టు 12) లాంచ్ అయింది. రియల్‌మి లేటెస్ట్ బడ్జెట్ 5జీ స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమన్సిటీ 6300 5జీ చిప్‌సెట్‌తో రన్ అవుతుంది.

Read Also : Mahindra Thar Roxx : మహీంద్రా థార్ రోక్స్ 5-డోర్ కారు వచ్చేస్తోంది.. పూర్తి డిజైన్, ఫీచర్ల వివరాలు లీక్..

8జీబీ వరకు ర్యామ్, 128జీబీ ఇంటర్నల్ స్టోరేజీతో వస్తుంది. రియల్‌‌మి సి63 5జీ 10డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టుతో 5,000mAh బ్యాటరీని కలిగి ఉంది. రెండు కలర్ ఆప్షన్లలో వస్తుంది. రియల్‌మి మినీ క్యాప్షల్ 2.0 ఫీచర్‌ని కలిగి ఉంది. రియల్‌మి సి63 5జీ ఐపీ64 రేటింగ్‌ను కూడా కలిగి ఉంది.

భారత్‌లో రియల్‌మి సి63 5జీ ధర ఎంతంటే? :
రియల్‌మి సి63 5జీ 4జీబీ ర్యామ్+ 128జీబీ స్టోరేజీ ఆప్షన్ ధర రూ. 10,999కు అందిస్తోంది. 12జీబీ స్టోరేజ్‌తో 6జీబీ ర్యామ్, 8జీబీ ర్యామ్ వెర్షన్‌ల ధర వరుసగా రూ. 12,999, రూ. 11,999కు అందుబాటులో ఉన్నాయి. ఫారెస్ట్ గ్రీన్, స్టార్రి గోల్డ్ కలర్ ఆప్షన్‌లలో పొందవచ్చు. ఈ ఫోన్ ఫస్ట్ సేల్ ఆగస్ట్ 20 మధ్యాహ్నం 12:00 గంటలకు రియల్‌మి ఇండియా వెబ్‌సైట్, ఫ్లిప్‌కార్ట్ ద్వారా ప్రారంభమవుతుంది. పరిచయ ఆఫర్‌గా వినియోగదారులు రూ. 1000 ఎంచుకున్న బ్యాంక్ కార్డ్‌లతో ప్రారంభ ధర ట్యాగ్‌ని రూ. 9,999కు పొందవచ్చు.

రియల్‌మి సి63 5జీ స్పెసిఫికేషన్స్ :
డ్యూయల్-సిమ్ (నానో) రియల్‌మి సి63 5జీ ఆండ్రాయిడ్ 14-ఆధారిత రియల్‌మి యూఐ 5.0పై రన్ అవుతుంది. కంపెనీ ఫోన్ కోసం మూడు ఏళ్ల సెక్యూరిటీ అప్‌డేట్స్, రెండు ఏళ్ల సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ అందిస్తోంది. 6.67-అంగుళాల హెచ్‌డీ+ (720×1,604 పిక్సెల్‌లు) డిస్‌ప్లే 120Hz వరకు రిఫ్రెష్ రేట్, 625నిట్స్ గరిష్ట ప్రకాశం, 89.97 శాతం స్క్రీన్-టు-బాడీ రేషియో, 240Hz టచ్ శాంప్లింగ్ రేట్‌ను కలిగి ఉంది. మీడియాటెక్ డైమన్షిటీ 6300 5జీ చిప్‌సెట్‌తో పాటు 8జీబీ ర్యామ్ వరకు రన్ అవుతుంది. వర్చువల్ ర్యామ్ ఫీచర్ వినియోగదారులు ఆన్‌బోర్డ్ ర్యామ్‌ను 16జీబీ వరకు పెంచుకోవచ్చు.

ఇందులో మినీ క్యాప్సూల్ 2.0 ఫీచర్ కూడా ఉంది. ఆప్టిక్స్ విషయానికి వస్తే.. రియల్‌మి సి63 5జీలో 32ఎంపీ ఏఐ-బ్యాక్డ్ మెయిన్ రియర్ కెమెరాను అందిస్తుంది. ఫ్రంట్ సైడ్ సెల్ఫీలు, వీడియో చాట్‌లకు 8ఎంపీ కెమెరా ఉంది. మైక్రో ఎస్‌డీ కార్డ్‌ని ఉపయోగించి 2టీబీ వరకు విస్తరించుకోవచ్చు. 128జీబీ వరకు ఇంటర్నల్ స్టోరేజీతో వస్తుంది. కొత్త రియల్‌మి సి63 5జీలోని కనెక్టివిటీ ఆప్షన్లలో వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, యూఎస్‌బీ టైప్-సి పోర్ట్ ఉన్నాయి.

దుమ్ము, స్ప్లాష్ నిరోధకతకు ఐపీ64 రేటింగ్‌ను కలిగి ఉంది. రియల్‌‌మి సి63 5జీ ఫోన్ 10డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్, రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్‌తో పాటు 5,000mAh బ్యాటరీని కలిగి ఉంది. బ్యాటరీ యూనిట్ 29 రోజుల వరకు స్టాండ్‌బై టైమ్, సింగిల్ ఛార్జ్‌పై 40.1 గంటల వరకు కాలింగ్ సమయాన్ని అందిస్తుంది. దీని కొలతలు 165.6×76.1×7.9ఎమ్ఎమ్, బరువు 192 గ్రాములు ఉంటుంది.

Read Also : iPhone 15 Price : ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 15పై దిమ్మతిరిగే డిస్కౌంట్.. బ్యాంక్ ఆఫర్‌లతో ఈ డీల్ ఎలా పొందాలంటే?