Noise Buds N1 Pro : భారత్‌లో నాయిస్ బడ్స్ ఎన్1 ప్రో ఇదిగో.. కేవలం రూ. 2వేల లోపు మాత్రమే..!

Noise Buds N1 Pro Launch : ఇయర్‌బడ్‌లు పవర్‌ఫుల్ సౌండ్, బాస్‌ను అందించే 11ఎమ్ఎమ్ డ్రైవర్‌లను కూడా కలిగి ఉంటాయి. మ్యూజిక్ ప్రియులకు బెస్ట్ ఆప్షన్ అందిస్తుంది.

Noise Buds N1 Pro : భారత్‌లో నాయిస్ బడ్స్ ఎన్1 ప్రో ఇదిగో.. కేవలం రూ. 2వేల లోపు మాత్రమే..!

Noise Buds N1 Pro with ANC launched in India, price ( Image Source : Google )

Updated On : August 17, 2024 / 10:23 PM IST

Noise Buds N1 Pro : ప్రముఖ భారతీయ బ్రాండ్ నాయిస్ బడ్స్ ఎన్1 ప్రోను ప్రవేశపెట్టింది. ఈ కొత్త ఇయర్‌బడ్‌లు స్టైలిష్ లుక్‌తో ఆడియో ఎక్స్‌పీరియన్స్ అందిస్తోంది. గత మోడల్ మాదిరిగానే నాయిస్ బడ్స్ ఎన్1 అమెజాన్‌లో టాప్ సెల్లర్‌గా అవతరించింది. నాయిస్ బడ్స్ ఎన్1 ప్రో స్పెషల్ ఫీచర్ అడ్వాన్స్‌డ్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ (ANC) టెక్నాలజీతో వస్తుంది.

Read Also : Mark Zuckerberg : మెటా సీఈఓ మరుపురాని గిఫ్ట్.. పెరట్లో ఏకంగా భార్య ప్రిస్సిల్లా శిల్పం.. ప్రేమంటే ఇదేగా..!

వినియోగదారులను బ్యాక్‌గ్రౌండ్ నాయిస్‌ని రిమూవ్ చేయొచ్చు. క్లీన్ ఆడియో ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది. ఇయర్‌బడ్‌లు పవర్‌ఫుల్ సౌండ్, బాస్‌ను అందించే 11ఎమ్ఎమ్ డ్రైవర్‌లను కూడా కలిగి ఉంటాయి. మ్యూజిక్ ప్రియులకు బెస్ట్ ఆప్షన్ అందిస్తుంది. నాయిస్ బడ్స్ ఎన్1 ప్రో ముఖ్య ఫీచర్లలో ఒకటి బ్యాటరీ లైఫ్.. బ్రాండ్ ఇన్‌స్టాచార్గ్ టెక్నాలజీతో ఇయర్‌బడ్‌లు మొత్తం 60 గంటల ప్లేటైమ్‌ను అందించగలవు.

అదనంగా, కేవలం 10 నిమిషాల ఛార్జింగ్ 200 నిమిషాల వరకు ప్లే టైమ్ అందిస్తుంది. గేమర్‌లు, వీడియో ఔత్సాహికులకు నాయిస్ బడ్స్ ఎన్1 ప్రో 40ఎమ్ఎస్ వరకు అందిస్తుంది. లాగ్‌ను తగ్గిస్తుంది. మొత్తం ఎక్స్‌పీరియన్స్ మెరుగుపరుస్తుంది. ఇయర్‌బడ్‌లు హైపర్‌సింక్ టెక్నాలజీతో కూడా అమర్చి ఉంటాయి. త్వరిత, అవాంతరాలు లేని కనెక్షన్‌ని అందిస్తుంది. క్వాడ్ మైక్ ఎన్విరాన్‌మెంటల్ నాయిస్ క్యాన్సిలేషన్ (ENC) ఫీచర్ అవాంఛిత నాయిస్‌ని ఫిల్టర్ చేయడం ద్వారా స్పష్టమైన కాల్స్ అందిస్తుంది.

నాయిస్ బడ్స్ ఎన్1 ప్రో డిజైన్ ఆకర్షణీయంగా ఉంటుంది. క్రోమ్, మెటాలిక్ ఫినిషింగ్‌తో అడ్వాన్స్ ఫీచర్లను అందిస్తుంది. ఇయర్‌బడ్‌లు కూడా ఐపీఎక్స్5 నీటి-నిరోధకతను కలిగి ఉంటాయి. వర్కౌట్‌లు, అవుట్‌డోర్ యాక్టివిటీలకు అనుకూలంగా ఉంటాయి. నాయిస్ బడ్స్ ఎన్1 ప్రో క్రోమ్ బ్లాక్, క్రోమ్ గ్రీన్, క్రోమ్ పర్పుల్, క్రోమ్ బీజ్ అనే మొత్తం 4 కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. ఈ ఇయర్‌బడ్‌లు నెలాఖరు నాటికి అమెజాన్‌లో అందుబాటులో ఉంటాయి. నాయిస్ అధికారిక వెబ్‌సైట్ (gonoise.com)లో అందుబాటులో ఉంటాయి.

Read Also : Smartphone Box Value : కొత్త స్మార్ట్‌ఫోన్ కొన్నాక సీల్ బాక్స్ ఎందుకు పారేయకూడదు.. తప్పక తెలుసుకోండి..!