Rain Alert : తెలంగాణలో నాలుగు రోజులు భారీ వర్షాలు.. ఇవాళ ఆ ఏడు జిల్లాలకు భారీ వర్ష సూచన

తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. వచ్చే నాలుగు రోజులు పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

Rain Alert : తెలంగాణలో నాలుగు రోజులు భారీ వర్షాలు.. ఇవాళ ఆ ఏడు జిల్లాలకు భారీ వర్ష సూచన

Rain Alert

Updated On : August 17, 2024 / 7:09 AM IST

Telangana Rain Alert : తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. శుక్రవారం హైదరాబాద్ సహా రాష్ట్రంలోని ఎనిమిది జిల్లాల్లో జడివాన కురిసింది. కరీంనగర్, మెదక్, జగిత్యాల, సిద్ధిపేట, నిజామాబాద్ జిల్లాల పరిధిలో అనేక మండలాల్లో భారీ వర్షం కురిసింది. అత్యధికంగా కరీంనగర్ జిల్లా చిగురుమామిడిలో 17.1 సెం.మీ వర్షపాతం నమోదైంది. కర్ణాటక పరిసర ప్రాంతాల్లో ఆవర్తనం కేంద్రీకృతమై ఉందని, దీనిమీదుగా ద్రోణి కొనసాగుతున్న కారణంగా 17 నుంచి 20వ తేదీ వరకు పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

Also Read : Heavy Rain : మెదక్ జిల్లాలో దంచికొట్టిన వాన.. కొట్టుకుపోయిన బైకులు..!

ఇవాళ వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు పాటించాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. అదేవిధంగా శనివారం నుంచి మంగళవారం వరకు ఉమ్మడి అదిలాబాద్ జిల్లా, ఉమ్మడి నిజామాబాద్, ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి వరంగల్, ఉమ్మడి ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.