Hyderabad : ఖైరతాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం..

బంజారాహిల్స్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కు కూతవేటు దూరంలోనే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో..

Hyderabad : ఖైరతాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం..

Road Accident

Road Accident : ఖైరతాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఖైరతాబాద్ నుంచి బంజారాహిల్స్ వైపు అతి వేగంతో వెళ్తున్న కొత్త బీఎండబ్ల్యూ కారు డివైడర్ ను ఢీ కొట్టింది. ప్రమాద సమయంలో కారులో ఇద్దరు యువతులు, ఇద్దరు యువకులు ఉన్నారు. ఇద్దరికి తీవ్రగాయాలు అయ్యాయి. దీంతో వారిని చికిత్స నిమిత్తం బంజారాహిల్స్ లోని కేర్ ఆసుపత్రికి తరలించారు. ఉదయం 7.30 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో బీఎండబ్ల్యూ కారు ముందు భాగం నుజ్జునుజ్జు అయింది.

Also Read : Aditya Tiwari : వావ్.. ఈ బుడ్డోడు చేస్తున్న పనికి సెల్యూట్ చేయాల్సిందే.. వీడియోలు చూస్తే ఫిదా అవుతారు

బంజారాహిల్స్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కు కూతవేటు దూరంలోనే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో జితేష్ బుగాని అనే యువకుడు కారు డ్రైవ్ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. జితేష్ బుగానీ తండ్రి ప్రభుత్వంలో ఒక ఉన్నతాధికారి అని సమాచారం. ఖైరతాబాద్ పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. మద్యం మత్తులో కారు ప్రమాదం జరిగిందా? నిరక్ష్యం కారణంగా ప్రమాదం జరిగిందా అని పోలీసులు ఆరా తీస్తున్నారు.