Redmi Note 14 Launch : రెడ్‌మి నోట్ 14, పోకో x7 నియో ఫోన్లు వచ్చేస్తున్నాయి.. లాంచ్‌కు ముందే వివరాలు లీక్..!

Redmi Note 14 Launch : రెడ్‌మి నోట్ 13, పోకో ఎక్స్6 నియో ఆండ్రాయిడ్ 13, కంపెనీ ఎంఐయూఐ 14 స్కిన్‌తో వస్తుంది. రెండు ఫోన్‌లు 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.67-అంగుళాల అమోల్డ్ స్క్రీన్‌ను కలిగి ఉన్నాయి.

Redmi Note 14 Launch : రెడ్‌మి నోట్ 14, పోకో x7 నియో ఫోన్లు వచ్చేస్తున్నాయి.. లాంచ్‌కు ముందే వివరాలు లీక్..!

Redmi Note 14, Poco X7 Neo Surface on BIS Certification Website Ahead of Anticipated Debut

Redmi Note 14 Launch : కొత్త ఫోన్ కోసం చూస్తున్నారా? భారత మార్కెట్లోకి సరికొత్త ఫోన్లు రాబోతున్నాయి. స్మార్ట్‌ఫోన్ రెగ్యులేటరీ వెబ్‌సైట్‌లో రెడ్‌మి నోట్ 14 కనిపించింది. అతి త్వరలో భారత మార్కెట్లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. రెడ్‌మి నోట్ 13 బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) సర్టిఫికేషన్ వెబ్‌సైట్‌లో జాబితా అయింది. ఈ జాబితాలో పోకో X7 నియోగా మరో హ్యాండ్‌సెట్ కూడా రాబోతోంది. ప్రస్తుతం రెడ్‌మి నోట్ 14 స్పెసిఫికేషన్‌లు చైనా 3సి వెబ్‌సైట్‌లో జాబితా అయింది.

Read Also : iPhone 16 Pro Series : భారీ బ్యాటరీతో ఐఫోన్ 16 ప్రో సిరీస్ వచ్చేస్తోంది.. ఫీచర్లు లీక్.. లాంచ్ ఎప్పుడు ఉండొచ్చుంటే?

రెడ్‌మి నోట్ 13 రీబ్యాడ్జ్ వెర్షన్‌ :
రెడ్‌మి మోడల్ నంబర్ 24094RAD4Iతో రెడ్‌మి హ్యాండ్‌సెట్ లిస్టులో బీఐఎస్ వెబ్‌సైట్‌లో (గిజ్మోచినా ద్వారా) లిస్టు అయింది. ఎంట్రీ హ్యాండ్‌సెట్ మోనికర్‌ను పేర్కొననప్పటికీ, ఇటీవల చైనా 3సీ రెగ్యులేటర్ ద్వారా ఆమోదించిన రెడ్‌మి నోట్ 14 వేరియంట్‌గా వస్తుంది. మోడల్ నంబర్ 24094RAD4Cతో జాబితా అయింది. అదే బీఐఎస్ లిస్టు మోడల్ నంబర్ 2409FPCC4Iతో పోకో హ్యాండ్‌సెట్‌ను కూడా ప్రవేశపెట్టనుంది.

అదే ఎంట్రీలో భాగంగా రెడ్‌మి నోట్ 14 మాదిరిగా ఉంటుందని సూచిస్తుంది. మరోసారి, స్మార్ట్‌ఫోన్ పేరు లేదా స్పెసిఫికేషన్‌ల గురించి ప్రస్తావించలేదు. ఈ ఏడాది ప్రారంభంలో పోకో ఎక్స్6 నియో రెడ్‌మి నోట్ 13 రీబ్యాడ్జ్ వెర్షన్‌గా రానుంది. బీఐఎస్ వెబ్‌సైట్‌లో లిస్టు అయిన పోకో హ్యాండ్‌సెట్ పోకో ఎక్స్7 నియో కావచ్చు.

రెడ్‌మి నోట్ 13, పోకో ఎక్స్6 నియో స్పెసిఫికేషన్‌లు :
రెడ్‌మి నోట్ 13, పోకో ఎక్స్6 నియో ఆండ్రాయిడ్ 13, కంపెనీ ఎంఐయూఐ 14 స్కిన్‌తో వస్తుంది. రెండు ఫోన్‌లు 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.67-అంగుళాల అమోల్డ్ స్క్రీన్‌ను కలిగి ఉన్నాయి. 6ఎన్ఎమ్ మీడియాటెక్ డైమెన్సిటీ 6800 చిప్‌సెట్‌తో ఆధారితంగా పనిచేస్తుంది. గరిష్టంగా 12జీబీ ర్యామ్ అందిస్తుంది. రెడ్‌మి నోట్ 13, పోకో ఎక్స్6 నియో రెండింటిలోనూ 3ఎక్స్ ఇన్-సెన్సార్ జూమ్, 2ఎంపీ డెప్త్ సెన్సార్‌తో 108ఎంపీ ప్రైమరీ కెమెరా ఉంది.

ఈ హ్యాండ్‌సెట్‌లు 16ఎంపీ సెల్ఫీ కెమెరాతో అమర్చి ఉన్నాయి. రెడ్‌మి నోట్ 14, పోకో ఎక్స్6 నియో 256జీబీ వరకు యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజీని అందిస్తాయి. 33డబ్ల్యూ ఛార్జింగ్‌కు సపోర్టుతో 5,000mAh బ్యాటరీని అందిస్తాయి. బయోమెట్రిక్ అథెంటికేషన్ కోసం రెండు ఫోన్‌లలో సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంది. ఈ హ్యాండ్‌సెట్‌లు ఐపీ54 రేటింగ్‌ను కలిగి ఉన్నాయి.

Read Also : Apple iPhone 15 : ఆపిల్ ఐఫోన్ 15పై అదిరే డీల్.. ధర ఎంత తగ్గిందంటే? మరెన్నో బ్యాంకు ఆఫర్లు..!