Viral Video : ‘తౌబా తౌబా’ పాటకు యువతి డ్యాన్స్.. ఓ మైగాడ్.. ఏం కాలేదు.. రీల్స్ కోసం లైఫ్ రిస్క్..!
Viral Video : ఓ యువతి రోడ్డు పక్కన రీల్స్ కోసం డ్యాన్స్ చేస్తూ జారికింద పడింది. ‘బ్యాడ్ న్యూజ్’ మూవీలోని ‘తౌబా తౌబా’ పాటకు యువతి డ్యాన్స్ చేస్తుండగా ఒక్కసారిగా కాలుజారింది. అయినా ఆగకుండా మళ్లీ డ్యాన్స్ చేస్తూనే ఉంది.
Viral Video : సరదా కోసం చేసే కొన్ని పనులు ప్రాణాల మీదకు తెచ్చిపెడుతుంటాయి. ఓవర్ నైట్ ఫేమస్ అయిపోయేందుకు చాలామంది తెగ ప్రయత్నిస్తుంటారు. సోషల్ మీడియా ట్రెండ్ కోసం ఎంతకైనా తెగిస్తున్నారు. ఏదైనా హిట్ సాంగ్ వస్తే వెంటనే ఆ పాటకు రీల్స్ చేయడం మొదలుపెట్టేస్తున్నారు. ప్రమాదమని తెలిసి కూడా నడిరోడ్లపై డ్యాన్సులు చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. తాజాగా ఓ యువతి రోడ్డు పక్కన రీల్స్ కోసం డ్యాన్స్ చేస్తూ జారికింద పడింది. ‘బ్యాడ్ న్యూజ్’ మూవీలోని ‘తౌబా తౌబా’ పాటకు యువతి డ్యాన్స్ చేస్తుండగా ఒక్కసారిగా కాలుజారి కిందపడిపోయింది.
Read Also : అమ్మాయితో డేటింగ్ కోసం యాప్‌లో ఈ అబ్బాయి ఎలాంటి వివరాలు పొందుపర్చాడో చూడండి..
అదే సమయంలో ఆ రోడ్డుపై వాహనాలు వచ్చిపోతున్నాయి. యువతి కింద పడిన సమయంలో ఏ వాహనం రాలేదు కాబట్టి సరిపోయింది. ఒకవేళ వచ్చి ఉంటే ఆమె పరిస్థితి ఏంటి? అని నెటిజన్లు మండిపడుతున్నారు. అదృష్టం కొద్ది అప్పుడు ఏ వాహనం రాలేదని అంటున్నారు.
యువతి డ్యాన్స్ చేస్తుండగా జారికింద పడిన వీడియోను సోషల్ అకౌంటులో పోస్టు చేయడంతో వైరల్ అయింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. రీల్స్ కోసం లైఫ్ రిస్క్ లో పెడతారా? అని విమర్శిస్తున్నారు. దయచేసి ఇలాంటి పిచ్చి పనులు చేసి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని సలహాలు ఇస్తున్నారు.
View this post on Instagram
వైరల్ వీడియోలో ఒక యువతి రెడ్ శారీ ధరించి ఉంది. రోడ్డు పక్కన ‘తౌబా తౌబా’ పాటకు డ్యాన్స్ చేస్తూ స్టెప్పులు అదరగొట్టింది. కానీ, కాలు జారడంతో కిందపడింది. చేతులు అడ్డుగా పెట్టుకోవడంతో తలకు ఏమి కాలేదు. ఆ తర్వాత నవ్వుతూ లేచి మళ్లీ యువతి డ్యాన్స్ చేసింది.
ఈ యువతి ఇన్‌స్టాగ్రామ్‌లో మోనా డ్యాన్స్ అనే అకౌంట్ ద్వారా వీడియో షేర్ చేయగా 2 కోట్ల 41 లక్షల వ్యూస్ వచ్చాయి. యువతి డ్యాన్స్ చేస్తున్న సమయంలో బస్సు వేగంగా దూసుకెళ్లింది. ఏం కొంచెం అజాగ్రత్తగా ఉన్నా ప్రాణాలు పోయేవి అంటూ నెటిజన్లు తిట్టిపోస్తున్నారు. మరికొందరు మాత్రం యువతి డేరింగ్ డ్యాన్స్ చూసి ఆశ్చర్యపోతున్నారు.
Read Also : Reliance Jewels : శ్రావణ మాసంలో రిలయన్స్ జ్యువెల్స్ నుంచి ప్రత్యేక ‘వరలక్ష్మి కలెక్షన్’.. మరెన్నో ఆఫర్లు..!