Kandi Plant Protection : కందిలో పురుగులు ఆశించే సమయం.. ముందస్తుగా నివారణకు చర్యలు 

Kandi Plant Protection : ఖరీఫ్ కంది పంటకాలం, సాగుచేసిన రకాన్నిబట్టి 150 నుండి 180 రోజులు. జూన్ నుండి జులై వరకు విత్తిన ఈ పంట  40 నుండి 60 రోజుల దశలో ఉంది. చాలా ప్రాంతాల్లో  పూత, పిందె తయారయ్యే దశలో ఉంది.

Kandi Plant Protection : కందిలో పురుగులు ఆశించే సమయం.. ముందస్తుగా నివారణకు చర్యలు 

Kandi Plant Protection

Kandi Plant Protection : ఖరీఫ్ కంది ప్రస్తుతం పూత, పిందె దశలో ఉంది. పంట తయారయ్యే సున్నతమైన ఈ దశలో వివిధ రకాల పురుగులు పంటపై దాడిచేసే ప్రమాదం ఉంది. ఇప్పటికే చాలా చోట్ల మారుక మచ్చల పురుగు, శనగ పచ్చపురుగు ఆశించినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. వీటి వల్ల తీవ్ర నష్టం జరిగే ప్రమాదం ఉంది.  వీటి నివారణకు సత్వరమే చేపట్టాల్సిన సస్యరక్షణ చర్యల గురించి తెలియజేస్తున్నారు వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డా. యం. మధు.

Read Also :  Agri Tips : వ్యవసాయంలో యాంత్రీకరణతో కూలీల కొరతకు చెక్ – సమయం ఆదాతో పాటు తగ్గనున్న పెట్టుబడులు 

ఖరీఫ్ కంది పంటకాలం, సాగుచేసిన రకాన్నిబట్టి 150 నుండి 180 రోజులు. జూన్ నుండి జులై వరకు విత్తిన ఈ పంట  40 నుండి 60 రోజుల దశలో ఉంది. చాలా ప్రాంతాల్లో  పూత, పిందె తయారయ్యే దశలో ఉంది. అయితే 20 రోజులు పాటు బెట్టకు గురైన కందిపంట ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు కుదురుకుంది.

చాలా చోట్ల ఎత్తుపెరిగన కందిలో కలుపు అధికంగా ఉంది. ప్రస్తుతం మొక్కలు శాఖీయంగా అభివృద్ధి చెందేందుకు రైతులు తలలను తుంచడమే కాకుండా అంతర కృషితో కలుపు నివారించాలని సూచిస్తున్నారు వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డా. యం. మధు.

కంది చాలా ప్రాంతాల్లో పూత, పిందె తయారయ్యే సమయం. ఈ సమయంలోనే  పురుగుల బెడద అధికంగా ఉంటుంది. పూత, పిందె దశలో వున్న కంది పంటలో మారుకా మచ్చలపురుగు, శనగ పచ్చపురుగల ఆశించడంతో దిగుబడిపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. రైతులు ఈ పురుగులపై నిఘా వుంచి వెంటనే తగిన నివారణ చర్యలు చేపట్టాలంటూ సూచిస్తున్నారు.

Read Also : Crop Protection : మొక్కజొన్నలో చీడపీడల నివారణ