క్వార్టర్ రూ.100లోపే..! మందుబాబులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్..!

గంజాయి వినియోగం పెరగడానికి జగన్ ప్రభుత్వ విధానాలే కారణమని తమ అధ్యయనంలో తేలిందని ప్రభుత్వం చెప్పింది.

క్వార్టర్ రూ.100లోపే..! మందుబాబులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్..!

Ap New Liquor Policy (Photo Credit : Google)

Ap New Liquor Policy : కొత్త మద్యం పాలసీపై ఏపీ ఎక్సైజ్ శాఖ కసరత్తు చేస్తోంది. వివిధ రాష్ట్రాల్లో మద్యం విధానంపై అధ్యయనం చేస్తోంది. మద్యం కొనుగోళ్ల పాలసీపై వివిధ మద్యం కంపెనీలతో ఎక్సైజ్ శాఖ అధికారులు చర్చించారు. రాష్ట్రంలో అన్ని రకాల బ్రాండ్లకు అనుమతులు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నెలాఖరు లేదా వచ్చే నెల మొదటి వారంలోగా ప్రముఖ బ్రాండ్లు అందుబాటులోకి రానున్నాయి. తక్కువ ధరలో నాణ్యమైన మద్యాన్ని అందించేలా చర్యలు తీసుకోనున్నారు అధికారులు. వివిధ రకాల ప్రముఖ బ్రాండ్ల క్వార్టర్ బాటిళ్లు రూ.100 లోపే ఉండేలా ఎక్సైజ్ శాఖ చర్యలు తీసుకోనుంది.

తక్కువ ధర మద్యాన్ని అందుబాటులో లేకుండా చేసింది గత ప్రభుత్వం. మినిమం(క్వార్టర్) ధర రూ.200గా ఫిక్స్ చేసింది జగన్ సర్కార్. తక్కువ ధర మద్యం అందుబాటులో లేకపోవడం, మద్యం ధరలు భారీగా పెరగడంతో మందుబాబులు, యువత గంజాయికి అలవాటు పడ్డారని చంద్రబాబు ప్రభుత్వం భావిస్తోంది. గంజాయి వినియోగం పెరగడానికి జగన్ ప్రభుత్వ విధానాలే కారణమని తమ అధ్యయనంలో తేలిందని ప్రభుత్వం చెప్పింది. కొత్త మద్యం పాలసీ అక్టోబర్ నెల నుంచి అమల్లోకి రానుందని తెలుస్తోంది.

Also Read : వైఎస్ జగన్‌ను జైల్లో వేయాలి..!- హోంమంత్రి అనిత సంచలన వ్యాఖ్యలు