అమ్మాయితో డేటింగ్ కోసం యాప్‌లో ఈ అబ్బాయి ఎలాంటి వివరాలు పొందుపర్చాడో చూడండి..
ఆ వివరాలు అన్నీ పొందుపర్చి అందరినీ ఆశ్చర్యపర్చాడు. తాను ప్రస్తుతం ఇన్ఫోసిస్‌లో..
ఉద్యోగం కోసం విద్యార్హతలు, మనం చదువుకున్న విద్యాలయాల వివరాలను ప్రొఫైల్లో పొందుపర్చుతాం. ఏ తరగతిలో ఎంత శాతం మార్కులతో పాస్ అయ్యామో రాస్తాం. అయితే, అమ్మాయితో డేటింగ్ చేయడానికి రూపొందించుకునే ప్రొఫైల్లో మాత్రం వ్యక్తిగత విషయాలు చెబుతాం.
ఓ యువకుడు మాత్రం డేటింగ్ యాప్ ప్రొఫైల్లో తన విద్యార్హతల వివరాలు అన్నీ పొందుపర్చి అందరినీ ఆశ్చర్యపర్చాడు. తాను ప్రస్తుతం ఇన్ఫోసిస్‌లో జాబ్ చేస్తున్నానని, ఎత్తు 5.10 అంగుళాలు ఉంటానని కూడా చెప్పాడు. దీంతో ఉద్యోగం కోసం దరఖాస్తు చేస్తున్నావా? డేటింగ్ కోసం ప్రొఫైల్ షేర్ చేస్తున్నావా? అంటూ నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నాడు.
ఆ యువకుడు తెలిపిన వివరాలకు సంబంధించిన స్క్రీన్ షాట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. డేటింగ్ కోసం విద్యా వివరాలను, విజయాలను పొందుపర్చడం ఏంటంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. ఐఐటీల్లో చదివే వాళ్లకి డేటింగ్ సైట్లను ఎలా వాడాలో కూడా తెలియదా అంటూ కొందరు కామెంట్లు చేశారు.
ఉద్యోగానికి పంపిన ప్రొఫైలే తీసుకుని డేటింగ్ యాప్ లో కాపీ పేస్ట్ చేసి ఉంటాడని కొందరు అంటున్నారు. ఇది లింక్డ్ ఇన్ అనుకున్నావా? డేటింగ్ యాప్ అనుకున్నావా? అంటూ కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ కామెంట్లు చేశారు.
These IIT nerds should be banned from using dating sites. LinkedIn nahi tinder hai yeh pic.twitter.com/Z90twDK2j0
— ohm_ohm (@severus_16) August 7, 2024
Also Read : నిశ్చాతార్థం అయ్యాక అతడి పెళ్లికి వెళ్లిన నాగచైతన్య.. వీడియో వైరల్