Yuvan Shankar Raja : ఇంటి అద్దె చెల్లించలేని స్థితిలో పాపులర్ సంగీత దర్శకుడు? రూ.20లక్షలు కూడా లేవా?
మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా తనయుడిగా సినీ పరిశ్రమలో అడుగుపెట్టి అనతికాలంలోనే తన కంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా.

Police Complaint against music composer Yuvan Shankar Raja
Yuvan Shankar Raja : మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా తనయుడిగా సినీ పరిశ్రమలో అడుగుపెట్టి అనతికాలంలోనే తన కంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా. తమిళంతో పాటు తెలుగులో ఎన్నో సినిమాలకు తన సంగీతంతో ప్రాణం పోయాడు. చెన్నైలోని నుంగంబాక్కం ప్రాంతంలో నివాసం ఉంటున్న అతడు తాజాగా ఓ వివాదంలో చిక్కుకున్నాడు. తాను అద్దెకు ఉంటున్న ఇంటికి రూ.20లక్షల అద్దె చెల్లించకుండా రాత్రికి రాత్రే ఇల్లు ఖాళీ చేసేందుకు ప్రయత్నిస్తున్నాడని చెన్నై పోలీసులకు ఫిర్యాదు అందించింది.
నుంగంబాక్కం సరస్సు ప్రాంతంలో అజ్మత్ బేగం అనే వారికి సంబంధించిన ఇంట్లో యువన్ శంకర్ రాజా అద్దెకు ఉంటున్నాడు. అయితే.. యువన్ అద్దె చెల్లించుకుండా ఇబ్బందులు పెడుతున్నాడని, ఇప్పటి వరకు రూ.20లక్షలు బాకీ ఉన్నాడని అజ్మత్ బేగం సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అద్దె కోసం అతడికి ఫోన్ చేస్తే స్పందించడం లేదన్నాడు. తమకు ఎలాంటి సమాచారం అందించకుండానే ఇల్లు ఖాలీ చేస్తున్నాడని, ఇప్పటికే కొన్ని వస్తువులను మరో ఇంటికి షిప్ట్ చేశాడని ఆరోపించారు.
ప్రస్తుతం ఈ విషయం కోలీవుడ్‌లో హాట్ టాఫిక్‌గా మారింది. భారీ బడ్జెట్ సినిమాలకు సంగీతాన్ని అందిస్తూ పెద్ద మొత్తంలో రెమ్యునరేషన్ తీసుకునే యువన్ రూ.20 లక్షలు చెల్లించలేని స్థితిలో ఉన్నాడా..? అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. దీనిపై యువన్ శంకర్ రాజా స్పందించాల్సి ఉంది.
ఇదిలా ఉంటే.. ప్రస్తుతం యువన్ పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. విజయ్ ది గోట్, సర్దార్ 2, మారీసన్ వంటి చిత్రాలకు సంగీతాన్ని అందిస్తున్నాడు.
National Award Actress : ఈ చిన్ని పాప ఎవరో గుర్తుపట్టారా? ఇప్పుడు నేషనల్ అవార్డు విన్నర్..