Reliance Jewels : శ్రావణ మాసంలో రిలయన్స్ జ్యువెల్స్ నుంచి ప్రత్యేక ‘వరలక్ష్మి కలెక్షన్’.. మరెన్నో ఆఫర్లు..!
Reliance Jewels : ప్రతీ ఒక్కరూ తమనకు నచ్చిన ఆభరణాలను షాపింగ్ చేసుకోవచ్చు. ఈ పండుగ సందర్భంగా బంగారం తయారీ ఛార్జీలు, డైమండ్ విలువపై ఫ్లాట్ 17శాతం తగ్గింపుని కూడా అందిస్తుంది.
Reliance Jewels : భారత్‌లో అత్యంత ప్రాచుర్యం పొందిన జ్యువెలరీల్లో రిలయన్స్ జ్యువెల్స్ ఒకటి. మహిళల నమ్మకానికి ప్రతీకగా నిలిచింది. శ్రావణమాసంలో మహిళల కోసం ప్రత్యేకమైన వరలక్ష్మి కలెక్షన్‌ను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. దక్షిణాదిలో వరలక్ష్మీ వ్రతాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో చేస్తుంటారు మహిళలు. లక్ష్మీదేవికి ఎంతో ప్రీతిపాత్రమైన ఈ శ్రావణ మాసంలో ప్రతీ ఒక్కరికీ అష్టైశ్వర్యాలు కలగాలని రిలయన్స్ జ్యువెల్స్ కోరుకుంటోంది.
ఈ సమయంలో ఆభరణాల్లో సంస్కృతీ సంప్రదాయాలకు పెద్దపీట వేస్తుంది. ఆభరణాలకు సరికొత్త కలెక్షన్ రూపొందించింది. తద్వారా శుభకార్యాలకు రిలయన్స్ జ్యువెల్స్ అత్యంత ప్రాధాన్యతను ఇస్తుందని చెప్పవచ్చు. 2024 ఏడాదిలో ప్రారంభమైన వరలక్ష్మి కలెక్షన్ అదే ట్యాగ్‌లైన్‌తో మొదలైంది. ‘మీలోని దేవత ఆశీర్వాదాన్ని అందుకోండి అనే ట్యాగ్‌లైన్‌తో ఈ వరలక్ష్మి కలెక్షన్ వస్తుంది. ఆకర్షణీయమైన డిజైన్‌లతో వస్తుంది. భారతీయ కలంకరి వారసత్వం నుంచి ప్రేరణ పొందింది.
వరలక్ష్మి కలెక్షన్ ద్వారా ప్రతీ మహిళ లక్ష్మీదేవిలా అలంకరించుకుని లక్ష్మీదేవి కరుణాకటాక్షాలు పొందాలని రిలయన్స్ జ్యువెల్స్ కోరుకుంటోంది. వరలక్ష్మి కలెక్షన్‌కు సంబంధించి మచిలీపట్నం, శ్రీకాళహస్తి, దక్షిణ భారత కళాత్మక వారసత్వం సంప్రదాయం ఉట్టిపడేలా అనేక డిజైన్లతో ఆభరణాలను రూపొందించారు. వినియోగదారులు బంగారు, వజ్రాల ఆభరణాలు రెండింటిలోనూ అద్భుతమైన కలెక్షన్ చూసి ఆశ్చర్యపోతారు. ఎందుకంటే.. ఆభరణంలో ప్రతీ భాగాన్ని పరిపూర్ణంగా తీర్చిదిద్దారు. కలెక్షన్‌లో అద్భుతమైన సెట్లు, బ్యాంగిల్స్, నెక్ వేర్ ఉన్నాయి.
17శాతం ఫ్లాట్ డిస్కౌంట్ :
ప్రతీ ఒక్కరూ తమనకు నచ్చిన ఆభరణాలను షాపింగ్ చేసుకోవచ్చు. ఈ పండుగ సందర్భంగా బంగారం తయారీ ఛార్జీలు, డైమండ్ విలువపై ఫ్లాట్ 17శాతం తగ్గింపుని కూడా అందిస్తుంది. సెప్టెంబరు 2, 2024 లోపు రూ. 5 లక్షలు కన్నా ఎక్కువ కొనుగోలు చేసిన వినియోగదారులకు అదనంగా 5శాతం తగ్గింపు అందిస్తుంది. కలెక్షన్‌లో ప్రతి ఆభరణం పురాతన ఫినిషింగ్, రాళ్లు, కెంపులు, పచ్చలు, మెరిసే ముత్యాల మిశ్రమంతో అలంకరించి ఉన్నాయి. అన్నీ అధునాతనమైన డ్యూయల్ టోన్‌లలో ప్రదర్శనకు ఉంచింది.
ఈ సందర్భంగా రిలయన్స్ జ్యువెల్స్ సీఈఓ సునీల్ నాయక్ మాట్లాడుతూ.. “మా వరలక్ష్మి కలెక్షన్ దక్షిణ భారత్‌లోని సాంస్కృతిక గొప్పతనానికి, కళాత్మక వారసత్వానికి ప్రతీక. ఈ కలెక్షన్ వరలక్ష్మి పండుగ స్ఫూర్తిని ప్రతిబింబిస్తుంది. మా కస్టమర్‌లకు వారి పండుగ వేడుకలకు మరింత ఆనందాన్ని అందిస్తుందని నమ్ముతున్నాము” అని ఆయన అన్నారు.
Read Also : BIG FM Auto Expo : బిగ్ ఆటో ఎక్స్‌పోను ప్రారంభించిన బిగ్ ఎఫ్‌ఎమ్.. ప్రదర్శనకు కొత్త మోడల్ కార్లు!