Telangana Congress : నానక్ రామ్‌గూడ‌లో ఇవాళ రాత్రి సీఎల్పీ స‌మావేశం.. రేపు అభిషేక్ సింఘ్వీ నామినేషన్

తెలంగాణ కోటాలోని రాజ్యసభ స్థానానికి సీనియర్ నేత కేకే రాజీనామా చేయడంతో వచ్చే నెల 3న ఉప ఎన్నిక జరగనుంది.

Telangana Congress : నానక్ రామ్‌గూడ‌లో ఇవాళ రాత్రి సీఎల్పీ స‌మావేశం.. రేపు అభిషేక్ సింఘ్వీ నామినేషన్

CM Revanth Reddy

Telangana Congress Party : కాంగ్రెస్ పార్టీ శాసనసభా పక్ష సమావేశం ఇవాళ జరగనుంది. రాత్రి 7గంటలకు నానక్ రామ్‌గూడ‌లోని హోటల్ షెరటాన్ లో ప్రారంభమవుతుంది. సీఎల్పీ సమావేశానికి ఎమ్మెల్యేలతోపాటు ఎమ్మెల్సీలు, ఎంపీలకు ఆహ్వానం అందించారు. ఈ సమావేశంలో రాజ్యసభ అభ్యర్థి అభిషేక్ సింఘ్వీ పరిచయ కార్యక్రమంతోపాటు, తాజా రాజకీయ పరిణామాలపై చర్చించనున్నారు. ఈ సమావేశంలో పాల్గొనేందుకు కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థి అభిషేక్ సింఘ్వీ మధ్యాహ్నం హైదరాబాద్ చేరుకుంటారు. సీఎల్పీ సమావేశంలో తన రాజ్యసభ అభ్యర్దిత్వానికి మద్దతు ఇవ్వాలని పార్టీ ఎమ్మెల్యేలను మర్యాద పూర్వకంగా సింఘ్వీ కోరనున్నారు. రేపు అసెంబ్లీలో 11గంటలకు సింఘ్వీ నామినేషన్ దాఖలు చేస్తారు. ఈ నామినేషన్ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డితోపాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గోనున్నారు.

Also Read : బీఆర్ఎస్ పదేళ్లలో చేయలేక పోయింది.. రేవంత్ రెడ్డి 8 నెలల్లోనే చేశారు: జగ్గారెడ్డి

తెలంగాణ కోటాలోని రాజ్యసభ స్థానానికి సీనియర్ నేత కేకే రాజీనామా చేయడంతో వచ్చే నెల 3న ఉప ఎన్నిక జరగనుంది. దీనికి కాంగ్రెస్ పార్టీ తరపున ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి అభిషేక్ మనుసింఘ్వీ అభ్యర్థిత్వాన్ని ఇటీవల హైకమాండ్ ఖరారు చేసింది. దీంతో ఈ స్థానంలో సింఘ్వీని గెలిపించుకోవడమే ప్రధాన ఎజెండగా సీఎల్పీ సమావేశం సాగనుంది. దీనికితోడు రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులు, రైతు రుణమాఫీ వ్యవహారం జరుగుతున్న చర్చ పలు విషయాలపై ఈ సమావేశంలో నేతలు చర్చించనున్నారు.

Also Read : ఎక్కడైనా చర్చకు సిద్ధం.. సీఎం రేవంత్ రెడ్డికి హరీశ్ రావు సవాల్

ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లిన సమయంలో కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థి అభిషేక్ మనుసింఘ్వీ భేటీ అయ్యారు. ఢిల్లీలోని సీఎం అధికారిక నివాసానికి వచ్చి రేవంత్ రెడ్డిని సింఘ్వీ మరద్య పూర్వకంగా కలిశారు. తెలంగాణ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా అవకాశం కల్పించినందుకు రేవంత్ కు కృతజ్ఞతలు తెలిపారు.