Chili Farms : మిరపతోటల్లో సమీకృత యాజమాన్య పద్ధతులు!

ప్రధాన క్షేత్రంలో పాగాకు లద్దె పురుగుకు అముదం మొక్కలు, శనగ పచ్చపురుగుకు ఐంతి మొక్కలు వంటి ఆకర్షణ పంటలను పెంచాలి. ఆకు మచ్చ తెగులు, ఆకు కుళ్ళు తెగులు, ఎండు తెగులును నిరోధించడానికై కిలో విత్తనాల్లో 4 గ్రా. చొప్పున టైకోదెర్మా విరిడి వంటి ప్రత్యర్థి ఫంగితో విత్తనాలను శుద్ధి చేయాలి.

Chili Farms : మిరపతోటల్లో సమీకృత యాజమాన్య పద్ధతులు!

Chili Farms :

Chili Farms : మార్కెట్లో మంచి డిమాండ్ ఉండటంతో రైతులు మిరపపంట సాగుకు వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే సరైన యాజమాన్య పద్దతులు పాటించక పోవటం కారణంగా దిగుబడులు సరిగ్గా పొందలేకపోతున్నారు. చీడపీడల నివారణ సైతం మిరపలో రైతులకు సవాలుగా మారుతుంది. అయితే రైతులు మిరపనారు పొలంలో నాటింది మొదలు సకాలంలో సరైన జాగ్రత్తలు పాటిస్తే చీడపీడల నుండి పంటను రక్షించుకోవటంతోపాటు, మంచి దిగుబడిని పొందేందుకు అవకాశం ఉంటుంది. మిర్చిలో చేపట్టాల్సిన యాజమాన్య పద్దతుల గురించి నిపుణులు కొన్ని సూచనలు చేస్తున్నారు. అవేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

యాజమాన్య ఏద్దతులు :

మిర్చి పొలం లో ప్రధాన సమస్య కలుపు. కలుపు మొక్కలను లేకుండా చేయాలి. పొలంలో తెగులు లక్షణాలను గమనించిన వెంటనే, వైరస్‌ సోకిన మొక్కలను తొలగించి, తదుపరి వ్యాప్తిని అరికట్టడానికై ధ్వంసం కాల్చివేయాలి. పంటలో వైరస్‌ సోకిన మొక్కలు లేకుండా చేయడానికై భూమిలో తగినంత తేమ ఉన్నప్పుడు, నాటిన 15వ రోజున, 45వ రోజున ఎకరాకు 12 కిలోల చొప్పున 3 గ్రా. కార్బోఫ్యూరాన్‌ లేదా ఎకరాకు 8 కిలోల చొప్పున 0.8 గ్రా. ఫిసానిల్‌ మందును రెండుసార్లు వేయాలి. ప్రత్యామ్నాయంగా మోనోక్రోటోఫాస్‌ 1.5 మి.లీ. లేదా ఎసిఫేట్‌ 1 గ్రాము లేదా ఫిప్రానిల్‌ 2 మి.లీ. ఒక లీటరు నీటికి కలిపి అవసరాన్ని బట్టి పిచికారి చేయాలి.

ఎల్‌.సి.ఎ. 384, ఎస్‌.సి.ఎ. 235 వంటి తెగులు తట్టుకునే రకాలను ఎన్నుకొని సాగు చేసుకోవాలి. విత్తన శుద్ధి చేసుకోవాలి. సేంద్రియ ఎరువుల వాడకాన్ని ప్రోత్సహించాలి. చుట్టుపక్కల ఉన్న పాలాలనుండి పురుగు ఆశించకుండా నిరోధించడానికి మరియు రసం పీల్చే పురుగుల నివారణకుగాను బదనిక పురుగుల వృద్ధికి తోడ్పడటానికి మిరపతోట చుట్టూ 2 లేక ౩ వరుసలు ఏపుగా ఎదిగే జొన్న, మొక్కజొన్న పైర్లను విధిగా వేయాలి.

