Beejamruta : బీజామృతంతో విత్తనశుద్ధి చేస్తే పంటలకు చీడపీడల బెడదను అరికట్టవచ్చా? బీజామృతం తయారీ ఎలాగంటే?

Beejamruta : బీజామృతంతో విత్తనశుద్ధి చేస్తే పంటలకు చీడపీడల బెడదను అరికట్టవచ్చా? బీజామృతం తయారీ ఎలాగంటే?

Beejamruta

Beejamruta : ప్రకృతి వ్యవసాయంలో ఎటువంటి రసాయనిక ఎరువులు, పురుగుమందులు వాడం కాబట్టి సాధ్యమైనంత వరకు నాటు లేదా దేశవాళీ విత్తనాలనే వాడుకోవాలి. మేలైన విత్తనాన్ని ఎంపిక చేసుకోవడంతోనే సరిపోదు దాన్ని శుద్ధి చేసి విత్తుకున్నప్పుడే చీడపీడల బెడద లేకుండా పంట దిగుబడి బాగుంటుంది.

పంట నుంచి సంక్రమించుకున్న తెగుళ్ళ నుంచి విత్తనానికి విముక్తి కలిగించటానికి, నారు ఉపయోగించేప్పుడు ఒక ప్రాంతంలో ఉన్న వేర్లు మరొక ప్రాంతానికి వెళ్లి బ్రతకటానికి, భూమి నుంచి సంక్రమించే తెగుళ్లను నిరోధించడానికి బీజమృతం ఉపయోగపడుతుంది. పొలంలో విత్తనాలను విత్తుకోవటానికి ముందు విత్తనాలను బీజా మృతంతో శుద్ధి చేయడం అన్నది ముఖ్యమైన విషయం. అదెలాగో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

బీజామృతం తయారీ విధానం ;

బీజామృతం తయారీకి కావలిసిన పదార్ధములు :

1. నీరు- 20 లీటర్లు
2. దేశీ ఆవు మూత్రం – 5 లీటర్లు
3. దేశీ ఆవు పేడ 5 కిలోలు
4. పొడి సున్నమ్ – 50 గ్రాములు
5. పొలం గట్టు మన్ను – దోశేడు

తయారీ విధానం: దేశీ ఆవు పెడను ఒక పల్చటి గుడ్డలో మూటగా కట్టి 20లీటర్ల నీరున్న తొట్టిలో 12 గంటలు ఉంచాలి.ఒక లీటర్ నీటిని వేరే పాత్రలో తీసుకొని 50 గ్రాముల సున్నమ్ కలిపి రాత్రంతా ఉంచాలి. రెండో రోజు ఉదయాన్నే నానబెట్టిన పేడ మూటను చేత్తో పిండి , ఆసారాన్ని నీటి తొట్టిలో కలపాలి. పేడ నీళ్ళ తొట్టిలో పొలం గట్టు మన్నును పోసి కర్రతో కుడి వైపుకు కలియ తిప్పాలి. 5 లీటర్ల దేశీ ఆవు మూత్రాన్ని , సున్నపు నీటిని పేడ నీరున్న తొట్టిలో పోసి కలిసే వరకు కుడి వైపుకు తిప్పలి. అన్ని కలిసిన తరువాత 12 గంటల పాటు ఉంచాలి.

ఈ బీజమృతాన్ని ఒక రాత్రి అలాగే ఉంచి 48 గంటల లోపే వాడుకోవాలి. విత్తనాలకు బాగా పట్టించి వాటిని నీడలో ఆరబెట్టుకొని నాటడానికి సిద్దం చేసుకోవాలి. విత్తన శుద్ది లేదంటే పొలంలో నాటాలనుకున్న మొక్కల వేర్లను బీజమృతంలో ముంచి నాటడం వలన తెగుళ్ళు రాకుండా అరికట్టవచ్చు.