Cultivation Of Marigolds : బంతిపూల సాగులో రైతులు అనుసరించాల్సిన యాజమాన్య పద్దతులు!

మార్కెంట్ డిమండ్ ఆధారంగా బంతిని సాగుచేసి రైతులు అధిక ఆదాయాన్ని పొందవచ్చు . పొలంలో నాటుకొన్న రెండు నెలల తర్వాత నుంచి పూల దిగుబడి మొదలవుతుంది.

Cultivation Of Marigolds : బంతిపూల సాగులో రైతులు అనుసరించాల్సిన యాజమాన్య పద్దతులు!

Cultivation Of Marigolds : వాణిజ్య పరంగా పండించే పూల పంటలలో ప్రదానమైనది బంతిపూల సాగు. అన్ని శుభకార్యక్రమాలకు ఈ పూల వినియోగం అధికంగా ఉంటుంది. కాబట్టి మార్కెట్లో ఈ పూలకు మంచి గిరాకీ లభిస్తుంది. ఆకర్షణీయమైన రంగుల్లో ఎక్కువ కాలం పాటు నిల్వవుండే రకాలు ప్రస్తుతం రైతులు సాగు చేస్తున్నారు. సన్న చిన్నకారు రైతులు తమకున్న కొద్ది పాటి పంటపొలాల్లో బంతిపూల సాగు చేపట్టటం ద్వారా అదాయాన్ని పొందవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

బంతిని అన్ని నేలల్లో సాగు చేయవచ్చు. అయితే సారవంతమైన గరపనేలలు అత్యంత అనుకూలంగా ఉంటాయి. మురుగు నీటి వసతి ఉన్నచో బరువైన నేలల్లో కూడా బంతిని సాగు చేయవచ్చు . ఉష్ణోగ్రతల ప్రభావం పూల సాగుపై ఉంటుంది. ఉష్ణోగ్రతలు  ఎక్కువున్నా పూలపై తీవ్ర ప్రభావం చూపుతుంది . నీడ ప్రదేశాలను బంతి సాగుకు అనుకూలం కాదు.

సాగుకు అనువైన రకాలు ; ఆఫ్రికన్ బంతి రకాలకు గిరాకీ ఎక్కువ . ఇవి ప్రదానంగా పసుపు , నారింజ రంగులతో ముద్దగా ఉండే పూలు నిస్తాయి. వీటికి మార్కెట్ విలువ ఎక్కువ . ఈ మొక్కలు ఎత్తుగా , ఏపుగా పెరిగి పెద్ద పూలనిచ్చే రకాలు. పూసా నారింగ గైండా , పూసా బసంతి గైండా , అర్కా బంగార , మరియు అర్కా అగ్ని , అర్కా బంగార -2 రకాలను సాగు చేయటం ద్వారా మంచి దిగబడిని పొందవచ్చు. అయితే ఇవి కాండం కత్తిరింపుల ద్వారా మాత్రమే వ్యాప్తి చేసుకోవచ్చు . ఈ రకాలలో విత్తనం ఉండదు. అర్క పరి , అర్క హని రకాలు మంచి దిగుబడినిస్తున్నాయి .

వాణిజ్య పరంగా ఆ బంతిని విత్తనాల ద్వారా వ్యాప్తి చేస్తారు. ఎకరానికి సరిపడానారు పెంచడానికి 800 గ్రాము విత్తనం అవసరమవుతుంది . మొలకశాతం బాగా ఉంటే ఎకరానికి 400 – 500 గ్రాము విత్తనం సరిపోతుంది. నారు పెంచడానికి 15cm ఎత్తు 1 మీ వెడల్పు ఉన్న మడులను చేసుకొని , ఒక చదరపు మీటర్ మడికి 8-10 కిలోల పశువుల ఎరువు తో మట్టి వేసి వెంటనే బాగా కలపాలి . విత్తనాలు వారంలో మొలకెత్తుతాయి . విత్తనాలను ప్రోటెలలో నాటినట్లుయితే బలమైన నారు మొక్కలను తయారు చేసుకోవచ్చు.

