Green Bean Pest : శనగపంటకు నష్టం కలిగించే శనగపచ్చ పురుగు నివారణకు చేపట్టాల్సిన సస్యరక్షణ చర్యలు !

పంట వేసే ముందుగా వేసవిలో లోతైన దుక్కులు చేసుకోవాలి. అంతరపంటగా ధనియాలు 16:4 సాగు చేయాలి. చుట్టుపక్కల 4 నాలుగు వరసల జొన్న పంట, 50 నుండి 100 బంతి మొక్కలను నాటుకోవాలి. జీవరసాయనాలైన వేప గింజల కాషాయం లేదా వేప నూనె (300 పి.పి.ఎమ్‌) 5 మి.లీ. మొగ్గ దశలో పిచికారి చేయాలి.

Green Bean Pest : శనగపంటకు నష్టం కలిగించే శనగపచ్చ పురుగు నివారణకు చేపట్టాల్సిన సస్యరక్షణ చర్యలు !

Green Bean Pest :

Green Bean Pest : నల్లరేగడి నేలల్లో రబీలో సాగు చేసే పంటలలో శనగ కూడా ఒకటి. చలి కాలంలో తేమ ఈ పంటకు అనుకూలంగా ఉంటుంది. నీరు నిల్వని చౌడు లేని, తేమ బాగా పట్టి ఉండే సారవంతమైన , మధ్యస్ధ నేతలు ఈ పంట సాగుకు అనుకూలంగా ఉంటాయి. శనగ పంటకాలంలో 90 నుండి 100 రోజులుంటుంది. ఎకరానికి 8 నుండి 10 క్వింటాళ్ల దిగుబడి సాగుకు ఉపయోగించే విత్తన రకాలను బట్టి ఉంటుంది. సాగుకు ఎకరానికి 25 కిలోల వరకు విత్తనం అవసరమౌతుంది. ముఖ్యంగా శనగ పంటలో చీడపీడల బెడద అధికంగా ఉంటుంది. ముఖ్యంగా శనగపచ్చ పురుగు పంటను ఆశించి తీవ్రనష్టం కలిగిస్తుంది. రైతులు దీనిపట్ల అప్రమత్తంగా ఉండి సరైన చర్యలు చేపట్టాలని నిపుణులు సూచిస్తున్నారు.

శనగ పచ్చ పురుగు నివారణ ;

ఈ పురుగు ఆశించినట్లయితే పంట తీవ్రమైన నష్టానికి గురై దిగుబడులు తగ్దే అవకాశం ఉంది. దీని యొక్క తల్లి పురుగు లేత చిగుళ్ళపై లేదా పిందెలపై విడివిడిగా లేత పసుపు రంగు గుడ్లను పెడుతుంది. గుడ్ల నుండి వెలువడిన పిల్ల పురుగు మొగ్గల్ని గోకి తింటుంది. ఎదిగిన లార్వాలు మొగ్గల్ని తొలిచి, కాయలోనికి తలను చొప్పించి మిగిలిన శరీరాన్ని బయటకు ఉంచి లోపల గింజలను తిని డొల్ల చేస్తాయి.

ఈ పురుగు తిన్న కాయలకు గుండ్రటి రంధ్రాలు కనిపిస్తాయి. మొగ్గ, పూత మరియు పిందె దశలో చిరుజల్లు లేదా వర్షం పడి ర్యాతి ఉష్టోగ్రతలు ఒక్కసారిగా పెరిగినట్లయితే ఈ పురుగు
యొక్క ఉధృతి అధికం అవుతుంది.

పంట వేసే ముందుగా వేసవిలో లోతైన దుక్కులు చేసుకోవాలి. అంతరపంటగా ధనియాలు 16:4 సాగు చేయాలి. చుట్టుపక్కల 4 నాలుగు వరసల జొన్న పంట, 50 నుండి 100 బంతి మొక్కలను నాటుకోవాలి. జీవరసాయనాలైన వేప గింజల కాషాయం లేదా వేప నూనె (300 పి.పి.ఎమ్‌) 5 మి.లీ. మొగ్గ దశలో పిచికారి చేయాలి. బ్యాసిల్లస్‌తుఇంజెన్సిస్‌ 300 (గ్రా. ఒక ఎకరానికి మరియు హెలికోవెర్పా యన్‌.పి.వి. 200 మి.లీ. ద్రావణాన్ని ఎకరాకు పిచికారి చేసుకోవాలి. ద్రావణాన్ని ఎకరాకు పిచికారి చేసుకోవాలి. ఎకరాకు 4 లింగాకర్షక బుట్టలను అమర్చుకోవాలి.

ఎనిఫేట్‌ 75 శాతం ఎస్‌.పి. 1.5 గ్రా. లేదా క్వినాల్‌ఫాస్‌ 25% ఇ.సి. 2.0 మి.లీ. లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి. ఉధృతి ఎక్కువగా ఉన్నపుడు ఇంఆక్సాకార్చ్‌ 14.5% యస్‌.సి. 1.0 మి.లీ. లేదా క్లోరాంట్రానిల్మిపోల్‌ 18.5% ఎస్‌.ని 0.8 మి.లీ. లేదా ఫ్లూబెండమైడ్‌ 39.35% యస్‌.సి. 0.2 మి.లీ. లీటరు నీటిలో వేసి కలుపుకోవాలి. లేదా లామ్డసైహాలోత్రిన్ 5శాతం ఇ.సి 1 మి.లీ లీటరు నీటిలో లేదా ఇమామెక్టిన్ బెంజోయేట్ 5శాతం యస్.జి 0.5గ్రా ఒక లీటరు నీటిలో పిచికారి చేయాలి.