Chili Production : నాణ్యమైన మిరప నారు ఉత్పత్తి కోసం రైతులు అనుసరించాల్సిన విధానం!

నారు మడికి ఎంపిక చేసిన భూమిని బాగా దుక్కిదున్ని ఎత్తైన నారుమళ్ళను తయారు చేయాలి. ఒక ఎకరా నేల సాగు చేసేందుకు 10మీ పొడవు, 1 మీ వెడల్పుగల నాలుగు మడులు అవసరం అవుతాయి. మడికి మడికి మధ్య నీటి కాలువలను ఏర్పాటు చేయాలి.

Chili Production : నాణ్యమైన మిరప నారు ఉత్పత్తి కోసం రైతులు అనుసరించాల్సిన విధానం!

chili production

Chili Production : మిరప పంట దిగుబడి నారుమడి పెంపపకంపైనే అధారపడి ఉంటుంది. అధిక దిగుబడులు పొందటానికి నారుమడి దశలోనే రైతాంగం తగిన జాగ్రత్తలు పాటించాలి. రైతులు మైబ్రీడ్ మిరప విత్తనాలనే ఎక్కువగా సాగుకు ఎంచుకుంటున్నారు. వీటి ధర ఎక్కువగా ఉంటుంది. కాబట్టి విత్తనాన్ని మొక్కగా మొలిపించటమే కీలకం. నారుమడిని పెంచే ముందు మనం సాగు చేసే విస్తీర్ణానికి అనుగుణంగా నారుమడి తయారు చేసుకోవాలి.

విత్తనం ఎంపిక, నారుమడి పెంపకం ;

మిరప సాగులో అతి ముఖ్యమైనది విత్తనం ఎంపిక. మిరపను పచ్చిమిరప కోసం సాగు చేయాలా, లేక ఎండు మిరపకోసం సాగు చేయాలో ముందుగా నిర్ణయించుకోవాలి. ఆతరువాత మాత్రమే విత్తనాన్ని ఎంపిక చేసుకోవాలి.

విత్తన శుద్ధి విషయానికి వస్తే నారు మడి వేసే ముందుగా విత్తనాన్ని ఎంపిక చేసుకుని వాటిని శుద్ధి చేయాలి. విత్తనం ద్వారా చీడపీడలు వ్యాప్తి చెందకుండా నివారించటానికి విత్తన శుద్ధి అనేది తప్పనిసరిగా చేసుకోవాలి. సంకర రకాలను సాగు చేసేటప్పుడు కొన్ని కంపెనీలు విక్రయానికి ముందుగానే శిలీంధ్ర నాశినితో శుద్ధి చేసి రైతులకు ఇస్తున్నారు. రసం పీల్చే పురుగుల నివారణకు 8గ్రాముల ఇమిడాక్లోప్రిడ్ మందును ఒక కిలో విత్తనానికి పట్టించి నీడలో ఆరబెట్టి విత్తుకోవాలి.

నారుమడి స్ధల ఎంపికకు సంబంధించి రైతులు నారుమడి కోసం స్ధలం ఎంపిక చేసుకునే ముందు ఎప్పుడూ వేసే స్ధలాన్ని కాకుండా మార్చి మార్చి ఎన్నుకోవాలి. దీని వల్ల భూమి నుండి వ్యాపించే శిలీంధ్రాల బెడద తక్కువగా ఉంటుంది. నారుమళ్ళను ఎటువంటి పరిస్ధితుల్లో నీడలోగాని ఇతరత్రా చెట్ల నీడలో గాని పెచరాదు.

నారు మడికి ఎంపిక చేసిన భూమిని బాగా దుక్కిదున్ని ఎత్తైన నారుమళ్ళను తయారు చేయాలి. ఒక ఎకరా నేల సాగు చేసేందుకు 10మీ పొడవు, 1 మీ వెడల్పుగల నాలుగు మడులు అవసరం అవుతాయి. మడికి మడికి మధ్య నీటి కాలువలను ఏర్పాటు చేయాలి. నారుమడిలో రసాయనిక ఎరువులు వేయకుండా తగినంత వానపాముల ఎరువును వేపపిండిని వేసి కలియదున్నాలి.

విత్తన శుద్ధి చేయని రైతులు సెంటు నారుమడికి 80 గ్రా ఫిప్రొనిల్ గుళికలు వేయాలి. దీని వల్ల రసం పీల్చే పురుగులను నారుమడిలో రాకుండా జాగ్రత్త పడవచ్చు. ఎత్తైన నారుమళ్ళలో 8 నుండి 10 సెం.మీ దూరంలో నారుమడికి అడ్డంగా చేతితో గీతలు గీయాలి. అందులో ఒక్కొక్క విత్తనాన్ని పలుచగా విత్తుకోవాలి. దీని వల్ల అన్ని మొక్కలు ధృఢంగా , సమానంగా పెరుగుతాయి. నారుమడిలో విత్తనం కనిపించకుండా వానపాములతో కప్పాలి. ఎకరానికి హైబ్రీడ్ విత్తనం 100 గ్రాములు సరిపోతుంది.

విత్తిన వెంటనే నారుమడిని వరి చెత్తతో కప్పుకోవాలి. ఇలా చేయటం వల్ల తేమ ఉండి మొలకశాతం పెరుగుతుంది. కలుపు రాకుండా ఉంటుంది. విత్తిన వెంటనే వారం రోజల వరకు రోజుకు రెండు సార్లు నీటిని చిలకరించాలి. వారం తరువాత రోజుకు ఒక తడిని ఇవ్వాలి. విత్తనం మొలకెత్తగానే పైన కప్పిన వరి చెత్తను తొలగించాలి. విత్తిన 15 రోజుల తరువాత కలుపు మొక్కలను ఏరివేయాలి.

నారుమళ్ళలో అశించే మాగుడు తెగులు నివారణకు 10 లీటర్ల నీటికి 30 గ్రా కాపర్ ఆక్సీక్లోరైడ్ 3గ్రా లీటరు నీటికి కలిపి 13వరోజు , 20 వరోజు పిచికారి చేసుకోవాలి.