Cauliflower Farming : కాలీఫ్లవర్ సాగుతో.. అధిక లాభాలు ఆర్జిస్తున్న రైతు

మొత్తం 3 ఎకరాలలో కాలీఫ్లవర్ సాగును చేపట్టారు రైతు మోర్ల గణపతి. కొమురం భీం ఆసిఫాబాద్‌జిల్లా, వాంకిడి మండలం, జైత్‌పూర్‌గ్రామానికి చెందిన ఈయన.. గతంలో కంది, పత్తి లాంటి సంప్రదాయ పంటలను సాగు చేసేవారు. అయితే దిగుబడులు బాగున్నా.. మార్కెట్‌లో ధరలు రాకపోవడంతో ఎప్పుడూ నష్టాలనే చవిచూసేవారు.

Cauliflower Farming : కాలీఫ్లవర్ సాగుతో.. అధిక లాభాలు ఆర్జిస్తున్న రైతు

Cauliflower Farming

Cauliflower Farming Profits : కాలీఫ్లవర్.. శీతాకాలం (winter)లో పండే పంట. దిగుబడి కూడా అధికంగా వస్తుంది. అయితే వేసవి (summer), వర్షాకాలాలు (Rainy season) ఈ పంట సాగుకు అంతాగా అనుకూలం కాదు. అయితే మార్కెట్ లో మాత్రం ధరలు అధికంగానే ఉంటాయి. దీన్నే ఆసరగా చేసుకొని కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా (Kumuram Bheem Asifabad district) కు చెందిన ఓ యువరైతు (young farmer) వేసవిలో కాలిఫ్లవర్ సాగుచేసి అధిక దిగుబడులు తీస్తున్నారు. వచ్చిన పంటను స్థానిక మార్కెట్లలో అమ్ముతూ.. మంచి ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు.

READ ALSO : Disease Management : కందలో సూక్ష్మదాతు లోపం, చీడపీడల ఉధృతి.. నివారణకు శాస్త్రవేత్తల సూచనలు

మొత్తం 3 ఎకరాలలో కాలీఫ్లవర్ సాగును చేపట్టారు రైతు మోర్ల గణపతి. కొమురం భీం ఆసిఫాబాద్‌జిల్లా, వాంకిడి మండలం, జైత్‌పూర్‌గ్రామానికి చెందిన ఈయన.. గతంలో కంది, పత్తి లాంటి సంప్రదాయ పంటలను సాగు చేసేవారు. అయితే దిగుబడులు బాగున్నా.. మార్కెట్‌లో ధరలు రాకపోవడంతో ఎప్పుడూ నష్టాలనే చవిచూసేవారు.

దీంతో పంటల సాగు సరళిని మార్చాలనుకున్నారు. కూరగాయల సాగును ఎంచుకున్నారు. అంతే కాదు శీతాకాలంలో మాత్రమే పంట అయిన కాలీఫ్లవర్ ను , వేసవిలో పండిస్తూ.. మంచి దిగుబడులను తీస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్ లో కాలీఫ్లవర్ కు అధిక ధర పలుకుతుండటంతో , అధిక లాభాలను ఆర్జిస్తున్నారు.

READ ALSO : Kanda Yam Cultivation : కంద సాగుతో మంచి ఆదాయం.. అధిక దిగుబడుల కోసం యాజమాన్య పద్ధతులు !

రైతులు మార్కెట్ ను దృష్టిలో పెట్టుకొని పంటల సాగుచేస్తే లాభాలు వాటంతట అవే వస్తాయి. అయితే ప్రణాళిక బద్ధంగా సాగు చేస్తూ.. సమయానుకూలంగా మేలైన యాజమాన్య పద్ధతులు పాటించాలి. వీటిని పాటిస్తూ.. అన్ సీజన్ లో కాలీఫ్లవర్ సాగుచేపట్టి ,  ఉద్యాన అధికారుల సలహాలు, సూచనలతో అధిక లాభాలను ఆర్జిస్తున్నారు రైతు.