వైసీపీకి మరో బిగ్‌షాక్.. ఇద్దరు ఎమ్మెల్సీలు రాజీనామా
ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరో బిగ్‌షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్సీలు కర్రి పద్మశ్రీ, బల్లి కల్యాణ చక్రవర్తి రాజీనామా చేశారు.

YCP MLCs Karri Padma and Chakravarthy
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరో బిగ్‌షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్సీలు కర్రి పద్మశ్రీ, బల్లి కల్యాణ చక్రవర్తి రాజీనామా చేశారు. మండలి చైర్మన్ కొయ్యే మోషన్ రాజును కలసి రాజీనామా లేఖలు అందజేశారు. కళ్యాణ చక్రవర్తి ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నిక కాగా, కర్రి పద్మశ్రీ గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అయ్యారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గత కొద్దిరోజులుగా వరుస షాక్ లు తగులుతున్నాయి. ఆ పార్టీని వీడుతున్న ప్రజాప్రతినిధుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది.
ఇటీవల ఎమ్మెల్సీ పోతుల సునీత ఆ పార్టీ నుంచి బయటకు వచ్చారు. గురువారం వైసీపీ రాజ్యసభ సభ్యులు మోపిదేవి, వెంకటరమణ, బీద మస్తాన్ రావు తమ రాజ్యసభ సభ్యత్వాలకు రాజీనామాలు చేసిన విషయం తెలిసిందే. వారు త్వరలో సీఎం చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీలో చేరతారని సమాచారం. వారిద్దరితోపాటు మరికొందరు వైసీపీ రాజ్యసభ సభ్యులు త్వరలో ఆ పార్టీని వీడబోతున్నారని ఏపీ రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది.
Also Read : గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్.. విచారణకు ఆదేశం