Oppo F27 5G Price : ఒప్పో నుంచి సరికొత్త 5జీ ఫోన్.. లాంచ్‌కు ముందే కీలక ఫీచర్లు లీక్.. ధర ఎంత ఉండొచ్చుంటే?

Oppo F27 5G Launch : రాబోయే ఎఫ్-సిరీస్ ఫోన్ రెండు ర్యామ్, స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌లలో అందుబాటులో ఉంటుందని తెలిపింది. ఒప్పో ఎఫ్27 5జీ ఫోన్ మీడియా టెక్ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్‌లో రన్ అవుతుంది.

Oppo F27 5G Price : ఒప్పో నుంచి సరికొత్త 5జీ ఫోన్.. లాంచ్‌కు ముందే కీలక ఫీచర్లు లీక్.. ధర ఎంత ఉండొచ్చుంటే?

Oppo F27 5G Price in India, Specifications Leaked ( Image Source : Google )

Updated On : August 17, 2024 / 11:47 PM IST

Oppo F27 5G Price Launch : కొత్త ఫోన్ కోసం చూస్తున్నారా? భారత మార్కెట్లోకి ఒప్పో నుంచి సరికొత్త ఎఫ్27 5జీ ఫోన్ రాబోతుంది. త్వరలో కంపెనీ నెక్స్ట్ ఎఫ్-సిరీస్ హ్యాండ్‌సెట్‌గా భారత మార్కెట్లో లాంచ్ కానుంది. చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీదారు ఇంకా కచ్చితమైన లాంచ్ తేదీని వెల్లడించనప్పటికీ, ఒప్పో ఎఫ్27 5జీ ధర, స్పెసిఫికేషన్‌లు ఆన్‌లైన్‌లో లీక్ అయ్యాయి.

Read Also : Smartphone Box Value : కొత్త స్మార్ట్‌ఫోన్ కొన్నాక సీల్ బాక్స్ ఎందుకు పారేయకూడదు.. తప్పక తెలుసుకోండి..!

రాబోయే ఎఫ్-సిరీస్ ఫోన్ రెండు ర్యామ్, స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌లలో అందుబాటులో ఉంటుందని తెలిపింది. ఒప్పో ఎఫ్27 5జీ ఫోన్ మీడియా టెక్ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్‌లో రన్ అవుతుంది. ఈ హ్యాండ్‌సెట్ ఐపీ64 రేటింగ్‌ను కలిగి ఉందని, 5,000ఎంఎహెచ్ బ్యాటరీతో పాటు 50ఎంపీ ప్రైమరీ రియర్ కెమెరాను కలిగి ఉంటుందని నివేదించింది.

భారత్‌లో ఒప్పో ఎఫ్27 5జీ ధర (లీక్) : ధర రూ.
భారత మార్కెట్లో ఒప్పో ఎఫ్27 5జీ బేస్ 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 22,999, 8జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజీ టాప్-ఆఫ్-ది-లైన్ వేరియంట్ ధర రూ.24,999కు అందించనుంది. అంబర్ ఆరెంజ్, ఎమరాల్డ్ గ్రీన్ అనే రెండు కలర్ ఆప్షన్లలో లాంచ్ కాబోతోంది. ఒప్పో ఎఫ్27 5జీ ఆగస్ట్ 18 నుంచి అమ్మకానికి అందుబాటులో ఉంటుందని నివేదించింది. రూ. 1,800 వరకు ఒప్పో ఇన్‌స్టంట్ క్యాష్‌బ్యాక్‌, వివిధ బ్యాంక్ కార్డ్ లావాదేవీల ద్వారా చేసిన చెల్లింపులకు 6 నెలల పాటు నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్, వన్-టైమ్ ఫ్రీ స్క్రీన్ రీప్లేస్‌మెంట్ ఉండవచ్చు.

ఒప్పో ఎఫ్27 5జీ స్పెసిఫికేషన్‌లు (లీక్) :
నివేదిక ప్రకారం.. ఒప్పో ఎఫ్27 5జీ ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారంగా కలర్ఓఎస్ 14లో రన్ అవుతుంది. 120Hz రిఫ్రెష్ రేట్, 2,100నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో 6.67-అంగుళాల ఫుల్-హెచ్‌డీ+ ఓఎల్ఈడీ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌తో పాటు 8జీబీ ఎల్‌పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 256జీబీ వరకు యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజ్‌తో అందిస్తుంది.

ఒప్పో ఎఫ్27 5జీ ఫోన్ 50ఎంపీ ప్రైమరీ కెమెరా, 2ఎంపీ పోర్ట్రెయిట్ కెమెరాతో కూడిన డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్‌ను కలిగి ఉంటుంది. ఫ్రంట్ సైడ్ 32ఎంపీ సోనీ ఐఎమ్ఎక్స్615 సెల్ఫీ షూటర్‌ను పొందవచ్చు. ఏఐ స్టూడియో, ఏఐ ఎరేజర్ 2.0, ఏఐ స్మార్ట్ ఇమేజ్ మ్యాటింగ్ 2.0 వంటి ఏఐ ఫీచర్లతో ఫోన్ షాపింగ్ చేసే అవకాశం ఉంది. ఒప్పో ఎఫ్27 5జీ 45డబ్ల్యూ సూపర్ వూక్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీతో వస్తుందని భావిస్తున్నారు. దుమ్ము, నీటి నిరోధకతకు ఐపీ64 రేటింగ్‌ను కలిగి ఉండే అవకాశం ఉంది. నివేదిక ప్రకారం.. డ్యూయల్ స్పీకర్లతో కూడా అమర్చి ఉండవచ్చు.

Read Also : Noise Buds N1 Pro : భారత్‌లో నాయిస్ బడ్స్ ఎన్1 ప్రో ఇదిగో.. కేవలం రూ. 2వేల లోపు మాత్రమే..!