IPS Officers Transfer : ఏపీలో 10మంది ఐపీఎస్ అధికారుల బదిలీలు.. విజయవాడ డీసీపీగా కేఎం మహేశ్వర్ రాజు
IPS Officers Transfer : ఏపీ రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత బదిలీ అయ్యి, పోస్టింగ్ లేకుండా వెయిటింగ్‌లో ఉన్న పలువురు ఐపీఎస్ అధికారులు వరుసగా సెలవులకు దరఖాస్తు చేసుకున్నారు.

10 IPS officers Transferred in Andhra Pradesh State
IPS Officers Transfer : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 10 మంది ఐపీఎస్‌లను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు డీజీపీ ద్వారకా తిరుమలరావు బదిలీ ఉత్తర్వులను శుక్రవారం (ఆగస్టు 16) జారీ చేశారు. విజయవాడ డీసీపీగా కేఎం మహేశ్వర్ రాజును నియమించగా, అనంతపురం ఎస్పీగా పి.జగదీశ్, గ్రేహౌండ్స్ కమాండర్‌గా గరుడ్ సుమిత్ సునీల్, చింతూరు ఏఎస్పీగా పంకజ్ కుమార్ మీనా, గుంతకల్లు ఎస్‌ఆర్పీగా రాహుల్ మీనా (రైల్వే పోలీసు), ఇంటెలిజెన్స్ ఎస్పీగా నచికేత్ విశ్వనాథ్, పార్వతీపురం ఎస్‌డీపీవోగా అంకిత మహవీర్‌ను నియమించారు.
Read Also : ఏపీలో వరుస కేసులు.. ఒకరి తర్వాత ఒకరు.. నెక్ట్స్ లిస్ట్‌లో వచ్చే పేరు ఎవరిదో?
వెయిటింగ్‌లో ఉన్న అధికారులు వీరే..
1. పీఎస్ఆర్ ఆంజనేయులు, డీజీ
2. పీవీ సునీల్ కుమార్, డీజీ
3.ఎన్.సంజయ్, అదనపు డీజీ
4. కాంతి రాణా తాతా, ఐజీ
5. జి.పాలరాజు, ఐజీ
6. కొల్లి రఘురామ్డ్డి, ఐజీ
7. ఆర్.ఎన్. అమ్మిరెడ్డి, డీఐజీ
8. సీహెచ్. విజయరావు, డీఐజీ
9. విశాల్ గున్నీ, డీఐజీ
10. కేకేఎన్ అన్బురాజన్, ఎస్పీ
11. వై. రవిశంకర్రెడ్డి, ఎస్పీ
12. వై. రిషాంత్రెడ్డి, ఎస్పీ
13.కె. రఘువీరారెడ్డి, ఎస్పీ
14.పి. పరమేశ్వర్రెడ్డి, ఎస్పీ
15. పి.జాష ఎస్పీ
16. కృష్ణకాంత్ పటేల్, ఎస్పీ
మూకుమ్మడిగా అధికారుల సెలవులు :
ఏపీ రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత బదిలీ అయ్యి, పోస్టింగ్ లేకుండా వెయిటింగ్‌లో ఉన్న పలువురు ఐపీఎస్ అధికారులు వరుసగా సెలవులకు దరఖాస్తు చేసుకున్నారు. వెయిటింగ్ ఉన్న 16 మంది ఐపీఎస్ అధికారులు రోజూ ఉదయం 10 గంటలకు డీజీపీ కార్యాలయానికి వెళ్లి అక్కడ హాజరు పట్టీలో సంతకాలు చేయాలి. పనిగంటలు ముగిసేవరకూ కార్యాలయంలోనే ఉండి సంతకం చేశాకే మళ్లీ బయటకు రావాలని ఇటీవల డీజీపీ సీహెచ్ ద్వారకా తిరుమలరావు మెమో జారీ చేశారు.
ఈ నేపథ్యంలో వారంతా మూకుమ్మడిగా సెలవు పెట్టారు.