వైరస్‌ సోకిన పంటనుండి సేకరించిన విత్తనాల వాడకాన్ని నివారించాలి. క్రిమికీటకాలు సోకడాన్ని తగ్గించే బీన్స్‌ తోను, తృణధాన్యాలతోను పంట మార్చిడి విధానాన్ని పాటించాలి. నులి పురుగులను తగ్గించే బంతి మొక్కలను , ఉల్లి, వెల్లుల్లిలతో అంతర పంటల విధానాన్ని పాటించాలి. పొలాన్ని వేసవిలో లోతుగా దున్నినట్లయితే, భూమిలో దాగి ఉన్న పురుగులు, ఫేథోజోన్స్‌, నులి పురుగులు వెలుపలికి వచ్చి సూర్యరశ్మికి చనిపోతాయి. పక్షులు వీటిని ఏరుకుని తింటాయి. అఖరుసారి కోత కోసిన తరువాత పంట అవశేషాలను వెంటనే
నాశనం చేయాలి.

తెగుళ్ళను తట్టుకునే రకాలకు చెందిన ఆరోగ్యవంతమైన, ధృవీకృత విత్తనాలను వాడాలి. సిఫారసు చేసిన వ్యవసాయ పద్ధతులను అనుసరించాలి. పక్కపాలాల్లో మిరప పంటకు ముందు మోనోక్రావింగ్‌ను పొలానాసిమీస్‌ పంటల సాగును నివారించాలి. చుట్టుప్రక్కల ఉన్న పొలాలనుంచి పురుగులను ఆశించకుండా నిరోధించడానికి మరియు సహజ శత్రువులైన బదనిక పురుగుల వృద్ధికి స్థావరాలను ఏర్పరచడానికి గాను 2-3 వరుసలు ఏపుగా ఎదిగే మొక్కజొన్న లేదా సజ్జ పైర్లను విధిగా వేయాలి.

ప్రధాన క్షేత్రంలో పాగాకు లద్దె పురుగుకు అముదం మొక్కలు, శనగ పచ్చపురుగుకు ఐంతి మొక్కలు వంటి ఆకర్షణ పంటలను పెంచాలి. ఆకు మచ్చ తెగులు, ఆకు కుళ్ళు తెగులు, ఎండు తెగులును నిరోధించడానికై కిలో విత్తనాల్లో 4 గ్రా. చొప్పున టైకోదెర్మా విరిడి వంటి ప్రత్యర్థి ఫంగితో విత్తనాలను శుద్ధి చేయాలి. లేదా సుమారు 15-21 రోజులపాటు నారుమళ్ళపై 60-100 గేజ్‌ మందం కలిగిన పారదర్శక పాలిథీన్‌ షీట్లను ఉపయోగిస్తూ నేలపై సూర్యరళ్ళి ఉండేటట్లు చూడాలి. ఇందువల్ల కలుపు మొక్కల విత్తనాలు, నులి పురుగులు, విశ్రాంతి దశల్లో ఉండే కీటకాలు, చీడలు చనిపోవడానికి వీలవుతుంది.

మిరపకాయ తొలుచు పురుగుల నివారణ కోసం వేప గింజల కషాయం ఎన్‌.ఎస్‌.కె.ఇ. 5 శాతం వేయాలి. గుడ్డు సమూహాలను, లార్వా స్థావరాలను, పెరిగే పిల్ల పురుగులను సేకరించి ధ్వంసం చేయాలి. విరామ సమయాల్లో తెగుళ్ళ సర్వే స్మౌటింగ్‌ పని చేపట్టాలి. శనగపచ్చ పురుగు, పొగాకు లద్దె పురుగులకు సంబంధించిన తల్లి పురుగుల సాంద్రతలను పర్యవేక్షించడానికై ఎకరాకు 4 చొప్పున లింగాకర్షక బుట్టలను, దీపపు ఎరలను అమర్చురోవాలి. వివిధ కీటకాలను, చీడలను ఏరుకొని తినేదాన్ని అధికం చేయడానికై హెక్టారుకు 50 చొప్పున పక్షి స్థావరాలను ఏర్పాటు చేసుకోవాలి.

శనగపచ్చ పురుగు కోసం వారం రోజుల వ్యవధిలో ఆరుసార్లు పూత పూసే దశనుండి హెక్టారుకు 60,000 చొప్పున ఎగ్‌ పారాసిటాయిడ్స్‌ టైకోడెర్మా చిలోనిస్‌ విడుదల చేయాలి. శనగపచ్చ పురుగు కోసం హెక్టారుకు 500 (ఎల్‌.ఇ) చొప్పున పిచికారి చేయాలి. చిన్న పాగాకు లద్దె పురుగుల కోసం ఎస్‌. ఎన్‌.పి.వి.ని పిచికారి చేయాలి.