Cattle Farming : మేలైన పశువుల కోసం పునరుత్పత్తిలో చేపట్టాల్సిన యాజమాన్యం 

Cattle Farming : సాలుకు ఒక దూడ, ఏడాది పొడవునా పాల దిగుబడి అన్నసూత్రమే పాడిపరిశ్రమ అభివద్ధికి మూలం. అంటే పశుపోషణలో రైతులు లాభాలు పొందాలంటే  ఏడాదికి ఒక దూడ పుట్టే విధంగా జాగ్రత్త తీసుకోవాలి.

Cattle Farming : మేలైన పశువుల కోసం పునరుత్పత్తిలో చేపట్టాల్సిన యాజమాన్యం 

Cattle Reproduction

Cattle Farming : వాణిజ్య స్థాయిలో విస్తరించిన వ్యవసాయ అనుబంధ రంగం పాడి పరిశ్రమ. రైతులు పదుల సంఖ్య నుండి వందల సంఖ్యలో పశువులను పెంచుతూ.. ఆర్ధికంగా నిలదొక్కుకుంటున్నారు. అయితే నిర్వహణలో సరైన అవగాహన లేకపోవటం వల్ల కొంతమంది నష్టాలను చవిచూస్తున్నారు. దీనికి గల కారణాల్లో ప్రధానంగా కనిపిస్తోంది పశువుల పునరుత్పత్తి యాజమాన్యం.

Read Also : Technologies In Agriculture : వ్యవసాయ పనులు చేస్తున్న రోబో.. రెండు రూపాయల ఖర్చుతోనే ఎకరంలో కలుపుతీత

లక్షలుపోసి కొన్న పశువులు సరైన సమయంలో చూలు కట్టకపోతే రైతుకు ఖర్చు తడిసిమోపెడవుతోంది. దీని వల్ల ఈతల మధ్య వ్యవధి పెరిగి , పాడికాలం తగ్గి రైతుకు ఆర్ధికంగా తీవ్ర నష్టం వాటిల్లుతుంది. ఇలాంటి సమస్యల నుండి గట్టెక్కాలంటే పశువుల్లో పునరుత్పత్తి యాజమాన్యం గురించి రైతులు సరైన అవగాహనతో ముందడుగు వేయాలని తెలియజేస్తున్నారు వెంకటరామన్న గూడెం గేదెల పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డా. ఆనంద రావు.

సాలుకు ఒక దూడ, ఏడాది పొడవునా పాల దిగుబడి అన్నసూత్రమే పాడిపరిశ్రమ అభివద్ధికి మూలం. అంటే పశుపోషణలో రైతులు లాభాలు పొందాలంటే  ఏడాదికి ఒక దూడ పుట్టే విధంగా జాగ్రత్త తీసుకోవాలి. దీనికోసం పశువు ఈనిన 3వ నెలలోనే చూలుకట్టించాలి. కానీ చాలామంది రైతులు పశువును త్వరగా కట్టిస్తే పాలదిగుబడి తగ్గిపోతుందనే అపోహత త్వరగా చూలు కట్టించరు. దీనివల్ల పశువు వట్టిపోయే కాలం పెరిగి మేపు ఖర్చు భారమవుతుంది. ముఖ్యంగా ఆవులు ప్రతి సంవత్సరం ఈని, పదిమాసాలు పాలిచ్చి, రెండు మాసాలు వట్టిపోతూ ఉంటాయి.

గేదెల్లో అయితే వట్టిపోయేకాలం 2 నుండి 4 నెలలు వరకు వుంటుంది. పాడిపశువులు సాధారణంగా ఈనిన రెండవ నెలలో ఎదకు వస్తాయి. ప్రతి 21 రోజులకొసారి ఎదకు వస్తాయి. ఎద తగ్గిన తర్వాత 12 నుండి 14 గంటలకు అండాశయం నుండి అండం విడుదల అవుతుంది. అండం విడుదలయ్యేలోగా సహజ సంపర్కం ద్వారా ఆంబోతు లేదా దున్నతో దాటించడం గాని , కృత్రిమ సంపర్కం ద్వారా గాని వీర్యకణాలను ప్రవేశపెట్టాలి. ఆవుల్లో ఏడాది పొడవునా గర్భోత్పత్తి చేయవచ్చు. అయితే గేదెలు అధిక వేడిని భరించలేవు.

ఏప్రిల్ నుండి జులై వరకు అవి ఎక్కువగా ఎదకు రావు. చల్లని వాతావరణం కల్పిస్తే ఎండాకాలంలో కూడా గేదెలు ఎదకు వస్తాయి. సంతానోత్పత్తి సక్రమంగా జరగాలంటే పశుపోషకులు ఎదను సకాలంలో గుర్తించి సరైన సమయంలో కృత్రిమ గర్భధారణ లేదా సహజ సంపర్కం చేయిండాలి. ఇందుకోసం రైతులు ఎద లక్షాణాలను గమనించాలి… ఎలాంటి జాగ్రత్తలు చేపట్టాలో తెలియజేస్తున్నారు శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ వెంకటరామన్న గూడెం గేదెల పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డా. ఆనంద రావు.

పశువుల పెంపకంలో పాడి రైతులు పోషణాపరమైన చర్యలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. మొక్కుబడిగా కాకుండా పశు వైద్యులు సూచించిన దాణా అందిస్తే.. పశువుల శరీర అవసరాలకు అనుగుణంగా పోషక విలువలు సమకూరడంతో నాణ్యమైన పాల ఉత్పత్తికి అవకాశముంటుంది. అంతే కాదు ఈ వర్షాకాలంలో పశువుల షెడ్లలో పలు జాగ్రత్తలు తీసుకుంటేనే పశులు ఆరోగ్యంగా ఉంటాయి.

Read Also : Cotton Cultivation : కురుస్తున్న వర్షాలు.. పత్తిని కాపాడుకునే చర్యలు