Marigold Flower Farming : మార్కెట్ లో బంతికి మంచి డిమాండ్.. అధిక దిగుబడి కోసం మేలైన యాజమాన్యం
పూలలో బంతి ముఖ్యమైంది. వివిధ రంగుల్లో పలు రకాల విత్తనాలు మార్కెట్ లో అందుబాటులోకి రావడం, ఇటు ప్రజలు కూడా శుభకార్యాలలో బంతికి అధిక ప్రాధాన్యం ఇవ్వడంతో మార్కెట్లో డిమాండ్ పెరిగింది.

Marigold Flower Farming
Marigold Flower Farming : మార్కెట్ లో ఎప్పుడూ గిరాకీ ఉండే పూలు బంతి. వీటి సాగు రైతులకు ఎంతో లాభదాయకంగా ఉంటుంది. ఇతర పంటలతో పోల్చిచూస్తే బంతి సాగు సులువు . ముఖ్యంగా సన్న , చిన్నకారు రైతులు బంతి సాగు చేసి మంచి లాభాలు గడించడానికి అవకాశాలు ఉన్నాయి. అయితే సరైన ప్రణాళికలను రూపొందించుకొని, మేలైన యాజమాన్య పద్ధతులు పాటించినట్లైతే అధిక దిగుబడులను సాదించవచ్చని తెలియజేస్తున్నారు విశాఖ జిల్లా, చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు.
పూలలో బంతి ముఖ్యమైంది. వివిధ రంగుల్లో పలు రకాల విత్తనాలు మార్కెట్ లో అందుబాటులోకి రావడం, ఇటు ప్రజలు కూడా శుభకార్యాలలో బంతికి అధిక ప్రాధాన్యం ఇవ్వడంతో మార్కెట్లో డిమాండ్ పెరిగింది. సంవత్సరం పొడవునా సాగుచేసే అవకాశం ఉండటంతో సాగు విస్తీర్ణం కూడా ఏ ఏటికాయేడు పెరుగుతూనే ఉంది. అయితే రైతులు సరైన దిగుబడులను తీయలేకపోతున్నారు.
READ ALSO : Texas woman arrest : జడ్జీనే చంపేస్తానని బెదిరించిన టెక్సాస్ మహిళ అరెస్ట్
బంతి పంటకాలం 120రోజులు. నాటిన 55రోజులనుంచి పూలదిగుబడి ప్రారంభమవుతుంది. కాబట్టి ముందునుండే ఎరువులతో పాటు పోషకాల యాజమాన్యం, చీడపీడల నివారణ చేపట్టాల్సి ఉంటుంది. బంతిపూల సాగులో అధిక దిగుబడి కోసం ఎలాంటి యాజమాన్య పద్ధతులు చేపట్టాలో తెలియజేస్తున్నారు విశాఖ జిల్లా, చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త సందీప్ నాయక్.