Dragon Fruit Variety : అధిక ఎండలను తట్టుకునే డ్రాగన్ ఫ్రూట్ రకం.. అధిక దిగుబడినిస్తున్న ఎడారి పండు

Dragon Fruit Variety : డ్రాగన్ ఫ్రూట్‌కు దేశ వ్యాప్తంగా మంచి మార్కెట్‌ ఉంది. దిగుబడులు మార్కెట్ లోకి ఒకేసారి వస్తుండటంతో ధరలు కూడా బాగా తగ్గాయి. గతంలో కిలో పండ్లు రూ.250 పైనే పలికేవి.

Dragon Fruit Variety : అధిక ఎండలను తట్టుకునే డ్రాగన్ ఫ్రూట్ రకం.. అధిక దిగుబడినిస్తున్న ఎడారి పండు

Dragon Fruit Variety

Updated On : August 26, 2024 / 3:28 PM IST

Dragon Fruit Variety : తెలుగు రాష్ట్రాల్లో విస్తరించిన,  ఉద్యాన పంట డ్రాగన్ ఫ్రూట్. దీని సాగుకు, అనుకూలమైన పరిస్థితులు ఉండటంతో, రైతులు ఈ పంటను అధిక విస్తీర్ణంలో సాగుచేశారు. అయితే… ఈ పంటసాగులో మార్కెట్ సమస్యలు వచ్చినా.. వాటిని అధిగమించిన వారికి మంచి లాభాలను పొందుతున్నారు. అలా లాభాలు పొందుతున్న వారిలో అనంతపురం జిల్లాకు చెందిన ఓ రైతు ఉన్నారు. మార్కెట్ అవకాశాలను అందిపుచ్చుకుంటూ.. లాభాల బాటలో పయనిస్తున్నారు.

Read Also : Soil Test For Agriculture : నేలకు ఆరోగ్యం.. పంటకు బలం – భూసార పరీక్షలతోనే అధిక దిగుబడులు  

మారిన ఆహార అలవాట్లతో, కొత్త పంటలు, వినూత్న పండ్ల తోటలు విస్తరిస్తున్నా యి. వినియోగదారుల ఆసక్తి, మార్కెట్‌లో ఉన్న డిమాండ్‌ దృష్ట్యా, రైతులు పంటల ఎంపిక చేసుకుంటున్నారు. ఇలా వచ్చిన పంటే డ్రాగన్ ఫ్రూట్. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే విస్తరించిన  డ్రాగన్ ఫ్రూట్ సాగును కరువుసీమ అయిన అనంతపురం జిల్లాలో కూడా విస్తరిస్తోంది.

అయితే, ఇక్కడ అధిక ఉష్ణోగ్రతలు ఉండటం చేత అన్ని రకాలు నిలవడం సాధ్యం కాదు.. దీన్నే పరిశీలించిన అనంతపురం జిల్లా, గార్లదిన్నె మండలం, మర్తాడా గ్రామానికి చెందిన రైతు రమణారెడ్డి తైవాన్ నుండి జైన్ రకం డ్రాగన్ ఫ్రూట్ మొక్కలను దిగుమతి చేసుకొని 5 ఏళ్ల క్రితం 3 ఎకరాల్లో నాటారు. నాటిన మొదటి ఏడాది నుండే దిగుబడులు ప్రారంభమయ్యాయి. ఈ రకం అధిక వేడిని తట్టుకోవడమే కాకుండా.. ఈ పండులో తీపి, నిల్వగుణం ఎక్కువగా ఉండటంతో మార్కెట్ లో మంచి ఆదరణ పొందుతోంది.

డ్రాగన్ ఫ్రూట్‌కు దేశ వ్యాప్తంగా మంచి మార్కెట్‌ ఉంది. దిగుబడులు మార్కెట్ లోకి ఒకేసారి వస్తుండటంతో ధరలు కూడా బాగా తగ్గాయి. గతంలో కిలో పండ్లు రూ.250 పైనే పలికేవి. ప్రస్తుతం మార్కెట్ లో కిలో ధర రూ. 100 నుండి 120 వరకే అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ పంటకు పెట్టుబడి అధికం.

ఒకసారి పెడితే 20 నుండి 30 ఏళ్ళ వరకు దిగుబడిని పొందవచ్చు. పెట్టిన పెట్టుబడిని త్వరగా పొందాటంలే మాత్రం హైడెన్సిటీ విధానంలో డ్రాగన్ ప్రూట్ సాగుచేయలంటున్నారు రైతు రమణారెడ్డి. కొత్తగా పెట్టే వారు మాత్రం మొక్కల ఎంపికలో పలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

Read Also : Agri Tips : ఖరీఫ్‌కు అనువైన.. స్వల్పకాలిక సన్న, దొడ్డుగింజ రకాలు