Fish Farming : అనువైన రకాల ఎంపికతో లాభసాటిగా చేపల పెంపకం!

వృక్ష జంతు ప్లవకాలు, మెత్తటి గడ్డి లెమ్నా, హైడ్రిల్లా, వాలిస్నేరియా వంటి నీటి మొక్కలను ఆహారంగా తీసుకుంటాయి. కలుపు మొక్కల బెడద ఎక్కువగా ఉండే కమ్యూనిటీ చెరువులు పంచాయతీ చెరువుల్లో ఈ రకం చేపలు ఎక్కువగా వేసుకుంటే అధిక ఉత్పత్తిని సాధించవచ్చు.

Fish Farming : అనువైన రకాల ఎంపికతో లాభసాటిగా చేపల పెంపకం!

Fish Farming :

Fish Farming : ఇటీవలి కాలంలో చేపల పెంపకం సాంప్రదాయ పద్దతుల్లో చేపట్టేందుక చాలా మంది రైతులు ఆసక్తి చూపిస్తున్నారు. సహజంగా నీటి వనరుల్లో దొరికే అన్ని రకాల చేపలు పెంపకానికి అనువైనవి కావు. తక్కువ కాలంలో ఎక్కువ బరువు పెరిగి , వ్యాధులను తట్టుకుని నిలబడటంతోపాటు, సంతానోత్పత్తిని చేయగల చేపలను పెంపకానికి ఎంపిక చేసుకోవాలి.

పెంపకానికి అనువైన చేపల రకాలు ;

1. బొచ్చె రకం ; ముఖ్యంగా ఈ రకం చేపలు జంతు ప్లవకాలు, ఆల్గే మొక్కలు, కీటకాలు వంటి వాటిని ఆహారంగా తీసుకుని మంచి యాజమాన్య పద్దతులు పాటిస్తే ఏడాదికి 1.5 కేజీల నుండి 4 కేజీల వరకు బరువు పెరుగుతాయి.

2. రాగండి ; ఈ రకం ఎక్కవగా వృక్ష ప్లవకాలు, చిన్న సైజులో ఉండే ఆల్గే, కుళ్లిన పదార్ధాలను తీసుకుంటాయి. ఏడాది కాలంలో 1 నుండి 3 కేజీల వరకు బరువు పెరుగుతాయి. వీటిని చెరువులో అధిక సంఖ్యలో వేసుకుని అధిక ఉత్పత్తి సాధించటానికి వీలు కలుగుతుంది.

3. ఎర్రమైల రకం ; ఇది ఎక్కువగా కుళ్లిన సేంద్రీయ పదార్ధాలను , చనిపోయిన వృక్ష జంతు సంబంద పదార్ధాలను ఆహారంగా తీసుకుంటాయి. ఈ మూడు రకాలు తవుడు, వేరుశెనగ, చెక్క, సోయా చక్క వంటివి వాటిని అనుబంధ ఆహారంగా ఇస్తే అధిక బరువు పెరుగుతాయి. వీటితోపాటు విదేశి రకాలైన గడ్డి చేప, బంగారు తీగ, వెండి చేప రకాలను కూడా పెంచుకోవచ్చు.

4. వెండి చేప ; ముఖ్యంగా నీటి ఉపరితలంలో ఉండే వృక్ష ఫ్లవకాలను ఎక్కువగా ఆహారంగా తీసుకుంటాయి. ఇవి సంవత్సర కాలంలో 1.5 కేజీల నుండి 3 కేజీల వరకు బరువు పెరుగుతాయి.

4. గడ్డి చేప ; ఈ రకం ముఖ్యంగా వృక్ష జంతు ప్లవకాలు, మెత్తటి గడ్డి లెమ్నా, హైడ్రిల్లా, వాలిస్నేరియా వంటి నీటి మొక్కలను ఆహారంగా తీసుకుంటాయి. కలుపు మొక్కల బెడద ఎక్కువగా ఉండే కమ్యూనిటీ చెరువులు పంచాయతీ చెరువుల్లో ఈ రకం చేపలు ఎక్కువగా వేసుకుంటే అధిక ఉత్పత్తిని సాధించవచ్చు. గడ్డి చేప రకం ఒక రోజులో తన శరీర బరువుకు మూడు రెట్ట బరువు ఉండే ఆహారాన్ని తీసుకుంటాయి. ఏడాది కాలంలో 2 నుండి 5 కేజీల బరువు పెరుగుతుతాయి.

5. బంగారు తీగ ; ఈ రకం చేప కీటక లార్వాలు , పురుగులు నీటి అడుగు భాగంలో ఉండే సేంద్రీయ పదార్ధాన్ని ఎక్కువగా ఆహారంగా తీసుకుంటాయి. ఏడాది కాలంలో 1. 5 కేజీల నుండి 4 కేజీల వరకు బరువు పెరుగుతాయి.

రైతులు చేపల పెంపకానికి ఉపయోగించే నీటి వనరులు , ఆహారపు అలవాట్లను బట్టి చేపల రకాలను ఎంచుకోవాలి. అంతేకాకుండా వాతావరణంలో వచ్చే మార్పులను తట్టుకునే విధాంగా ఉండేలా చూసుకోవాలి.