Devara Glimpse : ‘దేవర’ గ్లింప్స్ వచ్చేసింది.. ‘భైర’ పాత్ర అదిరిందిగా..
తాజాగా నేడు సైఫ్ అలీ ఖాన్ పుట్టిన రోజు సందర్భంగా దేవర సినిమా నుంచి భైర పాత్ర గ్లింప్స్ రిలీజ్ చేశారు.

Devara Movie Saif Ali Khan Bhaira Character Glimpse Released
Devara Glimpse : కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్, జాన్వీ జంటగా తెరకెక్కుతున్న దేవర సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. దేవర సినిమా సెప్టెంబర్ 27న రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి గ్లింప్స్, సాంగ్స్ రిలీజ్ అయ్యాయి. అయితే తాజాగా నేడు మరో గ్లింప్స్ రిలీజయింది.
దేవర సినిమాలో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తున్నాడు. ఈ సినిమాలో భైర అనే పాత్రలో సైఫ్ అలీఖాన్ కనిపించబోతున్నాడని గతంలో ఆల్రెడీ ప్రకటించారు. తాజాగా నేడు సైఫ్ అలీ ఖాన్ పుట్టిన రోజు సందర్భంగా దేవర సినిమా నుంచి భైర పాత్ర గ్లింప్స్ రిలీజ్ చేశారు. మీరు కూడా దేవర నుంచి భైర గ్లింప్స్ చూసేయండి..
ఈ గ్లింప్స్ లో భైర పాత్రని చాలా బలంగా చూపించారు. మల్లయుద్ధంలో భైర ఈజీగా గెలిచినట్టు, ఒక వర్గానికి భైర నాయకుడు అన్నట్టు చూపించారు. విలన్ పాత్ర ఇంత పవర్ ఫుల్ గా ఉందంటే ఇక ఎన్టీఆర్ పాత్ర ఇంకెంత పవర్ ఫుల్ గా ఉంటుందో అని అభిమానులు అంచనా వేసుకుంటున్నారు.