నాటుకొనే సమయానికి సంబంధించి బంతిని అన్ని కాలాలకు సాగుచేసినప్పటికీ , ఒకనెల తేడాలో జూలై మొదటి వారం నుండి ఫిబవరి మొదటి వారం వరకు నాటుకుంటే  సెప్టెంబర్ నుండి ఏప్రిల్ వరకు పూలు సరఫరా చేయవచ్చు. సాధారణంగా సెప్టెంబర్ , అక్టోబర్లో నాటుకున్న పంట నుండి మంచి నాణ్యమైన పువ్వులతో పాటు దిగుబడిని పొందవచ్చు.

మల్చింగ్, డ్రిప్ విధానంలో సాగుచేసుకొనే వారు 15 సెం.మీ ఎత్తు , 3 ఫీట్ల మొల్పుగల బెడ్ లపై 60 x 45 సెంమీ 60×60 సెంమీ దూరంలో త్రీకోణాకారంలో నాటుకోవాచ్చు. దుక్కిలో ఎకరానికి 8-10 టసుల పశువుల ఎరువు వేసి కలియదున్నాలి . వీటితో పాటు ఎకరానికి 30-40 కిలోల నత్రజని , 80 కేజీల భాస్వరం మరియు 80 కిలోల పొటాష్ నిచ్చే ఎరువు వేసి దున్నుకోవాలి . మొక్కలు నాటుకొన్న 30 రోజుల తర్వాత మరో 40 కిలోల నత్రజనిచ్చే ఎరువులను  వేసుకోవాలి.

వర్షాకాలంలో బంతిపూల సాగులో కలుపు బెడదా అధికంగా ఉంటుంది . పంట కాలంలో 3-4 సార్లు కూలీల సహాయంతో కలుపును తీయించాలీ. కలుపు నివారించక పోతే బంతి మొక్కలలో పోషకాలు నీటికోసం పోటీపడి బంతి పూల దిగబడిని , నాణ్యతను తగ్గిసాయి. సాధారణంగా బంతి మొక్కలు ఒక ప్రధానకారణంతో ఏపుగా పెరుగుతాయి .ఆ తరువాత శాఖలు ఏర్పడతాయి . అందువల్ల మొక్కలు నాటిన  10 రోజులకు తలలు తుంచడం  వల్ల ప్రధాన కాండం పెరుగుదల ఆగిపోయి , పక్క నుంచి కొత్త కోమటలు ఏర్పడుతాయి.

సాధారణంగా ఆఫ్రికన్ రకాలు ఎకరానికి 4-5టన్నులు హైబ్రిడ్ రకాలు 6-8 టన్నులు పూల దిగుబడినిస్తాయి. మార్కెంట్ డిమండ్ ఆధారంగా బంతిని సాగుచేసి రైతులు అధిక ఆదాయాన్ని పొందవచ్చు . పొలంలో నాటుకొన్న రెండు నెలల తర్వాత నుంచి పూల దిగుబడి మొదలవుతుంది. మొదటి కోత నుంచి మంచి రెండు లేదా రెండున్నర నెలల వరకు పూత వస్తుంది. పువ్వులు విచ్చుకున్న తరువాత ఉదయం లేదా సాయంతం వేళల్లో కోయడం మంచిది . పువ్వులకు ముందు నీరు ఇచ్చినట్లయితే పువ్వులు తాజాగా ఎక్కువకాలం నిల్పడటాయి . పూలను 3 నుండి 5 రోజులకొకసారి తీసుకోవచ్చు . కోసిన తరువాత పువ్వులను తడిసిన గోనె లేదా వెదురు బుట్టలో ఉంచి తడిగుడ్డును కప్పి మార్కెట్ తరలించాలి .