Group 1 Mains Exam : గ్రూప్-1 మెయిన్స్ షెడ్యూల్ రిలీజ్.. పరీక్షలు ఎప్పుడంటే?
Group 1 Mains Exam : అక్టోబర్ 21 నుంచి అక్టోబర్ 27 వరకు గ్రూపు మెయిన్స్ పరీక్ష నిర్వహించనున్నారు. తెలుగు, ఉర్దూ, ఇంగ్లీష్ మీడియంలో మెయిన్స్ పరీక్షలను నిర్వహించనున్నారు.

TGPSC Group 1 Mains exam Schedule Released Today
Group 1 Mains Exam : గ్రూపు 1 పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నారా? మీకో గుడ్ న్యూస్.. తెలంగాణ రాష్ట్రంలో గ్రూపు -1 మెయిన్స్ పరీక్షల షెడ్యూల్ విడుదల అయింది. ఈ మేరకు టీజీపీఎస్సీ శుక్రవారం (ఆగస్టు 16) షెడ్యూల్‌ను రిలీజ్ చేసింది.
షెడ్యూల్ ప్రకారం.. అక్టోబర్ 21 నుంచి అక్టోబర్ 27 వరకు గ్రూపు మెయిన్స్ పరీక్ష నిర్వహించనున్నారు. తెలుగు, ఉర్దూ, ఇంగ్లీష్ మీడియంలో మెయిన్స్ పరీక్షలను నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలను నిర్వహించనున్నారు.
Read Also : IPS Officers Transfer : ఏపీలో 10మంది ఐపీఎస్ అధికారుల బదిలీలు.. విజయవాడ డీసీపీగా కేఎం మహేశ్వర్ రాజు